For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

SPORTS NEWS : టీ 20 మ్యాచ్ నిర్వహణకు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు : కమీషనర్ సుధీర్ బాబు ఐపిఎస్

11:36 PM Oct 07, 2024 IST | Sowmya
UpdateAt: 11:36 PM Oct 07, 2024 IST
sports news   టీ 20 మ్యాచ్ నిర్వహణకు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు   కమీషనర్ సుధీర్ బాబు ఐపిఎస్
Advertisement

SPORTS NEWS : ఉప్పల్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో త్వరలో జరగనున్న టీ 20 క్రికెట్ మ్యాచ్ నిర్వహణకు సంబంధించిన భద్రతా ఏర్పాట్ల గురించి రాచకొండ కమిషనర్ సుధీర్ బాబు ఐపిఎస్ గారు ఉప్పల్ స్టేడియంలో డీసీపీలు, ఏసిపిలు, జిహెచ్ఎంసి, ఫైర్, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుంచి మరియు హైదారాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రతినిధులతో కలిసి సమీక్షా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా సీపీ గారు మాట్లాడుతూ... రాచకొండ కమిషనరేట్ పరిధిలో జరగనున్న మ్యాచ్ నిర్వహణకు అవసరమైన అన్ని రకాల సెక్యూరిటీ పరమైన జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు తెలిపారు. రాచకొండ కమిషనరేట్ పరిధిలో క్రికెట్ పోటీలు నిర్వహించడం గొప్ప అవకాశం అని, ఎన్ని సవాళ్ళు ఎదురైనా తగిన విధంగా పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని, ప్రేక్షకులకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా బందోబస్తు ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించినట్టు పేర్కొన్నారు. టికెట్ల పంపిణీలో ఎటువంటి గందరగోళం లేకుండా చూడాలని నిర్వహణ బృందానికి సూచించారు.

Advertisement

ప్రేక్షకులకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా ఉండేందుకు అవసరమైన పార్కింగ్ ఏర్పాట్లు చేయాలని సూచించారు. సాధారణ వాహనదారుల రాకపోకలకు ఎటువంటి ఇబ్బందులూ లేకుండా, ఉప్పల్ ప్రధాన రహదారి మీద ట్రాఫిక్ జామ్ ఏర్పడకుండా ఏర్పాట్లు చేయాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. స్టేడియం పరిసరాల్లో సీసీటీవీలను ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రతీ ఒక్కరి కదలికలూ సీసీటీవీ కెమెరాల్లో నిక్షిప్తం అవుతాయని పేర్కొన్నారు. నకిలీ టికెట్లు అమ్మేవారిపైన కఠిన చర్యలు తీసుకుంటామని, టికెట్ల పంపిణీ పూర్తి పారదర్శకంగా జరుగుతుందని, ఎటువంటి పుకార్లనూ నమ్మవద్దని తెలిపారు.

ఈ సమావేశంలో డిసిపి మల్కాజ్ గిరి పద్మజ ఐపిఎస్, హెచ్ సి ఎ ప్రెసిడెంట్ జగన్మోహన్రావు, హెచ్ సిఎ vice ప్రెసిడెంట్ దల్జీర్ సింగ్, డీసీపీ ఎస్బి కరుణాకర్, డీసీపీ క్రైమ్ అరవింద్ బాబు, ఎస్ఓటి డిసిపి రమణారెడ్డి, విమెన్ సేఫ్టీ డిసిపి ఉషా విశ్వనాథ్, అడిషనల్ డిసిపి శ్యామ్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Tags :
Author Image