For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

AP Politics : ముఖ్యమంత్రి జగన్ పై రాయితో దాడి ఎవరు చేయించారు ? ప్రత్యేక విశ్లేషణ by సీనియర్ జర్నలిస్ట్ ఆది

12:12 PM Apr 16, 2024 IST | Sowmya
Updated At - 12:12 PM Apr 16, 2024 IST
ap politics   ముఖ్యమంత్రి జగన్ పై రాయితో దాడి ఎవరు చేయించారు   ప్రత్యేక విశ్లేషణ by సీనియర్ జర్నలిస్ట్ ఆది
Advertisement

రాళ్ల‌లోనే వేయించుకున్న రాయి
వేసిన రాయి.. వేరు వేర‌యా
విశ్వ‌దాభి రామ‌ వినుర బాబూ! 

ప్ర‌స్తుతం సింప‌తీల కాలం న‌డుస్తోంది.. రాళ్లు వేయించుకోవ‌డం.. వేయ‌టం.. త‌ర్వాత వారి మీద ఎంక్వ‌యిరీలు విచార‌ణ‌లు.. ఈలోగా ఎలెక్ష‌న్లు రావ‌డాలు.. వాటి ద్వారానే వీరు గెలిచార‌ని అన‌డాలు.. అబ్బో ఇదో పెద్ద ప్ర‌హ‌స‌నం.. ఎక్క‌డెక్క‌డో ఎవ‌రెవ‌రో.. ఇలా దాడులు జ‌రుగుతూనే ఉంటాయ్.. ఇదో అటాకింగ్ సీజ‌న్ అన్న‌మాట‌.. జ‌గ‌న్ మీద క్యాట్ బాల్ తో రాళ్ల దాడి జ‌రిగింద‌న‌గానే బాబు మీద కూడా రాళ్ల వ‌ర్ష‌మే..

Advertisement GKSC

నిజంగానే ఇలాంటివి చెప్పి చేయించుకుంటారా? లేక వాళ్లంత‌ట వాళ్లే వేస్తారా? ఇప్పుడిదో తొక్క‌లో స‌బ్జెక్టూ.. దీనిపై చ‌ర్చ‌.. నో నాట్ నెస్సెస్స‌రీ అని పైకి  అనాల‌నిపించినా.. ఇందులోనూ ఒక లోతుందండోయ్.. అనాల‌నిపించేదే.. ఇంత‌కీ ఏంటా చ‌ర్చ‌.. దాని పూర్తి వివ‌రాలేంటి ? , నాకున్న ముఖ్యానుమానాలేంటి? అని నాకు నేను ప్ర‌శ్నించుకుంటే.. తొట్ట తొలిగా ఈ క‌ల్చ‌ర్ వ‌చ్చిన పేరు సాధించిన‌ది మాత్రం చంద్ర‌బాబుదిగానే చెబుతారు.. కాంగ్రెస్ వారు..(అయినా చంద్ర‌బాబు అన‌గా ఇలాంటి (అ)నాగ‌రీక‌త‌లెన్నిటిని ప్ర‌వేశ పెట్టాడో.. అన్న‌ది మ‌రో వ‌ర్గం వారి వాద‌న‌).

మ‌ల్లెల బాబ్జీ అనే ఒక‌త‌ను స‌రిగ్గా ఇలాగే 1984, జ‌న‌వ‌రి 9న ఎల్బీ స్టేడియంలో.. ఎన్టీఆర్ మీద ఒక చిరుక‌త్తితో గాయం చేయ‌డం.. ఆ గాయం కార‌ణంగా ఎన్టీఆర్ ఒక వారం ప‌ది రోజుల పాటు పెద్ద క‌ట్టు క‌ట్టుకోవ‌డం వ‌గైరా వ‌గైరా అప్ప‌ట్లో కాంగ్రెస్ వ‌ర్గాల్లో అతి పెద్ద చ‌ర్చ‌... డిబేటూ డిస్క‌ష‌నూ. (ఎందుకంటే ఇలాంటి ఐడియాలు మ‌న‌కెందుకు రావ‌డం లేదూ అన‌ట‌) అన్న‌గారి ప‌రిపాల‌న ఏడాది పూర్త‌యిన సంద‌ర్బంగా ఏర్పాటు చేసిన స‌భ‌లో బాబ్జీ ఇప్ర‌కారంబుగా.. అన్న‌గారి మీద దాడి చేయ‌డం అనే ఘ‌ట‌న న‌మోద‌య్యింది అప్ప‌ట్లో..

ఇంత‌కీ బాబ్జీ అనే ఈ బాప‌తుకు ఎందుక‌ని.. అన్న‌గారి మీద దాడి చేయాల‌నిపించింది.. అంటే అప్ప‌ట్లో.. అదేమీ.. బెజ‌వాడ సింగ్ న‌గ‌ర్ ప్రాంత‌మూ కాదు.. బోండా ఉమ అనుచ‌రులూ పెద్ద అక్క‌డ లేరు.. అయినా అదో కాక‌తాళీయంగా యాధృచ్చికంగా.. అనుకోకుండా అలా జ‌రిగిపోయిందంతే.. అన్న‌ది టీడీపీ వాద‌న అయితే.. ఇదే కాంగ్రెస్.. అప్ప‌ట్లో ఇప్ప‌టి టీడీపీ పాత్ర పోషించేదిట‌.. ట‌.. ట‌..

గ‌త ఎన్నిక‌ల్లో కోడి క‌త్తి, ఈ ఎన్నిక‌ల‌పుడు.. చిన్న‌పాటి క్యాట్ బాల్ రాయి.. ఇలాంటి దాడులు జ‌రిగిన‌పుడు టీడీపీ ఎలా ఇదంతా డ్రామా డ్రామా డ్రామా.. అని అంటుందో.. అప్ప‌ట్లో కాంగ్రెస్ కూడా ఇలాగే అరిచి గీ పెట్టేదిట‌.. ట‌.. ట‌..  వాడెవ‌డో ఒక‌డు రాశాడు.. రాజ‌కీయప‌రంగా సెంటిమెంటు డ్రామాల‌ను ర‌క్తి క‌ట్టించ‌డంలో నువ్వు తోపు జ‌గ‌న్ అన్న‌ట్టు.. ఆనాడు.. ఎన్టీఆర్ తాను తెర మీద మాత్ర‌మే న‌టుడ్న‌ని తెగ బాధ ప‌డ్డా.. తెర బ‌య‌ట ఆయ‌న చేత ఎంత న‌టింప చేయాలో చంద్ర‌బాబు ద‌ర్శ‌క‌త్వ ప్ర‌తిభ అంత అమోఘంగా ప‌ని చేసింద‌నీ అంటారు. అందుకు బాబ్జీ ఉదంత‌మే ఒక ఉదాహ‌ర‌ణ‌గానూ చెబుతారు కాంగ్రెసీయులు..

ఇదంతా అటుంచితే.. ఇప్పుడీ రాయి ఎవ‌రేశారు... ఉమ అనుచ‌రులా ? లేక వైసీపీయులా ? వేస్తే ఎలా వేశారు ??? అంత స‌రిగ్గా ఎలా త‌గిలింది... ఇప్పుడు ఒక రాయి అన్న‌ది పుచ్చుకుని దాన్ని పుచ్చె ప‌గిలేలా కొట్ట‌డం అన్న ప్ర‌క్రియ అన్న‌ది అంత సామాన్య‌మైన‌ది కాదు.. ఇదే రాళ్ల వ‌ర్షం\ స్టోన్ పెల్టింగ్ అనే ఉదంతం చంద్ర‌బాబు మీద కూడా ప‌డ్డ‌ప్పుడు.. అదేమంత గురిగ్గా స‌రిగ్గా త‌గ‌ల్లేదెందుకుని.. దాన్లో అంత డెన్సిటీ లేదు కార‌ణ‌మేంటి ? పూల వ‌ర్షంలా రాళ్ల వ‌ర్షం అన్న‌ట్టుగా లైట‌ర్ వ్యాన్ లో జ‌రిగింది రీజ‌నేంటి? అన్న అనుమానాలు పొడ‌సూపుతున్నాయ్.. ఒక్కొక్క‌టిగా పురివిప్పుతున్నాయ్..

నిజంగా కొంద‌రు నిపుణులు చెప్పే మాట‌ల‌ను అనుస‌రించి.. చెబితే.. ఈ కాట‌ర్ పిల్ల‌ర్ అన్న‌ది కొన్ని జీవుల‌ను చంప‌డానికి వాడే ఒక ప‌రిక‌రంగా చెబుతారు..దీంతో గురి చూసి క‌ణ‌త‌ల మీద కొడితే.. చ‌నిపోయే ప్ర‌మాదం లేక పోలేద‌న్న‌ది ఒక మాట‌.. దానికి తోడు ఎవ‌డైనా.. నా చావు త‌ప్పి క‌న్ను లొట్ట‌బోవాల‌ని త‌న మ‌నుషుల‌ను పుర‌మాయించుకోవ‌డం సాధ్య‌మేనా ? ఒక మ‌నిషి కంటి పై భాగంలో త‌గిలి.. త‌ర్వాత ప‌క్క మ‌నిషి క‌న్ను తీవ్రంగా డ్యామేజీ కావ‌డం అన్న‌ది మాములు విష‌యం కాదు.. క‌దా ? ప్రాణాల‌కు తెగించి ఇంత‌గా సాహ‌సిస్తారే ఎవ‌రైనా ?

వాడెవ‌డికో గీతాంజ‌లి మీద ప‌చ్చి బూతు కామెంటు పెట్టాల‌న్న త‌ప‌న తాప‌త్రం ఉన్న బోండా ఉమ అనుచ‌రుడైన రాంబాబుకు ఉన్నంత క‌సీ\ క్రోధం ఉంటే త‌ప్ప‌.. అది సాధ్య‌మ‌య్యే విష‌యమేనా.. హిజ్ సెల్ఫ్.. హీ హ్యావ్ స‌మ్ థింగ్ స్సెష‌ల్ ఇన్టెన్ష‌న్ ఆన్ జ‌గ‌న్ అన్న‌ట్టుగా ఉంది క‌దూ ఇదంతా.. అంటారు కొంద‌రు విశ్లేష‌కులు. చంద్ర‌బాబైనా ఒకింత మంచి ట్వీట్ తో జ‌గ‌న్ గాయానికి ట్రీట్మెంట్ చేసే య‌త్నం చేశాడుగానీ.. లోకేష్ అయితే నేరుగా ఇది తాడేప‌ల్లి నుంచి వ‌చ్చిన రాయిగా వెంట‌నే రియాక్ట‌య్యి.. న రాయో న భ‌విష్య‌తి అనిపించాడు.. లెట్ హిమ్ ఎక్స్ ప్రెస్ హిజ్ ఓన్ ఒపీనియ‌న్.. భావ ప్ర‌క‌ట‌నా స్వేచ్ఛ‌ను మ‌ర‌ద‌లితో స‌ర‌సాలాడిన‌ట్టు ఆడ‌మ‌నండి.. పెద్ద‌గా అడ్డు చెప్ప‌కండి.. ప్లీజ్!

ఇంకా ఇంకా ఇలాంటి ఎన్నో ట్వీట్ల ప‌రంప‌ర‌ను కూడా నెటిజ‌న్లు చూసే ఉంటారు.. వాటిలోని బిట్వీన్ ద ట్వీట్స్ ఏంటో అర్ధ‌తాత్ప‌ర్యాల‌తో స‌హా అవ‌గ‌తం చేసుకునే ఉంటారు.. ఇప్పుడు ఈ స‌బ్జెక్టును ఎలా ఎండ్ చేయాలీ ? ఆ.. ఒక వేళ వాడు నిజంగానే సెట‌ప్ అయితే.. ఎలా ఉంటుంది ? కాకుంటే ఎలా ఉంటుందీ అన్న‌దే మ‌న తీవ్ర ప‌రిశోధ‌న‌.. క‌దూ మ‌రిచే పోయా.. మ‌ల్లెల బాబ్జీ అత‌డు రాసిన లేఖ‌లు.. ఆ పై క‌మీష‌న్లు.. ఇదే ఉందంతం మీద ఇద్ద‌రు ఒక‌రు విజ‌య‌రామారావు, మ‌రొక‌రు శ్రీరాములు..
అనే వారు త‌ద‌నంత‌ర కాలంలో టీడీపీలోకి రావ‌డం.. విజ‌య‌రామారావు అయితే ఏకంగా మంత్రి కావ‌డం... ఆపై ఆయ‌న‌ రాక కార‌ణంగా కేసీఆర్ టీడీపీ వీడ‌టం.. టీఆర్ఎస్ అనే పార్టీ స్థాప‌న చేయ‌డం.. ఇక్క‌డ టీడీపీ ఉనికిని ప్ర‌శ్నార్ధ‌కం చేయ‌డం.. వంటివెన్నో ఉన్నాయ్..

అంటే ఒక్క మ‌ల్లెల బాబ్జీ.. అత‌డు ఎన్టీఆర్ మీద చేసిన దాడి.. దానికార‌ణంగా అత‌డి ప్రాణాలు పోవ‌డం.. ఆపై రాష్ట్ర రాజ‌కీయ స‌మీకర‌ణాలు మార‌డం.. చాలానే ప‌రిణామ‌క్ర‌మాలున్నాయ్.. అంటారు కొంద‌రు మ‌రికొంద‌రు రాజ‌కీయ విశ్లేష‌కులు.. ఇదిలా ఉంటే.. ఒక కోడి క‌త్తి కావ‌చ్చు.. అత‌డేం బాబ్జీలా బ‌ల‌వ‌న్మ‌ర‌ణానికో.. మ‌రొక‌టో ఇంకొక‌టో పాల్ప‌డ‌లేదు.. ఇప్పుడీ రాయి ఘ‌ట‌నాకార‌కుడు త‌ప్ప‌కుండా బౌన్స‌ర్ బాస్- బోండా ఉమ అనుచ‌రుడై అయి ఉంటాడ‌న్న‌ది ప్ర‌త్య‌క్ష సాక్షుల మాట‌.. ఇత‌డు రేప‌టి రోజు అరెస్ట‌యినా.. ఎవ్వ‌రూ ఇత‌డ్ని ఆత్మ‌హ‌త్య‌ల‌కు ప్రేరేపించేంత స్థాయికి వ్య‌వ‌హారం వెళ్ల‌ద‌నే అనుకుందాం..

ఇప్పుడు మ‌రో కామెంట్ ఏంటంటే.. బాబాయ్ లాంటి డెడ్ బాడీ దొర‌క‌న‌పుడు త‌నే డెడ్ బాడీ అయిపోతాడు అన్నియ్య అనే ఒకానొక గోదారి యాసతో కూడిన ఎట‌కారం.. అంత తేలికైన విష‌య‌మేనా ? ఇదే రాయితో బాబును, లోకేష్ ని కొట్టించుకోమ‌నండీ అన్న వైసీపీయుల వాద‌న‌తో ఏకీభ‌వించేవారెంద‌ర‌ని ??? అయినా ఇలాంటి విష‌యాల్లో ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఎందుకో స్పందించ‌డు.. కార‌ణాలు ఏమై ఉంటాయ‌ని ? ఆఖ‌ర్న ష‌ర్మిళ కూడా స్పందించింది క‌దా ? అన్న‌ది ఇంకో టాపిక్.. వీట‌న్నిటిని బ‌ట్టీ చూస్తే ఏతా వాతా ఏమి చెప్పాల్సి వస్తుంది..

రాళ్ల‌లోన వేయించుకున్న రాయి..  వేసిన రాయి వేరు వేర‌యా అని చెప్పాల‌ని ఉంది.. మ‌రి వాస్త‌విక ప‌రిస్థితులు ఎలాగెల‌గ ఉంటాయో ఏంటో.. *ఇప్పుడు టిడిపి వాళ్లు అంటున్నట్టుగానే అప్పట్లో కాంగ్రెసువాళ్లు యిది టిడిపి సింపతీ కోసం ఆడించిన డ్రామా అని, దాని స్క్రీన్‌ప్లే బాబుదే అని అన్నారు. ఆ తర్వాత 1987 నవంబరులో బాబ్జీ ఆత్మహత్య చేసుకోవడం, దానిపై ఎన్టీయార్‌ ప్రభుత్వమే జస్టిస్‌ శ్రీరాములు కమిటీ వేయడం, ఆయన యిచ్చిన నివేదిక టిడిపిని యిరకాటంలోకి నెట్టడం జరిగింది. చనిపోతూ బాబ్జీ రాసిన రెండు లేఖల్లో వివరాలన్నీ ఉన్నాయి. వాటి ప్రకారం పబ్లిక్‌ సింపతీ కోసం ఎన్టీయార్‌ అల్లుడు చంద్రబాబే యీ పథకాన్ని రచించారు. ఉద్యోగమిస్తాం, 3 లక్షలిస్తాం, యీ నాటకమాడు అని బాబ్జీని 30 వేల అడ్వాన్సు యిచ్చి దింపారు. బాబ్జీని పోలీసులు పట్టుకోగానే ఎన్టీయార్‌ క్షమించేశానన్నారు. కానీ పోలీసులు జైల్లో పెట్టి కేసు నడిపారు. ఇలా ఆనాటి జ్ఞ‌ప‌కాల‌ను ఒక‌సారి గుర్తొచ్చి.. ఈ ట‌పా పెడుతున్నా.. ఏమ‌నుకోకండే !!!

ప్రత్యేక విశ్లేషణ by సీనియర్ జర్నలిస్ట్ ఆది

Advertisement
Author Image