For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

ఈ రోజు సాయంత్రం 6 గంటలకు STAR Maa లో ప్రసారం కానున్న స్టార్ మా పరివార్ అవార్డ్స్

05:33 PM Oct 20, 2024 IST | Sowmya
Updated At - 05:33 PM Oct 20, 2024 IST
ఈ రోజు సాయంత్రం 6 గంటలకు star maa లో ప్రసారం కానున్న స్టార్ మా పరివార్ అవార్డ్స్
Advertisement

హైదరాబాద్ : ఎన్ని పనులయినా ఉండని… సాయంత్రం 6 గంటలకు మొదలయ్యే సీరియల్ పండుగ రాత్రి 10 గంటల వరకూ నిరాటంకం గా జరిగిపోతూనే ఉంటుంది. అందునా… స్టార్ మా సీరియల్స్ కు ఒక ప్రత్యేకమైన ఆదరణ ఉంది. అభిమానులూ ఉన్నారు. కార్తీక దీపం లో దీప ను తమ ఇంటి అమ్మాయిగా చూసుకున్నా… లేదంటే మరో సీరియల్ లో మరో క్యారెక్టర్ అయినా… మనసును తట్టి లేపే కథ, కథనాలతో ఆకట్టుకునేవి స్టార్ మా సీరియల్స్.

ఉత్తమ భర్త, భార్య, అత్త, నాన్న.. కనుమరుగవుతున్న బంధాల వేళ.. ఆ బంధాలలోని గొప్పతనం ను మరింత గొప్పగా చూపుతున్న ఈ సీరియల్స్ లోని నటులు, సాంకేతిక వర్గం కోసం ప్రతి ఏటా అందించే స్టార్ మా పరివార్ అవార్డ్స్ కార్యక్రమం ఈ రోజు స్టార్ మా టీవీ లో ప్రసారం కాబోతుంది. సీరియస్ గా సీరియల్స్ లో కనిపించే నటీనటుల అసలైన క్యారెక్టర్ చూపుతూనే, పలు విభాగాలలో అవార్డ్స్ ను సైతం అందించనున్నారు. టాలీవుడ్ కింగ్ నాగార్జున ముఖ్య అతిధిగా విచ్చేసిన ఈ కార్యక్రమంలో పలువురు స్టార్ హీరోలు, ప్రముఖులు పాల్గొన్నారు.

Advertisement GKSC

అక్కినేని నాగేశ్వరావు శతజయంతి పురస్కరించుకొని టీవీ నటులు, అక్కినేని ని గుర్తు చేస్తూ చేసిన మెడ్లీ ఈ కార్యక్రమంలో హైలైట్ గా నిలువనుంది. ఇలాంటి వే మరెన్నో విశేషాలు కోసం ఈ ఆదివారం అంటే నేటి సాయంత్రం 6 గంటలకు స్టార్ మా టీవీ లో ప్రసారమయ్యే స్టార్ మా పరివార్ అవార్డ్స్ కార్యక్రమం చూసేయండి.

Advertisement
Author Image