For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

Sr NTR : ఎన్టీఆర్ మనదేశం 75ఇయర్స్ వజ్రోత్సవ వేడుక

12:53 PM Dec 06, 2024 IST | Sowmya
UpdateAt: 01:13 PM Dec 06, 2024 IST
sr ntr   ఎన్టీఆర్ మనదేశం 75ఇయర్స్ వజ్రోత్సవ వేడుక
Advertisement

ManaDesam Movie : నటరత్న పద్మశ్రీ డా. యన్.టి. రామారావు గారు నటించిన ప్రప్రథమ చిత్రం "మన దేశం" 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా డిసెంబర్ 14వ తేదిన విజయవాడలో ఒక వేడుకను చేయుటకు నిర్ణయించడమైనది.

ఆ వేడుక ఏర్పాట్లను గురించి చర్చించుటకు తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి హైదరాబాద్ కార్యాలయంలో 04-12-2024వ తేదిన సాయంత్రం 4 గంటలకు తెలుగు చలన చిత్ర పరిశ్రమకు చెందిన తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి, తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి, తెలంగాణా స్టేట్ చలన చిత్ర వాణిజ్య మండలి, తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఎంప్లాయిస్ ఫెడరేషన్, తెలుగు సినీ రైటర్స్ అసోసియేషన్, తెలుగు సినీ దర్శకుల సంఘం ప్రతినిధి అందరూ కలిసి పై వేడుకను గురించి వివరముగా చర్చించడం జరిగినది. ఈ వేడుకకు సినీ ప్రదర్శకులు, సినీ పంపిణీదారులు, సినీ నిర్మాతలు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొనుటకు నిర్ణయించడమైనది.

Advertisement

Nandamuri Rama Krishna, NTR Centrary Committee Chairman TD Janardhan Reddy, Telugu Film Industry council, Telangana State Film industry council , Telugu Film Industry Employees Federation, Telugu Cine Writers Association, Telugu Film Directors Association.

Advertisement
Tags :
Author Image