For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

COVID NEWS: డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబ్ & అపోలో హాస్పిటల్స్‌ ల "స్పుత్నిక్‌ వీ" వ్యాక్సిన్‌ ఈ రోజు నుండే ప్రారంభం

02:56 PM May 11, 2024 IST | Sowmya
Updated At - 02:56 PM May 11, 2024 IST
covid news  డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబ్   అపోలో హాస్పిటల్స్‌ ల  స్పుత్నిక్‌ వీ  వ్యాక్సిన్‌ ఈ రోజు నుండే ప్రారంభం
Advertisement

Sputnik V COVID-19 Vaccine, Dr Reddy's Labs, Appolo Hospitals, Latest Telugu News, Covid News,

COVID NEWS: డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబ్ & అపోలో హాస్పిటల్స్‌ ల "స్పుత్నిక్‌ వీ" వ్యాక్సిన్‌ ఈ రోజు నుండే ప్రారంభం

Advertisement GKSC

* డాక్టర్‌ రెడ్డీస్‌ ప్రయోగాత్మక కార్యక్రమంలో భాగంగా ఆ సంస్థతో భాగస్వామ్యం చేసుకుని 'స్పుత్నిక్‌ వీ' వ్యాక్సిన్‌లను అందించబోతున్న అపోలో హాస్పిటల్స్‌.
ఈ ప్రయోగాత్మక కార్యక్రమంలో డాక్టర్‌ రెడ్డీస్‌ దిగుమతి చేసుకున్న మొదటి బ్యాచ్‌ 1,50,000 వ్యాక్సిన్‌లను అందించనున్నారు

* అపోలో హాస్పిటల్స్‌ (అపోలో), సుప్రసిద్ధ భారతీయ బహుళ జాతి ఔషద సంస్థ డాక్టర్‌ రెడ్డీస్‌ లేబరేటరీస్‌ (డాక్టర్‌ రెడ్డీస్‌) ప్రయోగాత్మక కార్యక్రమాన్ని స్పుత్నిక్‌ వీ వ్యాక్సిన్‌ను భారతదేశంలో ఆవిష్కరించడంలో భాగంగా ప్రారంభించినట్లు వెల్లడించాయి. ఈ కార్యక్రమ మొదటిదశ హైదరాబాద్‌లో సోమవారం (మే 17,2021) అపోలో హాస్పిటల్‌ వద్ద ప్రారంభం కాగా, విశాఖపట్నంలో మంగళవారం (మే18,2021) ఈ వ్యాక్సినేషన్‌ ప్రక్రియ అపోలో హాస్పిటల్‌ వద్ద టీకాలను వేయడంతో ప్రారంభమవుతుంది. ఈ టీకా ప్రక్రియ కోవిన్‌ లో నమోదు చేసుకోవడం సహా ప్రభుత్వం సూచించిన ప్రామాణిక ప్రక్రియలను సైతం అనుసరిస్తుంది.అపోలో హాస్పిటల్స్‌ ఎంటర్‌ప్రైజెస్‌ లిమిటెడ్‌, హాస్పిటల్‌ డివిజన్‌ అధ్యక్షులు డాక్టర్‌ కె హరి ప్రసాద్‌ మాట్లాడుతూ ప్రైవేట్‌ రంగంలో సైతం టీకా కార్యక్రమాలను తెరువడంతో తాము తమ ఆస్పత్రి నెట్‌వర్క్‌ వ్యాప్తంగా టీకా కేంద్రాలను తెరువడం ద్వారా వ్యాక్సినేషన్‌ ప్రక్రియను వేగవంతం చేసేందుకు తమ ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్నామన్నారు. అలాగే కార్పోరేట్‌ సంస్థల ప్రాంగణాలలో సైతం ఈ టీకా ప్రక్రియను నిర్వహించేందుకు సైతం చర్చలు జరుపుతున్నారు. తాము ప్రస్తుతం దేశవ్యాప్తంగా అపోలో హాస్పిటల్స్‌, అపోలో స్పెకా్ట్ర హాస్పిటల్స్‌, అపోలో క్లీనిక్స్‌ సహా 60కు పైగా కోవిడ్‌ టీకా కేంద్రాలలో టీకాలను వేస్తున్నామన్నారు. ఈ ప్రయోగాత్మక దశలో డాక్టర్‌ రెడ్డీస్‌, అపోలో సంయుక్తంగా, ఆవిష్కరణ కోసం తగిన వసతులు, కోల్డ్‌ చైన్‌ రవాణా వంటి అంశాలను పరిశీలించనున్నాయన్నారు. స్పుత్నిక్‌ వీ వ్యాక్సిన్‌తో టీకా లభ్యతను అతి సులభతరం చేయడంతో పాటుగా అధికశాతం మందికి కోవిడ్‌ టీకాలను అందుబాటులో ఉంచడంలో తమ వంతు తోడ్పాటునందించగలమనే నమ్మకంతో ఉన్నామన్నారు.

* డాక్టర్‌ రెడ్డీస్‌ లేబరేటరీస్‌, బ్రాండెడ్‌ మార్కెట్స్‌ (ఇండియా అండ్‌ ఎమర్జింగ్‌ మార్కెట్స్‌) –సీఈవో ఎం వీ రమణ మాట్లాడుతూ భారతదేశంలో స్పుత్నిక్‌ వీ వ్యాక్సిన్‌ ఆవిష్కరణలో భాగంగా అపోలో హాస్పిటల్స్‌తో భాగస్వామ్యం చేసుకోవడం పట్ల చాలా సంతోషంగా ఉన్నామన్నారు. ఈ ప్రయోగాత్మక కార్యక్రమాన్ని మరింత విస్తృతం చేయడంతో పాటుగా ఇతర నగరాలకు సైతం తీసుకువెళ్లనున్నామన్నారు. రాబోయే కొద్ది నెలల్లో వీలైనంత ఎక్కువ మంది భారతీయులకు ఈ టీకాలను వేయనున్నామన్నారు.ఈ ప్రయోగాత్మక కార్యక్రమం కోసం స్పుత్నిక్‌ వీ టీకాలను డాక్టర్‌ రెడ్డీస్‌ తాము దిగుమతి చేసుకున్న మొదటి బ్యాచ్‌ 1,50,000 టీకా మోతాదు నుంచి సరఫరా చేయనుంది. హైదరాబాద్‌, విశాఖపట్నంలలో ఈ ప్రయోగాత్మక కార్యక్రమం తరువాత దీనిని ఢిల్లీ, ముంబై, బెంగళూరు, అహ్మదాబాద్‌, చెన్నై, కోల్‌కతా, పూనె లలో ఆరంభించనున్నారు.

అపోలో హాస్పిటల్స్‌ గురించి :
* భారతదేశంలో మొట్టమొదటి కార్పోరేట్‌ ఆస్పత్రిగా అపోలో హాస్పిటల్‌ను చెన్నైలో 1983లో డాక్టర్‌ ప్రతాప్‌ సీ రెడ్డి ప్రారంభించారు. ఇప్పుడు అత్యున్నతమైన, విశ్వసనీయ, సమగ్రమైన ఆరోగ్య సంరక్షణ గ్రూప్‌గా గుర్తింపు పొందింది. ప్రస్తుతం 72 ఆస్పత్రులు, 12వేలకు పైగా పడకలు, 3800 ఫార్మసీలు, 120కు పైగా ప్రైమరీ కేర్‌ క్లీనిక్స్‌ మరియు 650 డయాగ్నోస్టిక్‌ కేంద్రాలు, 700కు పైగా టెలిక్లీనిక్స్‌, 15కు పైగా వైద్య విద్య కేంద్రాలు మరియు అంతర్జాతీయ క్లీనికల్‌ ట్రయల్స్‌పై దృష్టి సారించిన రీసెర్చ్‌ ఫౌండేషన్‌ దీనిలో భాగంగా ఉన్నాయి. తాజాగా ఆగ్నేయాసియాలో మొట్టమొదటి ప్రోటాన్‌ థెరఫీ కేంద్రాన్ని చెన్నైలో అపోలో ఏర్పాటుచేసింది.ప్రతి నాలుగు రోజులకూ అపోలో గ్రూప్‌ దాదాపు 10 లక్షల మంది జీవితాలను స్పృశిస్తుంటుంది. ప్రతి వ్యక్తికీ అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన ఆరోగ్య సంరక్షణను తీసుకురావాలనే లక్ష్యంతో సంస్థ కృషి చేస్తుంది. అత్యంత అరుదైన గౌరవాన్ని అందిస్తూ భారత ప్రభుత్వం అపోలో తోడ్పాటును గుర్తిస్తూ ఓ స్టాంప్‌ను విడుదల చేసింది. ఓ ఆరోగ్య సంరక్షణ సంస్థను గుర్తిస్తూ స్టాంప్‌ విడుదల చేయడం అదే తొలిసారి. అపోలో హాస్పిటల్స్‌ ఛైర్మన్‌ డాక్టర్‌ ప్రతాప్‌ సీ రెడ్డికి ప్రతిష్టాత్మకమైన పద్మవిభూషణ్‌ అవార్డును 2010లో అందజేశారు. దాదాపు 38 సంవత్సరాలుగా అపోలో హాస్పిటల్స్‌ గ్రూప్‌ వైద్య ఆవిష్కరణల పరంగా రాణించడంతో పాటుగా ప్రపంచస్థాయి క్లీనికల్‌ సేవలు, విప్లవాత్మక సాంకేతికతలో నాయకత్వ స్థానాన్నీ కొనసాగిస్తుంది. అత్యాధునిక వైద్య సేవల పరంగా అపోలో హాస్పిటల్స్‌ స్థిరంగా దేశంలో అత్యుత్తమ ఆస్పత్రులలో ఒకటిగా ర్యాంకులను పొందుతున్నాయి. మరిన్ని వివరాల కోసం www.apollohospitals.com చూడవచ్చు.

* డాక్టర్‌ రెడ్డీస్‌ లేబరేటరీస్‌ లిమిటెడ్‌: సమగ్రమైన ఔషద సంస్థ. ఆరోగ్యవంతమైన జీవితాలకు అందుబాటు ధరలలో, వినూత్నమైన ఔషదాలను అందించేందుకు కట్టుబడింది. దీని మూడు వ్యాపార విభాగాలు – ఫార్మాస్యూటికల్‌ సర్వీసెస్‌ అండ్‌ యాక్టివ్‌ ఇంగ్రీడియెంట్స్‌ ; గ్లోబల్‌ జెనిరిక్స్‌ అండ్‌ ప్రొప్రైయిటరీ ప్రొడక్ట్స్‌ – ద్వారా డాక్టర్‌ రెడ్డీస్‌ వినూత్నమైన ఉత్పత్తులు మరియు సేవలను అందిస్తుంది. వీటిలో ఏపీఐలు, కస్టమ్‌ ఫార్మాస్యూటికల్‌ సేవలు, జెనిరిక్స్‌, బయోసిమిలర్స్‌, వైవిధ్యమైన ఫార్ములేషన్స్‌ సైతం ఉన్నాయి. మా అతి ప్రధానమైన థెరపాటిక్‌ విభాగాలు గ్యాస్ట్రోఇంటోస్టినల్‌ , కార్డియోవాస్క్యులర్‌, డయాబెటాలజీ, ఆంకాలజీ, పెయిన్‌ మేనేజ్‌మెంట్‌, డెర్మటాలజీ ఉన్నాయి. డాక్టర్‌ రెడ్డీస్‌ అంతర్జాతీయంగా కార్యకలాపాలు నిర్వహిస్తూ తమ ఉత్పత్తులను మార్కెట్‌ చేస్తుంది. డాక్టర్‌ రెడ్డీస్‌ ప్రధాన మార్కెట్‌లలో యుఎస్‌ఏ, ఇండియా, రష్యా, సీఐఎస్‌ దేశాలు, యూరోప్‌ ఉన్నాయి. మరింత సమాచారం కోసం www.drreddys.com చూడవచ్చు.

Advertisement
Author Image