For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

దృష్టి మళ్లించి నేరాలకు పాల్పడుతున్నఅంతరాష్ట్ర ముఠాను అరెస్ట్ చేసిన SOT శంషాబాద్ మరియు షాద్ నగర్ పోలీసులు

08:25 PM Jan 16, 2025 IST | Sowmya
UpdateAt: 08:25 PM Jan 16, 2025 IST
దృష్టి మళ్లించి నేరాలకు పాల్పడుతున్నఅంతరాష్ట్ర ముఠాను అరెస్ట్ చేసిన sot శంషాబాద్ మరియు షాద్ నగర్ పోలీసులు
Advertisement

(Cr.No. 591/2024 U/s 318(4), 303(2) BNS of Shadnagar PS, Cyberabad)

కేసు విషయమేమనగా ఫిర్యాది కుమ్మరి రాజు, S/o రాములు, వయసు: 36 సంవత్సరాలు, వృత్తి: డ్రైవర్, నివాసం: శ్రీనివాసులు గూడెం గ్రామం, మండలం నందిగామ, జిల్లా రంగారెడ్డి, గారు తేది: 05.08.2024 రోజున సమయం 01:05 PM లో జడ్చర్ల రోడ్ లో IDBM ATM సెంటర్లో తన యొక్క ATM కార్డ్ బ్యాంకు లో డబ్బులు విత్ డ్రా చేద్దామని వెళ్లగా తనకు డబ్బులు తీయడం రాలేదు అప్పుడే తన వెనకాల నిలబడిన తెలుపు రంగు షర్ట్ వేసుకున్న వ్యక్తి నన్ను పరిచయం చేసుకొని నేను డబ్బులు తీసి ఇస్తానని ATM కార్డు తీసుకున్నాడు.

Advertisement

తరువాత తను కార్డు పెట్టి చెక్ చేసి డబ్బులు రావడం లేదని తిరిగి ఇచ్చాడు నేను ఇంటికి వెళ్ళిపోయిన్నాను. తరువాత సమయం 01:30 PM నిమిషాలకు నా ఫోన్ కు వరుసగా ఐదుసార్లు ₹ 42,400/- రూపాయలు ATM ద్వారా విత్ డ్రా చేసినట్లు ఎస్ఎంఎస్ వచ్చింది వెంటనే నేను బ్యాంకుకు వెళ్లి చెక్ చేసుకోగా అది నా ATM కార్డు కాదు అని తెలిపినారు. కావున డబ్బులు తీసి ఇస్తానని చెప్పి నా ATM కార్డు మార్చి ఇచ్చినాడు మరియు నా అకౌంట్ నుంచి డబ్బులు దొంగలించినారు అని షాద్ నగర్ పి‌ఎస్ నందు తేది: 05.08.2024 నాడు ఫిర్యాదు చేయగా ఇట్టి విషయం లో కేసు నమోదు చేయడం జరిగింది.

కేసు దర్యాప్తు లో బాగంగా తేదీ 14.01.2025 నాడు ఇట్టి కేసును SOT శంషాబాద్ వారు మరియు షాద్ నగర్ పోలీసు వారు Technical evidence ఆదారంగా కేసును ఛేదించి నిందితులు అయిన 1) KARIMAN SAHANI, S/o Nadu Sahani, 2) RUPDEV SAHANI, S/o Balram Sahani, 3) SAHEEB SAHINI, S/o Balram Sahini లను అరెస్టు చేసి విచారించగా నిందితులు ATM సెంటర్స్ నందు నిరక్షరాస్యులు, సీనియర్ సిటిజన్స్, మహిళలను టార్గెట్ చేస్తూ ATM లో నుండి డబ్బులు తీయడానికి రాని వాళ్లను ఎంచుకొని “నేను డబ్బులు తీసి ఇస్తాము” అని వాళ్లను నమ్మించి వారి దగ్గర ఉన్న ATM తీసుకొని సేమ్ అలాంటి మరొక్క fake ATM ను ఒరిజినల్ ATM ప్లేస్ లో పెట్టి వారి యొక్క పిన్ నెంబర్ ఎంటర్ చేసి డబ్బులు రావట్లేదని డూప్లికేట్ ATM ని బాధితులకు ఇచ్చి అట్టి ఒరిజినల్ ATM ను తీసుకొని వెళ్లి వేరే ATM సెంటర్ నందు బాధితులు అకౌంట్ నుండి డబ్బులు దొంగిలించడం జరుగుతుంది అని విచారణలో తెలిపినారు. ఇల్లా మొత్తం 15 చోట్ల( Shadnagar-02, RGIA-02, Balanagar-01, Dundigal-01, Sanathnagar-01, Jadcherla-01, Patancheruvu-02, Gachibowli-01, Jeedimetla-01, Shamshabad-02, Mailardevpally-01) చేసినట్టు ఒప్పుకునారు. నిందితుని వద్ద నుండి షాద్ నగర్ పోలీసులు కేసులకు సంబoధించిన 2,38,000 రూపాయల నగదు నిందితుల వద్ద నుండి స్వాదీనపర్చుకొని నిందితులని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు.

శంషాబాద్ DCP రాజేశ్, Addl. DCP రామ్ కుమార్, సైబరాబాద్ SOT DCP శోభన్ కుమార్, SOT ఇన్స్పెక్టర్ సంజయ్, SOT సబ్ ఇన్స్పెక్టర్ తరుణ్, వారి స్టాఫ్ మరియు షాద్ నగర్ ACP N.CH రంగా స్వామి పర్యవేక్షణలో, షాద్ నగర్ ఇన్స్పెక్టర్ P. విజయ్ కుమార్ ఆధ్వర్యంలో కేసు విచారణాధికారి ఎస్‌ వెంకటేశ్వర్లు DI, Crime DSI ఎస్‌ శరత్ కుమార్ మరియు Crime team PCs- మోహన్, కర్ణాకర్, జాకీర్, రాజు మరియు రఫీ కేసు ను ఛేదించడం లో కీలక పాత్రపోషిoచినారు. మరియు వారికి తగిన రివార్డ్ లను పై అదికారుల ద్వారా ఇప్పించడం జరుగుతుంది.

Modus Operandi : ఇట్టి నేరాలకు పాల్పడిన నేరస్తులు ముందుగా ATM సెంటర్ లో మర్చిపోయిన ATM cards, Reject అయిన ATM cards సేకరించి అట్టి ATM cards ను ఉపయోగించి, పగటివేల ATM సెంటర్ లో నిరక్షరాస్యులు, సీనియర్ సిటిజన్స్, మహిళలను టార్గెట్ చేస్తూ ATM లో నుండి డబ్బులు తీయడానికి రాని వాళ్లను ఎంచుకొని మేము డబ్బులు తీసి ఇస్తాము అని వాళ్లను నమ్మించి వారి దగ్గర ఉన్న ATM తీసుకొని సేమ్ అలాంటి మరొక్క ATM ను ఒరిజినల్ ATM ప్లేస్ లో పెట్టి వారి యొక్క పిన్ నెంబర్ ఎంటర్ చేసి డబ్బులు రావట్లేదని డూప్లికేట్ ATM ని బాధితులకు ఇచ్చి అట్టి ఒరిజినల్ ATM ను తీసుకొని వెళ్లి వేరే ATM సెంటర్ నందు బాధితులు అకౌంట్ నుండి డబ్బులు దొంగిలించడం జరుగుతుంది.

నిందితుని వద్ద నుండి స్వాదీనపర్చుకున్న వస్తువులు :
• 2,38,000/- నగదు
• 140 Fake ATM cards
• నాలుగు సెల్ ఫోన్స్

  • మొత్తం రికవరీ Rs. 3,00,000/- (మూడు లక్షల రూపాయలు)

నిందితుల వివరాలు..

1) KARIMAN SHANI S/o Nadu Sahani, age: 33 Yrs, Occ: Labour, R/o Thondupally village, Shamshabad mandal, Ranga reddy district, N/o sonbarsa, East Champaran District, Bihar State.

2) RUPDEV SAHANI S/o Balram Sahani, age: 34 yrs, Occ: Labour, R/o Thondupally village, Shamshabad mandal, Ranga reddy district, N/o N/o sonbarsa, East Champaran District, Bihar State.

3) SAHEEB SAHINI S/o Balram Sahini, age: 34 yrs, Occ: Labour, R/o Thondupally village, Shamshabad mandal, Ranga reddy district, N/o Khalasa Colony, Phagwara Mandal, Kapurthla District, Punjab. ACP Shadnagar

Advertisement
Tags :
Author Image