For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

Food In Blender :వీటిని మిక్సీ పట్టడం కంటే చేతులతో చేసి వాడితేనే ఆరోగ్యానికి ఎంతో మంచిది .. ఈ ఆహారం మిక్సీ పడితే ఏమవుతుందో ఇప్పుడే తెలుసుకోండి..

01:52 PM Jul 06, 2023 IST | Sowmya
Updated At - 01:52 PM Jul 06, 2023 IST
food in blender  వీటిని మిక్సీ పట్టడం కంటే చేతులతో చేసి వాడితేనే ఆరోగ్యానికి ఎంతో మంచిది    ఈ ఆహారం  మిక్సీ పడితే ఏమవుతుందో ఇప్పుడే తెలుసుకోండి
Advertisement

Food In Blender : మిక్సీలు ఇప్పుడు అందరి ఇళ్ళలో కామన్ అయిపోయింది. ఏవైనా పొడులు, పేస్టుల్లా చేయాలంటే వీటినే వాడతారు. అయితే, వీటిలో కొన్ని పదార్థాలు వాడకూడదు.
అల్లం, మసాలాలు, కొబ్బరి తురుము, ఇడ్లీ, దోశ పిండి ఇలా ఏవైనా సరే ప్రిపేర్ చేయడానికి మిక్సీని ఎక్కువగా వాడతారు. అన్ని అవసరాలకి అనుగుణంగా మిక్సీలను వాడుతుంటారు. అందులో కూరగాయలు కట్ చేయడం, చపాతీ పిండిని కలిపేందుకు కూడా డిజైన్ చేస్తున్నారు. దీంతో చాలా మంది వీటిని వాడుతూ ఆ విధంగానే తమ పనని ఈజీ చేసుకుంటున్నారు. కానీ, ఇలా చేసేటప్పుడు కొన్నింటిని గమనించాలని చెబుతున్నారు నిపుణులు.

చపాతీ పిండి..
చాలా మంది పిండిని కలిపేందుకు కూడా మిక్సీలను వాడుతుంటారు. దీనికోసం ప్రత్యేకంగా అట్టా నీడర్ ఉంటుంది. అందుకోసం వేసి పిండిని మెత్తగా కలుపుతారు. కానీ, పిండి త్వరగానే కలిసిపోతుంది. కానీ, చేతితో కలిపినట్లుగా ఉండదు. దీనివల్ల చపాతీలు కూడా బాగా రావు. కాబట్టి, చేతితో కలపడం మంచిది.

Advertisement GKSC

వేడి వేడి ఫుడ్స్..
అదే విధంగా కొన్నింటిని ఫ్రై చేసి అవి వేడిగా ఉండగానే మిక్సీలో వేస్తారు చాలా మంది. అలా ఎప్పుడు చేయకూడదు. దీని వల్ల జార్ త్వరగా పాడవుతుంది. అంతేనా, విరిగిపోతుంది కూడా. అలా కాకుండా వాటిని కాస్తా గోరువెచ్చగా అయ్యేవరకూ ఉండి ఆ తర్వాత వాటిని మిక్సీ పట్టాలి.

అల్లం వెల్లుల్లి..

అల్లం వెల్లుల్లిని చాలా మంది మిక్సీ జార్‌లోనే వేస్తారు. ఇది అందరూ చేసేదేగా ఎందుకు వద్దు అనుకుంటున్నారా.. వీటిని ఎక్కువ పరిమాణంలో చేస్తే త్వరగా అయ్యేందుకు మిక్సీ వాడొచ్చు. అదే తక్కువగా చేస్తే వాటిని చిన్న జార్‌లో వేసే బదులు చిన్న రోలులో వేయాలి. ఎందుకంటే, తక్కువగా వేస్తే అది ఆ బ్లేడ్స్‌లోనే చాలా వరకూ ఇరుక్కుంటుంది. త్వరగా బయటికి రాదు వాసన కూడా వస్తుంది. కాబట్టి, అలాంటి మసాలాలని చేత్తో నూరుకుంటేనే మంచిది.

Advertisement
Author Image