For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

Eating Raw Vegetables : ఈ కూరగాయాలని మాత్రం ఎప్పుడు పచ్చిగా తినకూడదు ,తిన్నారా ఇంకా అంతే ...

03:54 PM Aug 10, 2023 IST | Sowmya
Updated At - 03:54 PM Aug 10, 2023 IST
eating raw vegetables   ఈ కూరగాయాలని  మాత్రం ఎప్పుడు పచ్చిగా తినకూడదు  తిన్నారా ఇంకా అంతే
Advertisement

Eating Raw Vegetables : కూరగాయలను వండడం వల్ల వాటిలోని పోషకాలు పోతాయని నిపుణులు చెబుతుంటారు. ముడిగా ఆహారంగా, అంటే వండకుండా కూరగాయలు మరియు పండ్లను తినడం వల్ల మనకు మరింత శక్తి, ఆరోగ్యకరమైన చర్మం, మెరుగైన జీర్ణశక్తి , గుండె జబ్బులు, క్యాన్సర్ వచ్చే ప్రమాదం తగ్గుతుందని చెబుతుంటారు. అయితే కొన్ని రకాల కూరగాయలను పచ్చిగా తినకూడదు. మరి కొన్ని కూరగాయల విషయంలో, ఉడికించిన తర్వాత పోషకాల శోషణ మెరుగుపడుతుంది. అలాగే, కూరగాయలను పచ్చిగా తినడం వల్ల పరాన్నజీవులు, బ్యాక్టీరియా, టాక్సిన్స్, మీ ఆరోగ్యానికి హాని కలిగిస్తాయి.

ఇప్పటికే కొందరు ఆరోగ్య నిపుణులు సైతం కూరగాయలు మరియు పండ్లను పచ్చిగా తినకూడదని హెచ్చరించారు. ఎందుకంటే అవి పరాన్నజీవులు , E.coli లేదా టేప్‌వార్మ్‌లు, టేప్‌వార్మ్ గుడ్లకు నిలయంగా ఉంటాయి. అవి మన గట్ లోకి, రక్తప్రవాహంలోకి ప్రవేశించి తరువాత మెదడులోకి ప్రవేశిస్తాయి. వీటి కారణంగా సిస్టిసెర్కోసిస్, మూర్ఛలు, తలనొప్పి, కాలేయానికి నష్టం, కండరాలలో తిత్తులు వంటి తీవ్రమైన వ్యాధులను కలిగిస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Advertisement GKSC

1. చేమదుంపల చెట్టు ఆకులు, చేమదుంపలు ;
చేమదుంపల ఆకులు వీటిని అర్బి కా పట్టా అని కూడా పిలుస్తారు. ఆహారంలో వాటిని ఉపయోగించే ముందు వాటిని వేడినీటిలో బాగా ఉడికించాలి. ఇదే విధంగా బచ్చలికూర , కాలే విషయంలో కూడా చేయాలి. అవి అధిక ఆక్సలేట్ స్థాయిలు కలిగి ఉంటాయి. ఉడికించటం వల్ల ఆస్ధాయి తగ్గుతుంది.

2. క్యాబేజీ ;
కంటికి కనిపించని టేప్‌వార్మ్‌లు , టేప్‌వార్మ్ గుడ్లు క్యాబేజీలో ఉంటాయి. ఈ టేప్‌వార్మ్‌లలో కొన్ని కఠినమైన క్రిమిసంహారకాలు , పురుగుమందుల వల్ల బయటకు వస్తాయి. కాబట్టి క్యాబేజీ వంటి కూరగాయలను బాగా కడగాలి. అనంతరం వేడి నీటిలో వేసి బాగా ఉడికించిన తరువాత మాత్రమే తినాలి.

3. క్యాప్సికమ్ ;
క్యాప్సికమ్ తొడిమల చివరి భాగంలో లోపలి గింజలలో టేప్‌వార్మ్ గుడ్లకు కూడా నిలయంగా ఉంటాయి, ఇవి క్యాప్సికమ్ లోపలి బాగంలో జీవించి ఉంటాయి.

4. బెండకాయ ;
బెండకాయలోని విత్తనాలు మళ్లీ టేప్‌వార్మ్ గుడ్లకు నిలయం. ఈ పరాన్నజీవులు, టేప్‌వార్మ్‌లు, టేప్‌వార్మ్ గుడ్లు మన రక్తప్రవాహంలోకి ప్రవేశించకుండా చూసుకోవాలంటే ముందుగా బాగా ఉడికించాలి.
కాబట్టి ఇలాంటి ఆహారాలను తినే ముందు పచ్చిగా కాకుండా ఉడికించి తీసుకోవటం మంచిదన్న విషయం గుర్తుంచుకోవాలి. దీని వల్ల ఆరోగ్యానికి ఎలాంటి హాని కలగకుండా చూసుకోవచ్చు.

Advertisement
Author Image