For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

Payalam Pilaga : సెన్సేషనల్ సింగర్ - కంపోజర్ రామ్ మిర్యాల లాంచ్ చేసిన 'పైలం పిలగా' ఫస్ట్ లుక్ పోస్టర్

08:47 PM Mar 31, 2024 IST | Sowmya
UpdateAt: 08:47 PM Mar 31, 2024 IST
payalam pilaga   సెన్సేషనల్ సింగర్   కంపోజర్ రామ్ మిర్యాల లాంచ్ చేసిన  పైలం పిలగా  ఫస్ట్ లుక్ పోస్టర్
Advertisement

చిరంజీవికి అభిమానులుంటారు బాలయ్య బాబు కి అభిమానులుంటారు, అమితాబ్ కు ఉంటారు, రజనికి ఉంటారు, సచిన్ కు ఉంటారు, ధోని కి ఉంటారు. కానీ అంబానీకి ఎవరైనా అభిమానులుంటారా? ఒకడున్నాడు, వాడి పేరు శివ.... 21 ఏళ్ల పిలగాడు. అంబానీకి అర వీర అభిమాని. ఉద్యోగం వ్యవసాయం కాదు, వ్యాపారం చేసి వేలు , కాదు కోట్లు, కాదు కాదు వేల  కోట్లు సంపాదించాలని వీడి ఆశ. అదృష్టానికో, దురదృష్టానికో ఉన్న ఉళ్లోనే వీడికి కోట్లు సంపాదించే అవకాశం వస్తుంది. కానీ చీమకు ఏనుగు ఆహారంగా దొరికిన పరిస్థితి. ఎత్తుకెళ్లి పుట్టలో పెట్టుకోలేదు, తిని అరిగించుకోలేదు. ఈ లోపు వేట కుక్కలు, గుంట నక్కలు, హైనాలు, రాబందుల్లాంటి మనుషులను, వైకుంఠపాళి వ్యవస్థలోని అధికార పాములను తప్పించుకుంటూ తట్టుకొని ఈ శివ అనే చిరు చీమ  ఏ నిచ్చెనలెక్కి, ఏ చుక్కలనందుకున్నాడో చెప్పే హాస్య భరిత వ్యంగ చిత్రం 'పైలం పిలగా!'

విలువ లేని వ్యవసాయం చేయలేక, వలస పోయి కార్పొరేట్ బానిస అవలేక ఉన్న ఊళ్ళో నే  ఎంట్రప్రెన్యూర్ గా మారి పది  మందికి పని కల్పించి, అంబానీల లక్షలు, కోట్లు సంపాదించాలని అత్యుత్సాహం తో కలలు కన్నా ఓ మధ్యతరగతి యువకుడు, పద్మవ్యూహపు మన బ్యూరోక్రసీ వ్యవస్థ లో సమస్త అవస్థలు పడుతూ ఏ ప్రస్థం చేరుకున్నాడో చెప్పే హాస్యభరిత వ్యంగ చిత్రం 'పైలం పిలగా!'

Advertisement

హ్యాపీ హార్స్ ఫిలిమ్స్ నిర్మాణంలో రామకృష్ణ బొద్దుల, S.K . శ్రీనివాస్ నిర్మాతలు గా ఆనంద్ గుర్రం దర్శకత్వం వహించిన చిత్రం 'పైలం పిలగా!' ఈ చిత్ర పోస్టర్/ఫస్ట్ లుక్ ను ఇటీవల విజయవాడలోని KL యూనివర్సిటీ లో జరిగిన రామ్ మిర్యాల మ్యూజిక్ కన్సర్ట్ లో విద్యార్థులు చేత ఆవిష్కరింప చేసారు. ఇన్నోవేటివ్ గా, ఫన్నీ గా ఉన్న ఈ ఫస్ట్ లుక్ విద్యార్థుల్లో అమితాకసక్తిని  రేపింది.

పిల్ల పిలగాడు వెబ్ సిరీస్ ఫేమ్ సాయి తేజ హీరో గా, పుష్ప ఫేమ్ పావని కారణం హీరోయిన్ గా , నటించిన ఈ చిత్రంలో దుబ్బింగ్ జానకి, చిత్రం శ్రీను, మిర్చి కిరణ్ తదితరులు నటించారు. చౌరస్తా యశ్వంత్ నాగ్ మ్యూజిక్ అందించిన ఈ చిత్రం లో ఆరు పాటలను రామ్ మిర్యాల, చిత్ర, శ్రావణి భార్గవి ఆలపించారు. కెమెరా సందీప్ బద్దుల, ఎడిటింగ్ రవితేజ కూర్మన, స్టైలిష్ హారిక పొట్ట, లిరిక్స్ ఆనంద్ గుర్రం, అక్కల చంద్రమౌళి, ఎగ్జుక్యూటివ్ ప్రొడ్యూసర్ సంతోష్ వాడ్నలా పని చేసిన ఈ పైలం పిలగా చిత్రానికి సహా నిర్మాతలు గా కృష్ణమసునూరి, రవి వాషింగ్టన్, విజయ్ గోపు వ్యవహరించారు.

Advertisement
Tags :
Author Image