For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

Game Changer : గ్లోబ‌ల్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ 'గేమ్ చేంజర్' నుంచి ‘డోప్’ సాంగ్ ప్రోమో

09:54 PM Dec 18, 2024 IST | Sowmya
UpdateAt: 09:54 PM Dec 18, 2024 IST
game changer   గ్లోబ‌ల్ స్టార్ రామ్ చ‌ర‌ణ్  గేమ్ చేంజర్  నుంచి ‘డోప్’ సాంగ్ ప్రోమో
Advertisement

FILM NEWS : గ్లోబ‌ల్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ క‌థానాయ‌కుడిగా స్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన భారీ బ‌డ్జెట్ చిత్రం ‘గేమ్ చేంజర్’. ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన కియారా అద్వాణీ హీరోయిన్‌గా నటించారు. ఈ సినిమాను శ్రీమ‌తి అనిత స‌మ‌ర్ప‌ణ‌లో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్, దిల్ రాజు ప్రొడక్షన్ బ్యానర్స్‌పై దిల్ రాజు, శిరీష్ అన్‌కాంప్ర‌మైజ్డ్‌గా నిర్మించారు. తెలుగు, త‌మిళ‌, హిందీ భాష‌ల్లో ఈ మూవీ జ‌న‌వ‌రి 10న ప్ర‌పంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతోంది.

ఇప్పటికే రిలీజ్ చేసిన జరగండి, రా మచ్చా మచ్చా, నా నా హైరానా అనే పాటలు యూట్యూబ్‌లో ట్రెండింగ్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. ఇక రీసెంట్‌గా రిలీజ్ చేసిన గ్లింప్స్‌తో అంచనాలు ఆకాశన్నంటిన సంగతి తెలిసిందే. తాజాగా దిల్ రాజు పుట్టిన రోజు సందర్భంగా చిత్రం నుంచి నాలుగో పాటకు సంబంధించిన ప్రోమోను రిలీజ్ చేశారు.

Advertisement

దిల్ రాజు బర్త్ డే సందర్భంగా గేమ్ చేంజర్ మూడో పాట ‘డోప్’ ప్రోమోను కాసేపటి క్రితమే రిలీజ్ చేశారు. ఇక ఈ ప్రోమోను చూస్తే ఈ పాటను ఏ రేంజ్‌లో శంకర్ పిక్చరైజేషన్ చేశారో అర్థం అవుతోంది. తమన్ ఇచ్చిన బీట్, జానీ మాస్టర్ కొరియోగ్రఫీలో ఈ సాంగ్ అత్యద్భుతంగా వచ్చినట్టుగా కనిపిస్తోంది. ఇక సరస్వతీ పుత్ర రామజోగయ్య శాస్త్రి అందించిన సాహిత్యం మరింత ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందనిపిస్తోంది. ఈ పాటకు తమిళంలో వివేక్, హిందీలో రక్వీబ్ ఆలం సాహిత్యాన్ని అందించారు.

తెలుగులో ఈ పాటను తమన్ ఎస్, రోషిణి, పృథ్వీ శ్రుతి రంజని ఆలపించాగా.. తమిళంలో తమన్ ఎస్, అదితీ శంకర్, పృథ్వీ.. హిందీలో తమన్ ఎస్, రాజకుమారి, పృథ్వీ శ్రుతి రంజని ఆలపించారు. పూర్తి పాటను డల్లాస్‌ ఈవెంట్‌లో డిసెంబర్ 21న రాత్రి 9 గంటలకు రిలీజ్ చేసేందుకు ముహూర్తం ఫిక్స్ చేశారు. ఇండియాలో ఈ పాట డిసెంబర్ 22న రాత్రి 8 గంటల 30 నిమిషాలకు రిలీజ్ కానుంది. ఈ చిత్రానికి సాయి మాధవ్ బుర్రా మాటల్ని అందించారు. తిరునవుక్కరసు కెమెరామెన్‌గా పని చేశారు.

Advertisement
Tags :
Author Image