For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

సినిమా మీద ఉన్న పిచ్చితో ఇల్లు అమ్మి మరీ ఈ సినిమా తీస్తున్నాను : హీరో, డైరెక్టర్ పులివెందుల మహేష్

05:58 PM Jul 21, 2024 IST | Sowmya
Updated At - 05:58 PM Jul 21, 2024 IST
సినిమా మీద ఉన్న పిచ్చితో ఇల్లు అమ్మి మరీ ఈ సినిమా తీస్తున్నాను   హీరో  డైరెక్టర్ పులివెందుల మహేష్
Advertisement

పులివెందుల మహేష్ హీరో మరియు దర్శకుడుగా సావిత్రి కృష్ణ హీరోయిన్ గా నైనీషా క్రియేషన్స్ మరియు క్రౌడ్ ఫండింగ్ సంయుక్తంగా నైనీషా, రాహుల్ త్రిశూల్ నిర్మాతలుగా నిర్మిస్తున్న సినిమా స్కూల్ లైఫ్. క్రౌడ్ ఫండింగ్ ద్వారా పులివెందుల మహేష్ ఎంతో కష్టపడి తానే హీరో మరియు దర్శకుడుగా చేస్తున్న సినిమా. నేడు ఈ సినిమాకి సంబంధించిన పూజా కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హీరో కిరణ్ అబ్బవరం గారు మరియు దర్శకుడు వి సముద్ర గారు విచ్చేసి టీం ని సపోర్ట్ చేసి అభినందనలు తెలియజేశారు.

ఈ సందర్భంగా హీరో, దర్శకుడు పులివెందుల మహేష్ మాట్లాడుతూ : ఈరోజు కృష్ణానగర్ నుంచి వచ్చి నేను ఈ స్థాయిలో ఉన్నాను అంటే కారణం మీడియా మరియు ప్రేక్షకులు. ఈ సినిమా నా ఒక్కడిదే కాదు. సినిమా మీద ఉన్న ఇష్టంతో సినిమా కథ నచ్చి క్రౌడ్ ఫండింగ్ ద్వారా వచ్చిన ప్రజల డబ్బుతో అలాగే నా ఇల్లు అమ్మి ఈ సినిమా తీస్తున్నాను. ప్రేక్షకులు సినిమాలో కంటెంట్ ఉంటే కచ్చితంగా సక్సెస్ చేస్తారు అని నమ్ముతాను. సినిమా ద్వారా చాలామందికి ఎంప్లాయిమెంట్ కూడా దొరుకుతుంది.

Advertisement GKSC

అంతేకాకుండా వచ్చిన బడ్జెట్ సరిపోనప్పుడు కథ నచ్చి నన్ను నమ్మి సపోర్ట్ చేసి ఇన్వెస్ట్ చేసి ఈరోజు రామానాయుడు స్టూడియోలో మూవీ ఓపెనింగ్ ప్రెస్ మీట్ పెట్టే స్థాయికి తీసుకువచ్చిన నిర్మాత రాహుల్ త్రిశూల్ గారికి కృతజ్ఞతలు. కష్ట సమయంలో వచ్చి సపోర్ట్ ఇచ్చిన రాహుల్ త్రిశూల్ గారు ఈ సినిమాకి నిర్మాతగా ఉండడం చాలా ఆనందంగా ఉంది. 100% సినిమా సక్సెస్ అవుతుంది అన్న కాన్ఫిడెన్స్ ఉంది కాబట్టే ఇంత కాన్ఫిడెంట్ గా మాట్లాడుతున్నాను. అదేవిధంగా సినిమాలతో బిజీగా ఉండి కూడా మమ్మల్ని సపోర్ట్ చేయడానికి వచ్చిన హీరో కిరణ్ అబ్బవరం గారికి దర్శకుడు సముద్ర గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను అన్నారు.

Actors : Pulivendula Mahesh, Savitri Krishna Suman, Amani and others

Technicians :
Production : Naineesha Creations, Geniya Entertainments
Producers: Naineesha, Rahul Trishul
Co-Producer : Crowd Fund
D.O.P.: Dharma Prabha
Music: Harsha Praveen
Editor : Nandamuri Haribabu
Lyrics: M Anil, Balu, Asura K
Co Director : Rakesh AR, Karthik K
Associate Director : SK Master, Hari S
Writers : Anas, Appasani Madhu, Veeranjaneya Chari, Suresh, Naveen, Narasimha
Dialogues : Anji Tanniru
Direction Department : Shiva G, Ravi K, Shiva M, Harsha, Narasimha, Ganesh
P R O : Madhu VR

Advertisement
Author Image