For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ అద్భుతం ★ ఎంపీ సంతోష్‌కుమార్ కు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రశంస

09:15 PM Jul 05, 2023 IST | Sowmya
Updated At - 09:15 PM Jul 05, 2023 IST
గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ అద్భుతం ★ ఎంపీ సంతోష్‌కుమార్ కు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రశంస
Advertisement

రాజ్యసభ సభ్యుడు, గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ సృష్టికర్త జోగినిపల్లి సంతోష్‌కుమార్‌ మంగళవారం హైదరాబాద్‌లో రాష్ట్రపతి ద్రౌపది ముర్మును గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌తో కలిసి మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ కార్యక్రమాన్ని రాష్ట్రపతికి వివరించారు. మొక్కల ప్రాధాన్యం తెలిపేలా రూపొందించిన వృక్షవేదం పుస్తకాన్ని రాష్ట్రపతికి అందించారు.

అనంతరం గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ ప్రారంభించిన ఈ ఐదేళ్లలో నాటిన మొక్కలు, సాధించిన ప్రగతిని, మొకలు నాటడంపై ప్రజల్లో కలిగించిన అవగాహన కార్యక్రమాలకు సంబంధించిన వివరాలను రాష్ట్రపతికి వివరించారు. ఎంపీ సంతోష్‌ కుమార్‌ చెప్పిన విషయాలను ఆసక్తిగా తెలుసుకున్న రాష్ట్రపతి.. గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా మొకలు నాటుతున్న విషయం తనకు కూడా తెలుసని చెప్పారు. తనకు మొకలు నాటడం అంటే చాలా ఇష్టమని.. ఇప్పటికే అనేక సందర్భాల్లో మొక్కలు నాటినట్లు రాష్ట్రపతి తెలిపారు.

Advertisement GKSC

వచ్చే హైదరాబాద్‌ పర్యటనలో ఈ సారి గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొని మొక్కలు నాటుతానని తెలిపారు. ఇంత నిస్వార్థమైన కార్యక్రమాన్ని అంకితభావంతో ముందుకు తీసుకుపోతున్న ఎంపీ సంతోష్‌ను ఆమె అభినందించారు. ప్రజోపయోగమైన గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ను మరింత ఉధృతంగా ముందుకు తీసుకెళ్లాలని ఆకాంక్షించారు. అనంతరం సంతోష్‌ కుమార్‌ మాట్లాడుతూ రాష్ట్రపతి చొరవ, గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌పై ఆమె అభిమానం అద్భుతమైన అనుభవమంటూ ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో జోగినిపల్లి సంతోష్‌ కుమార్‌ వెంట రాష్ట్ర గిరిజన సంక్షేమశాఖామాత్యులు సత్యవతి రాథోడ్‌ పాల్గొన్నారు.

Advertisement
Author Image