For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

'డబుల్ ఇస్మార్ట్' డబ్బింగ్ కంప్లీట్ చేసిన సంజయ్ దత్

10:14 PM Jul 24, 2024 IST | Sowmya
Updated At - 10:14 PM Jul 24, 2024 IST
 డబుల్ ఇస్మార్ట్  డబ్బింగ్ కంప్లీట్ చేసిన సంజయ్ దత్
Advertisement

ఉస్తాద్ రామ్ పోతినేని, డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్‌ బ్లాక్‌బస్టర్ కాంబినేషన్‌లో మోస్ట్ ఎవైటెడ్ పాన్ ఇండియా మూవీ డబుల్ ఇస్మార్ట్‌లో బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ ఫస్ట్ టైం తెలుగులో ఫుల్ లెంత్ రోల్ పోషిస్తున్నారు. సంజయ్ దత్ తన వాయిస్ ని అందించడం ద్వారా అతని క్యారెక్టర్, మూవీకి పవర్ ఇచ్చారు. సంజయ్ దత్ తన పాత్రకు హిందీలో డబ్బింగ్ చెప్పారు.

పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ పూర్తి కావస్తుండగా, ప్రమోషనల్ యాక్టివిటీస్ కూడా శరవేగంగా జరుగుతున్నాయి. ముఖ్యంగా మాస్ నుంచి వచ్చిన అద్భుతమైన రెస్పాన్స్‌తో రెండు పాటలు, టీజర్‌ భారీ అంచనాలు నెలకోల్పాయి. ఈ సినిమాలో మాస్, యాక్షన్, డ్రామా, ఎంటర్‌టైన్‌మెంట్‌ డబుల్ డోస్ ఉంటుంది. పూరి కనెక్ట్స్ బ్యానర్‌పై పూరి జగన్నాధ్, ఛార్మి కౌర్ నిర్మిస్తున్న ఈ సినిమాలో రామ్ సరసన కావ్య థాపర్ హీరోయిన్‌గా నటించింది.

Advertisement GKSC

ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం సమకూర్చారు. సామ్ కె నాయుడు, జియాని గియానెలీ సినిమాటోగ్రఫీ అందించారు. డబుల్ ఇస్మార్ట్ ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవం రోజున తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్‌ నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా మొత్తం ఐదు భాషల్లో విడుదల చేయనున్నారు.

Cast : Ram Pothineni, Sanjay Dutt, Kavya Thapar, Ali, Getup Srinu, and others.

Technical Crew :
Writer, Director: Puri Jagannadh
Producers: Puri Jagannadh, Charmme Kaur
Banner: Puri Connects
Worldwide Release: PrimeShow Entertainment (Niranjan Reddy and Chaitanya Reddy)
CEO: Vishu Reddy
Music: Mani Sharma
Cinematography: Sam K Naidu and Gianni Gianneli
Stunt Director: Kecha, Real Satish
PRO: Vamsi-Shekar
Marketing: Haashtag Media

Advertisement
Author Image