SALAAR Movie Trailer Review : సలసల కాగుతోన్న 'సలార్' - ట్రైలరే ఇలా ఉంటే ఇక సినిమా సంగతేంటి ?
ఏం మానియా క్రియేట్ చేశావురా సినీ వినీలాకాశపు నీల్ మేఘ శ్యాముడా !
పర్షియన్ సామ్రాజ్యంలో సుల్తాన్.. ఎంత పెద్ద సమస్య వచ్చినా.. తన బలమైన సైన్యానికి కూడా చెప్పకుండా.. ఒక్కడికే చెప్పేవాడు.. వాడు సుల్తాన్ కావాలన్నది ఏదైనా తెచ్చిచ్చేవాడు వద్దనుకున్నది ఏదైనా అంతం చేసేవాడు.. ఖాన్సార్ వల్ల చాలా మంది కథలు మారి ఉంటాయి... కానీ, ఖాన్సార్ కథను మార్చింది మాత్రం ఇద్దరు ప్రాణ స్నేహితులు.
పెద్ద పెద్ద గోడలు కట్టేది..
బయటకి ఎవడెళ్తాడని కాదు..
లోపలికి ఎవడొస్తాడని..
వంటి డైలాగులు.. కుప్పలు తెప్పలు. అవసలు డైలాగ్స్ కావు.. ఎన్నెన్నో జీవన సత్యాలను విడమరచి చెప్పే తత్వాలు. అర్ధ తాత్పర్యాలు. మరీ ముఖ్యంగా గోడలపై వినిపించిన ఈ డైలాగ్ లోని అర్ధమేంటని చూస్తే.. నాకు తెలిసి.. సుమారు వందేళ్ల క్రితం నాడు కట్టిన చిత్రసీమ అనే ఈ పటిష్టమైన కోట గోడలు ఎవ్వరూ బయటకు వెళ్లడం గురించికాదు.. ఎవరు లోపలికి వస్తారా? అన్న ఛాలెంజ్ విసరడంలో భాగంగా అయి ఉండొచ్చు.. ఇది కేవలం నా దృష్టే కాదు.. సలార్ సృష్టి కర్త, కేజీఎఫ్ పితామహుడు.. అనంతపురం ఫిరంగి.. ప్రశాంత్ నీల్ కి దృష్టి కోణం కూడా ఇదే అయి ఉంటుంది.
ఖాన్ సార్ అనే వెయ్యేళ్ల నాటి ఆ అడవి ఒక సామ్రాజ్యమైందంటూ.. మొదలు పెట్టి.. దానిలోని కుర్చీలాట గురించి లీలగా మనకు హింట్ ఇచ్చి.. అక్కడా ఒక యుద్ధ వాతావరణం ఉన్నట్టు చూపించి.. మన సైన్యం ఎవరూ? అన్నపుడు ఓల్డ్ అండ్ స్టిల్ డైనమిక్ అయిన ప్రభాస్ ను చూపించడంలో గూస్ బంప్స్ కన్నా మించిన పదం ఏదైనా ఉంటే వెతకాల్సి ఉంటుంది మనం.
అంతే కాదు మెకానిక్ లకు రెంచీలు, స్పానర్ల వాడకం గురించి తెలిసి ఉంటుంది కానీ, గన్ల వాడకం గురించి ఏం తెలిసి ఉంటుందన్న డైలాగ్ కూడా రోమాంచితమే. నా ముందున్నదంతా.. నాక్కావాలంటూ చేసిన ఆ దూషణ భీషణ ధిక్కార సంభాషణ.. తాలూకూ శబ్ధం.. ఇంకా ఆకలి తీరని సింహం నుంచి వచ్చచే శ్వాసకన్నా భయంకరంగా వినిపించింది.
ఏం మొహాలవి.. ఏం ఫేస్ కట్స్.. దక్షిణాది సినీ రంగంలోని కంటెంట్ ఓరికెంటెడ్ కల్ట్ ఫేస్ కట్స్ మొత్తం మిల మిల మెరుస్తూ అదే సమయంలో ఎప్పుడెప్పుడు ఫుల్ మీల్స్ చేద్దామా అన్న ఆశల తహతహలకు కారణమవుతూ.. తెలుగు నుంచి ప్రభాస్, జగపతి బాబు.. మలయాళం నుంచి పృధ్వీ రాజ్, తమిళం నుంచి బాబీ సింహా ఇలా ఎందరు.. ఎన్నేసి హావ భావ విన్యాసాలని. కూర్చున్న మనిషిని కట్టేసినట్టు.. కను తెరిచిన మనిషిని.. ఆ చిత్రం చూడ్డంలోనే శాస్వతంగా ఉంచేసినట్టు చేసే ఈ దృశ్యజాలానికి ఏం పేరు పెట్టాలి??? ఇది నిజంగా ఎంత గట్స్ కి సంబంధించిన విషయం.
కొత్త కథ చెప్పవోయ్ అంటూ.. బడ్జెట్ లిమిట్స్ పెట్టి.. చెప్పిన కథ.. పదే పదే చెప్పడాన్నిగానీ ఇక ఆపేస్తారా? ఈ స్టోరీ చూశాక.. ఇకపై రొటీన్ రొడ్డ కొట్టుడ్లకూ.. లాజికల్ స్టోరీ టెల్లింగ్ కి, మైండ్ గేమ్ ముంత మషాళాలకూ.. ఫుల్ స్టాప్ పడేస్తారా? అన్నట్టు.. ఎన్నేసి చిత్ర విచిత్ర విన్యాసారాలివి.. ట్రైలర్ లోనే ఇంత రా మెటీరియల్ రిలీజ్ చేస్తే.. ఇక హాళ్లలో.. వంద హాలీవుడ్ల తాలూకూ ఫిల్మినీరింగ్ మన మైండ్లోకి డైరెక్ట్ గా ఇంజెక్ట్ చేస్తూ.. ఎన్నేసి చిత్ర విచిత్రమైన ఆలోచనలకు ప్రేరణగా నిలిచేట్టు ??? ప్రశాంత్ నీల్ వచ్చాక ఇప్పటి వరకూ ఉన్న డైలాగ్ కమ్ విజువలైజేషన్ టోటల్ మాయిశ్చరైజింగ్ మారిపోయింది. అందరూ డస్టీల బాట పట్టేశారు. తూతుంబర్ గా కథ రెడీ చేసుకున్నా.. కాపీ క్యాట్ రైటింగ్ కెపాసిటీకి కూడా.. ఈ తరహా విజువల్ ఇంపాక్ట్ నెస్ ను అప్లై చేసే వరకూ నీల్ తన చిత్రాలోచనా మేఘాలను దక్షిణాది చిత్రసీమ అంతటా కమ్మేశాడంటే అతిశయోక్తి కాదు.. తన మేకింగ్ మానియాను.. వ్యాపింప చేసి దాన్నో హిస్టీరియా కింద మార్చేశాడంటే.. అందులో ఎలాంటి అబద్దమూ లేదు.
ఆ మాటకొస్తే.. కల్ట్ క్లాసిక్స్ నిర్మాణాలకే ఆద్యుడైన మణిరత్నానికి కూడా సేమ్ డిట్టో మూడ్ తెప్పించి.. తాను చదివిన చారిత్రక నవల్లోని మనసుకు పట్టిన.. ప్రతి దృశ్యానికీ చిత్రణ పట్టేసి.. పొన్నియన్ సెల్వన్ వంటి హిస్టారికల్స్ కి షిఫ్ట్ అయ్యేలా చేసింది కూడా సదరు.. దక్షిణాది చిత్ర నీల మేఘ శ్యాముడే. అలాగంటే ఇవాళ్టి రోజున తూతూ మంత్రం కథలతో.. చెప్పిన కథనే చెబుతూ.. తానేం చెబుతున్నాడో తనకే తెలీక.. ఆ స్టోరీ టెల్లింగ్ కి ఎక్కడ ఎండ్ కార్డ్ వేయాలో.. అర్ధంకాని తికమక మాస్టారు మన సుకుమార్ ని సైతం.. ఈ డస్టీ రెలిజియన్ కి కన్వర్టయ్యేలా చేసింది కూడా ప్రశాంతుడే. కేవలం తనే కాదు.. తన శిష్యగణం కూడా డస్టీగా చిత్రిస్తేనే కాసుల వర్షం కురుస్తుందని మంకు పట్టు పట్టే వరకూ తెచ్చింది కూడా ఈ బంగారు గనుల బుల్లోడే.
లేకుంటే పుష్ప ఇవాళ్టి రోజున ఫస్ట్ ఆఫ్ కే జాతీయ ఉత్తమ నటుడు సాధించాడంటే.. అందుకు ప్రేరణ ఎవరూ? ఈ కోలార్ గోల్డ్ మైన్ హంట్ హీరో కాదా? కేజీఎఫ్.. కేజీఎఫ్.. కేజీఎఫ్.. కేజీఎఫ్ తరహా బ్యాగ్రౌండ్స్ మనకేమున్నాయని.. స్వయానా సుకుమార్ నన్ను అడగటం.. నేను ఆయనకు రెడ్ శాండిల్ ఇంత వరకూ ఎవ్వరూ టచ్ చేయలేదని చెప్పడం.. తర్వాతి రోజుల్లో ఆయన్ను శేషాచలం అడవుల బాట పట్టేలా చేయడం.. ఆఫ్టర్ దట్ రీసెర్చ్.. పుష్ప పేరిట తగ్గేదే లే.. అంటూ ఓ పానిండియా మూవీ రిలీజ్ కావడం వెనకున్నది.. మరెవరో కాదు.. కేజీఎఫ్ క్రియేటరే. ఆ బంగారు తవ్వకాల్లో బయట పడ్డ ఎర్రచందనాల డంపే... పుష్ప 1, 2 పార్ట్స్.
సలార్ తో మరో మారు బాక్సాఫీస్ మీద కాసుల కాల్పుల మోత మొదలు పెట్టిన ప్రశాంత్ నీల్ సామాన్యుడు కాడు.. అతడొక ప్రత్యేక అధ్యాయం. తెలుగు తమిళ కన్నడ మలయాళ హిందీ చిత్రసీమల్లో ప్రస్తుతం అతడో పెద్ద సబ్జెక్ట్. అట్ ద సేమ్ టైం ఓ గైడ్ కూడా. ఇలాంటి వెయ్యేళ్ల కాలం నాటి కథలు ఏ బామ్మ చెబితే విన్నాడో తెలీదు కానీ.. అతడిలాంటి కథకుడు ఇప్పటి వరకూ ఎవ్వరూ పుట్టలేదు కావచ్చు..
ఎప్పుడెప్పుడో సిప్పీలు షోలే ద్వారా గబ్బర్ సింగ్ లాంటి గజదొంగలను ఈ దేశపు వెండి తెరల మీద వదిలేస్తే.. జీవితకాలం మనమంతా కలసి.. అదే కాపీ పేస్ట్ కొట్టుకుంటే కొట్టుకుంటూ.. చూసిన సినిమానే చూసీ చూసీ ఛస్తున్న తరుణంలో.. ఓ యాభై ఏళ్లకు పైగా కాలం గడిచిపోతుండగా.. కేజీఎఫ్ అంటూ తెరపై కనకపు తవ్వకాన్ని చూపడం మాత్రమే కాకుండా.. కాసుల వర్షాన్ని సైతం కురిపించి చూపడంతో.. ఇప్పుడంతా ఈ తరహా కథనమే.. ఆ కథానాయకత్వమే.. సేమ్ అలాంటి ప్రతి కథానాయకత్వమే కావాలని దర్శకనిర్మాతలు పట్టు పట్టేలా చేస్తున్నాడు.. ప్రశాంత్ నీల్.
కేజీఎఫ్ రిలీజైన కొత్తల్లో.. కన్నడ చిత్ర సీమ నుంచి ఇంతటి భారీ చిత్ర వైవిధ్యమా? ఇదెలా సాధ్యం? అప్పటి వరకూ మన తుప్పు పట్టిన తెలుగు నవలలు, సినిమా కథలు ఇతరత్రా మాత్రమే ఆయువు పట్టుగా బతుకుతూ వచ్చిన ఈ కన్నడిగులా ఇంతటి బీభత్స కాండను చిత్రీకరించిందని ఆశ్చర్యపోయేలోగా.. ఇతడెవడో కాడు మనవాడే అన్న మాట తెలిసి.. మరద్దే కదా.. కొత్త కథ చెప్పాలంటే.. వాడు మనోడై ఉండాలన్న మాటతో కూడా శెబ్బాషులను పలికించాడు ప్రశాంత్ నీలుడు.
ఇతడికన్నా ముందే రాజమౌళి ఇలాంటి జెయిగాంటిక్ స్క్రిన్ వండర్లు ఆవిష్కరించినా.. అవన్నీ చందమామ కథల కోవలో కొట్టుకుపోయినవే.. అన్ సంగ్ హీరోస్.. అన్ టోల్డ్ స్టోరీస్.. అనే కేటగిరీ ఒకటి ఉంటుందనీ.. అతడిది విలనిజమా\ హీరోయిజమా అన్నది పక్కన పెట్టి.. అతడు తెరపై ఏది చేస్తే అది చూడ్డమే మన ఇజం అవుతుందని నిరూపిస్తూ కేజీఎఫ్ దాటి సలార్ వరకూ మూడంటే మూడు సినిమాలే కానీ.. వాటి తాలూకూ ప్రభంజనం మాత్రం క్రియేటివ్ డైరెక్టర్లనీ, సెల్యులాయిడ్ వండర్ క్రియేటర్లనీ పేరున్న సుకుమార్, మణిరత్నం వంటి హేమా హేమీలను సైతం కదిల్చి.. వాళ్ల మెదళ్లలోని ఇప్పటి వరకూ పట్టి ఉన్న తుప్పు కూడా వదిల్చిన ప్రశాంత్ నీల్ నాకు ఇక్కడెక్కడా కనిపించట్లా.
లాస్ ఏంజల్స్ లోని హాలీవుడ్ కొండగానీ.. ఇటు వైపు దక్షిణ భారతదేశంలోని వెస్ట్రన్ ఘాట్స్ కి గానీ షిఫ్ట్ అయ్యాయా.. అన్న ఆలోనలకు తెరలేపుతున్నాడు.. సలార్\ గిలార్ అంటూ పేర్లేం పెడతాడో.. అందుకు అర్ధ తాత్పర్యాలేంటో తెలీదు కానీ.. ఆ రోత- ఆ కోత- ఆ తీత.. నెక్స్ట్ లెవల్ కే.. నెక్స్ట్ లెవల్. ఇప్పటికింతే.. నీకోసం ఎరే అవుతా సొరే అవుతా అంటూ ఆ ప్రాసలూ.. మన సైన్యం ఎక్కడంటే కేవలం ఒకడి భుజ బలం చూపించి అదేనంటూ సంకేతాలివ్వడాలు.. కోటగోడల నిర్మాణానికే కొత్త అర్ధం చెప్పడాలూ.. ఆ సాంకేతిక సాహిత్యపు ఒరవడికి ఫిదా అవకుండా ఉండటం ఏ సినీ అభిమానికీ సాధ్యం కాని అసాధ్యం.. దట్సాల్ ఫర్ నౌ!!!
ఫైనల్ టచ్
ఈ దెబ్బకు ఖాన్ సార్ అనే టాలీవుడ్ బాక్సాఫీసులతో సహా.. ఇండియన్ ఫిలిమ్ ఇండస్ట్రీ మొత్తం క్యాలుక్యులేటర్ పెట్టుకుని పెట్టుకుని వసూళ్లెంతో లెక్కలు పెట్టుకోవల్సిందేనా? అంటే అదే జరిగేలా తెలుస్తోంది. మైడియర్!
సలార్ సినిమా ట్రైలర్ రివ్యూ by జర్నలిస్ట్ ఆది