Ruslan : 'రుస్లాన్' ఎక్స్ ట్రార్డినరీ మూవీ. చాలా అద్భుతంగా వుంటుంది : రచయిత విజయేంద్ర ప్రసాద్
బాలీవుడ్ యంగ్ ట్యాలెంటెడ్ ఆయుష్ శర్మ హీరోగా నటిస్తున్న హై వోల్టేజ్ యాక్షనర్ 'రుస్లాన్'. కరణ్ బి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో జగపతి బాబు కీలక పాత్ర పోషిస్తున్నారు. సుశ్రీ మిశ్రా హీరోయిన్. ఈ చిత్రాన్ని శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత కె.కె. రాధామోహన్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఈ చిత్రం ఏప్రిల్ 26న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ నేపధ్యంలో చిత్ర యూనిట్ గ్రాండ్ గా మీట్ అండ్ గ్రీట్ ఈవెంట్ ని నిర్వహించింది. ప్రముఖ రచయిత విజయేంద్ర ప్రసాద్ ఈ వేడుకకు ముఖ్య అతిధిగా హాజరయ్యారు.
మీట్ అండ్ గ్రీట్ ఈవెంట్ లో ప్రముఖ రచయిత విజయేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ.. శివకి కథపై చాలా పాషన్ వుంది. ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అవుతుందో చెప్పలేకపోతున్నాను. అంత అద్భుతంగా వుంటుంది. ఈ టీజర్ చాలా సార్లు చూశాను. చూసిన ప్రతిసారి కొత్త కోణం కనిపిస్తోంది. సల్మాన్ ఖాన్ గారితో సినిమా జరుగుతున్నపుడు ఆయుష్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో పని చేసేవారు. తనని చూసినప్పుడే హీరోలా కనిపించారు.
ఇందులో ఎక్స్ ట్రార్డినరీగా చేశాడు. తనకి చాలా మంచి భవిష్యత్ వుంది. రాధామోహన్ గారు చాలా పాషన్ వున్న నిర్మాత. ఈ సినిమాని చాలా అద్భుతంగా నిర్మించారు. జగపతి బాబు గారు ఎన్నో హిట్స్ చూశారు. ఈ సినిమాలో ఆయన ప్రజెన్స్ సినిమాని మరింత ప్రత్యేకంగా నిలుపుతుంది. టీం అందరికీ ఆల్ ది బెస్ట్' తెలిపారు.