RRR Movie Alluri Sita Ramaraja Fame Vinayaka Vigrahas వినాయక విగ్రహ రూపాల్లో RRR జోరు... అల్లూరి, కొమరం భీమ్ గా దర్శనమిస్తున్న బొజ్జ గణపయ్య..
RRR Movie Alluri Sita Ramaraja Fame Vinayaka Vigrahas వినాయక చవితి సందడి మొదలైపోయింది.. వినాయక విగ్రహాలు ఊరేగింపుకు సిద్ధమయ్యాయి.. ప్రతి ఏడాది వివిధ రూపాల దర్శనమిచ్చే బొజ్జ గణపయ్య ఈ ఏడాది మరిన్ని కొత్త రూపాల్లో రానున్నారు.. ప్రస్తుతం RRR చిత్రంలో రామ్ చరణ్ నటించిన అల్లూరి సీతారామరాజు పాత్రలో ఉన్న వినాయక విగ్రహాలు నెట్టింట్లో వైరల్ గా మారాయి.
ఈ చిత్రంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా కనిపించిన స్టిల్ లో ఉన్న వినాయక విగ్రహాలు తెగ హాలచల్ చేస్తున్నాయి. వీటిని రామ్ చరణ్ ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు. అల్లూరిగా రామ్ చరణ్, కొమరం భీమ్ గా ఎన్టీఆర్ తమ నటస్వరూపాన్ని చూపించారు. తమ అభిమాన హీరోల్ని ఆ పాత్రల్లో చూసిన ప్రేక్షకులు, అభిమానులు ఇప్పటికీ వారిని మర్చిపోలేక పోతున్నారు. రేపు వినాయక చవితి కావడంతో తమ అభిమాన హీరోలు నటించిన పాత్రలో వినాయకుడిని తయారు చేసి సంబరాలు జరుపుకుంటున్నారు. ఈ వినాయక చవితి సంబరాల్లోనూ ఆర్ఆర్ఆర్ క్రేజ్ ను చూపిస్తున్నారు.
దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన RRR చిత్రం ఎంత హిట్ అయిందో అందరికీ తెలిసిందే. పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అయిన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ ను కొల్లగొట్టింది. విదేశాల్లో కూడా ఈ సినిమా మంచి క్రేజ్ అందుకుంది. సినిమా ఎంతగా ఫేమస్ అయిందో ఇందులో రామ్ చరణ్, ఎన్టీఆర్ పోషించిన పాత్రలు కూడా అంతే వైరల్ అయ్యాయి. ప్రస్తుతం ఎన్టీఆర్ ఎన్టీఆర్ 30 మూవీలో నటించగా రామ్ చరణ్ పాన్ ఇండియా డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఆర్సీ 15 అనే టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాపైన అంచనాలు గట్టిగానే ఉన్నాయి.
