For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

రాచకొండ పోలీస్ కమిషనరేట్ మరియు రాచకొండ సెక్యూరిటీ కౌన్సిల్ : ఘనంగా ఆర్.కె.ఎస్.సి నాలుగవ వార్షిక జనరల్ బాడీ మీటింగ్

02:35 PM Mar 16, 2025 IST | Sowmya
Updated At - 02:35 PM Mar 16, 2025 IST
రాచకొండ పోలీస్ కమిషనరేట్ మరియు రాచకొండ సెక్యూరిటీ కౌన్సిల్   ఘనంగా ఆర్ కె ఎస్ సి నాలుగవ వార్షిక జనరల్ బాడీ మీటింగ్
Advertisement

ఈరోజు రాచకొండ సెక్యూరిటీ కౌన్సిల్ నాలుగవ వార్షిక జనరల్ బాడీ మీటింగ్ నేరేడ్మెట్లోని రాచకొండ కార్యాలయంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సమావేశానికి ఆర్.కె.ఎస్.సి సభ్య కంపెనీల ప్రతినిధులు మరియు పలువురు డీసీపీలు హాజరయ్యారు.

ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన రాచకొండ సెక్యూరిటీ కౌన్సిల్ చైర్మన్, కమిషనర్ శ్రీ సుధీర్ బాబు ఐపీఎస్ గారు మాట్లాడుతూ కమిషనరేట్ పరిధిలో శాంతిభద్రతల పరిరక్షణకు అవసరమైన అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని, నేర నియంత్రణ కోసం, మహిళల భద్రత కోసం రాచకొండ సెక్యూరిటీ కౌన్సిల్ భాగస్వామ్యంతో ఎన్నో విభిన్న అంశాల మీద అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు.

Advertisement GKSC

ఈ సంవత్సరం రోడ్డు భద్రత పట్ల ప్రజలలో అవగాహన కల్పించేందుకు భారీ ఎత్తున ప్రచార కార్యక్రమాలు నిర్వహించినట్లు, పలు కళాశాలల్లో నిర్వహించిన ప్రత్యేక సెషన్లకు విద్యార్థుల నుండి విశేష స్పందన వచ్చినట్లు పేర్కొన్నారు. ఉమెన్ ఫోరమ్, రోడ్ సేఫ్టీ ఫోరమ్, సైబర్ సెక్యూరిటీ ఫోరమ్ వంటి విభిన్న ఫోరమ్ ల ద్వారా రాచకొండ పోలీసులకు పలు విధాలుగా సహాయకారిగా ఉంటూ సమాజంలో నేర నియంత్రణలో తమ వంతు పాత్ర నిర్వహిస్తున్నందుకు ఆర్.కె.ఎస్.సి ని కమిషనర్ గారు ప్రత్యేకంగా ప్రశంసించారు. యువతను మరియు విద్యార్థులను ఆర్.కె.ఎస్.సి లో భాగస్వామ్యం చేయాలని, వారికి క్రీడలు మరియు ప్రతిభ ప్రదర్శన వంటి పోటీల నిర్వహణ ద్వారా వారిలో మరింతగా నూతన ఉత్తేజాన్ని నింపవచ్చని, సమాజం పట్ల వారి బాధ్యతను మరింతగా గుర్తు చేయవచ్చని తెలిపారు.

మహిళా భద్రతతో పాటు వారి సంక్షేమానికి కూడా అధిక ప్రాధాన్యమిస్తున్నామని, మహిళల కోసం ఉమెన్ ఫోరం ఆధ్వర్యంలో ప్రత్యేక జాబ్ మేళాను రేపు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 1500 ఉద్యోగ ఖాళీలకు గాను దాదాపు 1800 మంది ఆశావహులు రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లుగా, ఉద్యోగమేళాకు విశేష స్పందన వస్తున్నట్లుగా కమిషనర్ గారు ప్రత్యేకంగా పేర్కొన్నారు. ఆర్.కె.ఎస్.సి సభ్య కంపెనీలకు సమాజం పట్ల ఫ్యాషన్ ఉండాలని, సంస్థలో మరిన్ని కంపెనీలు భాగస్వామ్యం తీసుకోవాలని, సభ్యులందరూ మరింత ఉత్సాహంగా రాచకొండ కమిషనరేట్ తో కలిసి పని చేయాలని, నేర నియంత్రణకు అవసరమైన తమ వంతు సూచనలను అందించాలని సూచించారు.

ఈ సమావేశంలో ఆర్.కె.ఎస్.సి జనరల్ సెక్రటరీ రఘువీర్ గారు సంస్థ యొక్క వార్షిక బ్యాలెన్స్ షీట్ సభ్యులకు చదివి వినిపించారు. రాజంబాల్ గారు 20023-24 సంవత్సరానికి సంబంధించిన బ్యాలెన్స్ షీట్ను చదివి వినిపించారు. జాయింట్ సెక్రటరీలు ఈ సంవత్సరం ఆర్.కె.ఎస్.సి సంస్థ తరఫున చేపట్టవలసిన కార్యక్రమాలను చర్చించారు.

ఈ కార్యక్రమంలో మల్కాజ్గిరి డీసీపీ పివి పద్మజ ఐపిఎస్, డీసీపీ యాదాద్రి అక్షాంశ్ యాదవ్ ఐపీఎస్, డిసిపి క్రైమ్ అరవింద్ బాబు, డిసిపి అడ్మిన్ ఇందిర, డీసీపీ ట్రాఫిక్ శ్రీనివాసులు, డిసిపి ఉమెన్ సేఫ్టీ ఉషా విశ్వనాథ్, అదనపు డీసీపీ అడ్మిన్ శివకుమార్, RKSC Vice Chairman: P Sudhakar Divis Lab, ఫోరమ్ వైజ్ జాయింట్ సెక్రటరీలు: సేఫ్టీ & సెక్యూరిటి ఫోరమ్:, శ్రీ వాసుదేవ్ రావు - గ్రూప్ డైరెక్టర్ CDC SNIST, ఉమెన్స్ ఫోరం: డాక్టర్ రాధికానాథ్, శ్రీ సాయి సెక్యూరిటీ డైరెక్టర్, సైబర్ సెక్యూరిటీ ఫోరమ్: మిస్టర్ శివ కరాడి SAP సీనియర్ కన్సల్టెంట్ ఇన్ఫోసిస్, ట్రాఫిక్ ఫోరమ్: శ్రీనివాస్: శ్రీనివాస టూర్స్ & ట్రావెల్స్ వ్యవస్థాపక డైరెక్టర్, సోషల్ ఔట్రీచ్ ఫోరమ్:మిస్టర్ వంశీ ప్రోగ్రామ్ మేనేజర్ ఇన్ఫోసిస్, ఆర్.కె.ఎస్.సి చీఫ్ కోఆర్డినేటర్ సావిత్రి మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు.

Advertisement
Author Image