For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

Film Journalist Association : తెలంగాణ డిజిపి రవిగుప్తా, సిపి. కొత్తకోట. శ్రీనివాసరెడ్డిగార్లను కలిసిన టిఎఫ్‌జెఎ ప్రతినిధులు

11:14 PM Apr 13, 2024 IST | Sowmya
Updated At - 11:14 PM Apr 13, 2024 IST
film journalist association   తెలంగాణ డిజిపి రవిగుప్తా  సిపి  కొత్తకోట  శ్రీనివాసరెడ్డిగార్లను కలిసిన టిఎఫ్‌జెఎ ప్రతినిధులు
Advertisement

సోషల్‌ మీడియాలో పిచ్చిరాతలు రాసేవారి ఆటకట్టు

తెలుగు సినిమా పరిశ్రమలో సోషల్‌ మీడియా వేదికగా ఈ మధ్య రకరకాలైన వ్యక్తులు తమ స్వార్ధం కోసం అనేక విధాలుగా మీడియాలో విషం చిమ్ముతున్నారు. వీరంతా వ్యక్తిగతమైన ధూషణలు చేస్తూ తెలుగు సినిమా మీడియాలో కీలకంగా ఉన్నవారిని టార్గెట్‌ చేస్తూ మానసికంగా కృంగదీసే ప్రయత్నం చేస్తున్నారు. గతంలో కూడా ఇటువంటి అనేక చర్యలకు పాల్పడటంతో సినిమా నిర్మాణంలో కీలకంగా ఉన్న కొంతమంది నిర్మాతలు, దర్శకులు, హీరోలు కూడా వీరికి బాధితులే.

Advertisement GKSC

అందుకే తెలుగు ఫిలిమ్‌ జర్నలిస్ట్‌ అసోసియేషన్‌ (టి.ఎఫ్‌.జె.ఎ) ప్రెసిడెంట్‌ వి.లక్ష్మీనారాయణ, జనరల్‌ సెక్రటరీ వై.జె రాంబాబులు తమ అనుబంధ సంస్థ అయిన తెలుగు ఫిల్మ్‌ డిజిటల్‌ మీడియా అసోసియేషన్‌లోని (టి.ఎఫ్‌.డి.ఎ) ప్రెసిడెంట్‌ ప్రేమ, ట్రెజరర్‌ శివమల్లాలతో కలిసి డిజిపి రవిగుప్తా, హైదరాబాద్‌ సిపి. కొత్తకోట. శ్రీనివాసరెడ్డిగార్లను కలిసి ప్రస్తుతం ఉన్న పరిస్థితిని వివరించారు. పరిస్థితిని విన్న అధికారులు నిజంగానే కొన్నివార్తలు మా దృష్టికి వచ్చాయని మీరు కూడా కరెక్ట్‌ ఇన్‌ఫర్‌మేషన్‌తో ఎప్పుడైనా వచ్చి మమ్మల్ని కలిస్తే సోషల్‌ మీడియాని వెబ్‌సైట్లలో, యూట్యూబ్‌ల్లో విచ్చలవిడి రాతలు రాసే వారిని తీసుకువచ్చి తగుచర్చలు తీసుకుంటామని అన్నారు.

ఈ సందర్భంగా (టి.ఎఫ్‌.జె.ఎ), (టి.ఎఫ్‌.డి.ఎ) అసోసియేషన్‌లో జరిగే మంచి పనులను ఎలా చేస్తున్నామో వివరించారు మీడియా ప్రతినిధులు . మరో రెండు రోజుల్లో రూమర్లు పుట్టించి తమ పబ్బం గడుపుకునే వారిని పట్టుకుని విచారిస్తామని హామి ఇచ్చారు. మరో రెండురోజుల్లో పోలీస్‌ ప్రతినిధులతో కీలకమై సమావేశాన్ని నిర్వహించనున్నారు యూనియన్‌ ప్రతినిధులు.

Advertisement
Author Image