For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

స్వాతంత్య్ర సమరయోధుల, శాస్త్రవేత్తల సేవలు చిరస్మరణీయం : సామాజిక కార్యకర్త డోన్ పి. మహమ్మద్ రఫి

01:38 PM Apr 18, 2024 IST | Sowmya
Updated At - 01:38 PM Apr 18, 2024 IST
స్వాతంత్య్ర సమరయోధుల  శాస్త్రవేత్తల సేవలు చిరస్మరణీయం   సామాజిక కార్యకర్త డోన్ పి  మహమ్మద్ రఫి
Advertisement

ఏప్రిల్ 18 న భౌతిక శాస్త్రవేత్త శ్రీ ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ గారి వర్థంతి సందర్బంగా మరియు మన భారత మొదటి తరం స్వాతంత్ర్య సమరయోదుడు విప్లవ యోధుడు తాంతియా తోపే గారి వర్థంతి సందర్బంగా డోన్ పట్టణంలో సామాజిక కార్యకర్త పి. మహమ్మద్ రఫి ఆధ్వర్యంలో శ్రీ ఆల్బర్ట్ ఐన్ స్టీన్ గారి వర్థంతి సందర్భంగా మరియు మొదటి తరం స్వాతంత్ర్య సమరయోదుడు విప్లవ యోధుడు తాంతియా తోపే గారి వర్థంతి సందర్బంగా వారి చిత్రపటాలకు పూలమాల వేసి ఘణంగా నివాళి అర్పించారు.వారిని స్మరించుకున్నారు.

ఈ సందర్బంగా సామాజిక కార్యకర్త డోన్ పి.మహమ్మద్ రఫి, మాట్లాడుతూ... మన దేశ స్వాతంత్య్ర సమరయోధులను, శాస్త్రవేత్తలను ,మహనీయులను, సమాజానికి సేవలు అందించిన ప్రతి ఒక్కరిని స్మరించుకుంటూ వారి అడుగుజాడల్లో నడవాలని సామాజిక కార్యకర్త డోన్ పి.మహమ్మద్ రఫి కోరారు.

Advertisement GKSC

తాంతియా తోపే మొదటి భారత స్వాతంత్ర్య యుద్దం 1857 భారత తిరుగుబాటులో ఇతను ప్రముఖ పాత్ర వహించాడు.1857 తిరుగుబాటును బ్రిటిష్ వారు అణిచివేసిన తరువాత కూడా, తాంతియా టోప్ అడవులలో గెరిల్లా పోరాట యోధుడిగా ప్రతిఘటనను కొనసాగించాడు. బ్రిటిష్ వారి ఆగడాలను ఎదిరించినందుకు తాంతియా తోపేను 1859 ఏప్రిల్ 18న శివపురిలో బ్రిటిష్ ప్రభుత్వం ఉరితీసింది. మన దేశం కోరకు ప్రాణత్యాగాలు చేసిన స్వాతంత్ర్య సమరయోధులను అనుక్షణం స్మరించుకుంటూ వారి అడుగుజాడలలో నడుద్దామని సామాజిక కార్యకర్త డోన్ పి. మహమ్మద్ రఫి కోరారు.

శ్రీ ఆల్బర్ట్ ఐన్ స్టీన్ 1879 మార్చి 14న జర్మనీ లో జన్మించారు.జర్మనీకి చెందిన భౌతిక శాస్త్రవేత్త. ఆధునిక భౌతికశాస్త్రానికి మూలమైన రెండు సిద్ధాంతాల్లో ఒకటైన జెనరల్ థియరీ ఆఫ్ రిలెటివిటీని ప్రతిపాదించారు ఐన్ స్టీన్. ఆయన తత్త్వశాస్త్రంలో కూడా ప్రభావవంతమైన కృషి చేశారు.. 1921లో భౌతికశాస్త్రంలో నోబెల్ బహుమతి పోందారు ఐన్ స్టీన్. క్వాంటం థియరీ పరిణామ క్రమం, పరిణామ క్రమానికి ముఖ్యమైన ఫొటో ఎలెక్ట్రిక్ ఎఫెక్ట్ లాను కనిపెట్టినందుకు ఈ బహుమతి అందుకున్నారు.

స్టాటిస్టికల్ మెకానిక్స్, క్వాంటం థియరీల్లోని సమస్యలపై దృష్టి పెట్టారు ఐన్ స్టీన్. పార్టీకల్ థియరీ, అణువుల చలనాలపై వ్యాఖ్యానం చేశారు ఆయన ఉష్ణ లక్షణాల గురించి చేసిన పరిశోధన కాంతి ఫోటాన్ సిద్ధాంతం కనుగొనడానికి ఉపయోగపడింది. 1917లో సాధారణ సాపేక్షత సిద్ధాంతాన్ని విశ్వానికి అనువర్తింపచేశారు. ఈయన18ఏప్రిల్ 1955 స్వర్గస్తులైనారు. సమాజానికి సేవ చేసిన మహనీయులను , శాస్త్రవేత్తలను అనుక్షణం స్మరించుకుంటూ విద్యార్థులు వారి అడుగుజాడల్లో నడుస్తూ మంచి మంచి ప్రయోగాలు చేసి దేశానికి సేవ చేయాలని సామాజిక కార్యకర్త డోన్ పి. మహమ్మద్ రఫి కోరారు.

Advertisement
Author Image