For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

Roti Kapada Romance : నేచురల్ స్టార్ నాని చేతుల మీదుగా 'రోటీ కపడ రొమాన్స్' ట్రైలర్

09:01 PM Oct 30, 2024 IST | Sowmya
Updated At - 09:01 PM Oct 30, 2024 IST
roti kapada romance   నేచురల్ స్టార్ నాని చేతుల మీదుగా  రోటీ కపడ రొమాన్స్  ట్రైలర్
Advertisement

FILM NEWS : ‘హుషారు, సినిమా చూపిస్త మావ, మేం వయసుకు వచ్చాం, ప్రేమ ఇష్క్ కాదల్, పాగల్’ వంటి యూత్ ఫుల్ చిత్రాలను నిర్మించిన ప్రముఖ నిర్మాత, లక్కీ మీడియా అధినేత బెక్కెం వేణుగోపాల్.. సృజన్‌ కుమార్ బొజ్జంతో కలిసి నిర్మించిన చిత్రం ‘రోటి కపడా రొమాన్స్’. హర్ష నర్రా, సందీప్ సరోజ్, తరుణ్, సుప్రజ్ రంగా, సోనూ ఠాకూర్, నువ్వేక్ష, మేఘలేఖ, ఖుష్బూ చౌదరి హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రానికి విక్రమ్ రెడ్డి దర్శకుడు. నవంబరు 22న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. కాగా ఈ చిత్రం రిలీజ్‌ ట్రైలర్‌ను నేచురల్‌ స్టార్‌ నాని విడుదల చేశారు.

ఈ సందర్భంగా నాని మాట్లాడుతూ... రోటి కపడా రొమాన్స్‌ ట్రైలర్‌ చూశాను. న్యూ టాలెంట్‌ చాలా మందిని ఈ సినిమాలో చూడటం ఆనందంగా వుంది. అందరిలో మంచి ఎనర్జీ కనిపించింది. అందరికి విష్‌ యు ఆల్‌ దబెస్ట్‌. ప్రతి సంవత్సరం యంగ్‌ జనరేషన్‌ చేసిన సినిమా సన్సేషన్‌ హిట్‌ అవుతుంది.ఈ సినిమా కూడా ఆ కోవలో చేరాలని కోరుకుంటున్నాను. ఈ సినిమా అందరికి మంచి గుర్తింపు తీసుక రావాలి. నిర్మాత బెక్కెం వేణుగోపాల్‌ ఎప్పూడూ న్యూ టాలెంట్‌ను ఎంకరైజ్‌ చేస్తూ కొత్తవాళ్లకు అవకాశం ఇస్తుంటాడు. ఇలాంటి నిర్మాతలు సక్సెస్‌ కావాలి. వాళ్లు సక్సెస్‌ అయితే న్యూ టాలెంట్‌ను మరింత మందిని సపోర్ట్‌ చేస్తాడు. ట్రైయిలర్‌ చూస్తే సినిమాలో చాలా డెప్త్‌ కనిపిస్తుంది. యూత్‌కు కొత్తగా ఎదో చెప్పాలనే ప్రయత్నం కనిపిస్తుంది. ఈ సినిమాతో దర్శకుడిగా విక్రమ్‌ రెడ్డికి సక్సెస్‌ రావాలి. ఈ సినిమా ఆయన కెరీర్‌లో ప్రత్యేకంగా ఉండాలి'' అన్నారు.

Advertisement GKSC

నిర్మాతలు మాట్లాడుతూ... ' కొత్త టాలెంట్‌ను ఎప్పుడూ ప్రోత్సహించే నాని చేతుల మీదుగా మా ట్రైలర్‌ విడుదల కావడం ఆనందంగా వుంది. నేటి యువతరంకు నచ్చే అంశాలతో పాటు కుటుంబ భావోద్వేగాల మేళవింపుతో యూత్‌ఫుల్‌ రొమాంటిక్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం తెరకెక్కింది. చిత్రంలోని ప్రతి పాత్ర అందరికి ప్రతి యూత్‌కు కనెక్ట్‌ అయ్యే విధంగా వుంటుంది. రొమాన్స్‌, ఎంటర్‌టైన్‌మెంట్‌, ఎమోషన్స్‌ ఈ చిత్రానికి ప్రధాన బలాలు. తప్పకుండా చిత్రం అందరికి నచ్చుతుందనే నమ్మకం వుంది. ఇటీవల విడుదలైన పాటలకు, టీజర్‌కు మంచి స్పందన వచ్చింది. కొంత మంది ఈ చిత్రం షోస్‌ వేసి చూపించాం. సినీ పరిశ్రమలో ఈ సినిమా గురించి మంచి టాక్‌ వుంది. నవంబరు 22న చిత్రాన్ని విడుదల చేస్తున్నాం' అన్నారు.

దర్శకుడు మాట్లాడుతూ... ఎదో ఒక కొత్త పాయింట్‌ను ప్రేక్షకులకు చెప్పాలనే వుద్దేశంతో ఇలాంటి ఓ యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌ను తీశాం. హర్షవర్థన్‌ రామేశ్వర్‌ సంగీతం చిత్రానికి ఎంతో ప్లస్‌ అవుతుంది. సినిమా విజయం గురించి ఎలాంటి డౌట్‌ లేదు. తప్పకుండా హిట్‌ కొడుతున్నాం. అయితే ఏది ఏ రేంజ్‌ అనేది ఆడియన్స్‌ చేతిలో వుంది. ఇదొక ఎమోషన్‌ల్‌ రైడ్‌. లవ్‌, ఎమోషన్‌ వుంటుంది. అన్ని రకాల ఎమోషన్స్‌ చిత్రంలో వుంటాయి' అన్నారు. ఈ కార్యక్రమంలో హర్ష నర్రా, సందీప్ సరోజ్, తరుణ్, సుప్రజ్ రంగా, సోనూ ఠాకూర్, నువ్వేక్ష, మేఘలేఖ, ఖుష్బూ చౌదరి, డీఓపీ సంతోష్‌ రెడ్డి, నిర్మాతలు బెక్కెం వేణుగోపాల్, సృజన్‌కుమార్‌ బొజ్జం, ఎగ్జిక్యూటివ్‌ నిర్మాత భరత్‌ రెడ్డి.పి తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Tags :
Author Image