For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

బట్టతల రావడానికి కారణాలు ?

12:31 PM May 13, 2024 IST | Sowmya
Updated At - 12:31 PM May 13, 2024 IST
బట్టతల రావడానికి కారణాలు
Advertisement

ఒక మనిషి అందంగా వుండాలంటే ఒడ్డూ, పొడుగూ వుండాలి. మెరిసిపోయే మేనిఛాయ వుండాలి. చిరునవ్వుతో వెలిగిపోయే వదనం వుండాలి. తీరైన తెల్లని పలు వరస వుండాలి. వీటన్నింటితోపాటు నల్లని నిగనిగలాడే ఒత్తైన జుట్టు వుండాలి. కానీ, అనేకమంది స్త్రీ, పురుషులు బాధపడే, ఆందోళన చెందే సమస్య జుట్టు రాలిపోవడం, బట్టతల రావడం. బట్టతల వచ్చినవారిలో ఎంతోమంది మానసికంగా ఎంతగా కృంగిపోతారో మాటల్లో చెప్పలేం. మనుషులను మానసికంగా కృంగిపోయేలా చేసే బట్టతల ఎందుకొస్తుందీ అన్నదాని వెనక సవాలక్ష కారణాలున్నాయి. అవేంటో తెలుసుకుందాం...!!

నిజానికి మగవారికి బట్టతల రావడానికి భూమ్యాకర్షణ శక్తి కారణమయ్యే అవకాశం వుందనీ, ఇంతేగాక టెస్టోస్టిరాన్ లో మార్పులు కూడా కారణమవుతాయని అమెరికా పరిశోధకులు చేసిన అధ్యయనంలో వెల్లడైంది. టెస్టోస్టిరాన్ లో మార్పులవల్ల తలపై కొన్ని భాగాల్లో జుట్టుఊడిపోతుందనీ, హార్మోన్ లో ఈ మార్పును డీహైడ్రోటెస్టోస్టిరాన్ అంటారనీ నిపుణులు వెల్లడించారు. డి.టి.హెచ్.టి. వల్ల తలపై వుండే చర్మంలో కొవ్వు మోతాదు తగ్గి తద్వారా ఒత్తిడిని తట్టుకోలేక జుట్టు వూడిపోతుందన్నది పరిశోధనలో తేలిన సత్యం.

Advertisement GKSC

అయితే, తలపై గాక, శరీరంలోని ఇతర భాగాలపై వుండే వెంట్రుకల విషయంలో మాత్రం డి.టి.హెచ్.టి. భిన్నంగా ప్రభావం చూపుతుందిట. దీనికి తోడు ఇతర పురుష హార్మోన్ల వల్ల అక్కడి వెంట్రుకల కింద చర్మం మందంగా తయారవుతుందని అంటున్నారు. అయితే, వయసు పెరిగే కొద్దీ చర్మం, దాని కింది కొవ్వు తగ్గి పోవడంతో వెంట్రుకలు వూడిపోతాయి. దీనికి పురుషుల్లో టెస్టోస్టిరాన్ కీలక పాత్ర పోషిస్తుందంటున్నారు.

అదే మహిళల విషయంలో మాత్రం ఇలా వెంట్రుకలు వూడిపోకుండా ఈస్ట్రోజన్ హార్మోన్ నివారిస్తుందని, కనీసం మెనోపాజ్ వరకైనా ఈ పరిస్థితి వుంటుందని శాస్త్రవేత్తలు అంటున్నారు. జుట్టు రాలుతున్నట్టు మొదట్లో గమనిస్తే ఆహారంలో మార్పులు చేసుకొని అదుపు చేయొచ్చు. ముఖ్యంగా పోషక పదార్థాలు ఎక్కువగా వుండే ఆహారాలను తీసుకుంటే జుట్టు రాలే సమస్యను చాలా సులభంగా అరికట్టవచ్చు. అయితే, బట్టతల అనగానే చాలామంది జుట్టు వూడిపోవడమనే అనుకుంటారు గానీ దీంట్లోనూ రకరకాలున్నాయి. అవేంటో ఒకసారి చూద్దాం.

మగవారికి వచ్చే బట్టతల వంశపారంపర్యంగా వస్తుంది. ఇది మచ్చతో లేదా వెంట్రుకలతో తగ్గడం కనిపిస్తుంది. ఇదే ఆడవారిలో బహు అరుదుగా కనిపిస్తుంది. ఇది వ్యక్తి జన్యు అలంకరణకు సంబంధించిన విషయం. ఇక అలోపేసియా అరేటా అనే బట్టతల మచ్చలకు దారితీసి నెత్తిమీద జుట్టు మొత్తం పోతే ఇది అలోపేసియా టోటిలిస్ గా సైతం మారుతుంది. గాయం, కాలిన గాయాలు, రేడియేషన్ లేదా వ్యాధుల వల్ల అంటే చర్మ వ్యాధులు వంటి వాటి వల్ల బట్టతల మచ్చలు అభివృద్ధి చెందితే, ఈ పరిస్థితిని మచ్చల అలోపేసియా అంటారు.

టాక్సిక్ అలోపేసియా అనేది సాధారణంగా తాత్కాలికమైనది. తీవ్రమైన అనారోగ్యాలు, అధిక జ్వరాలు లేదా కొన్ని మందుల వల్ల వస్తుంది. సో, బట్టతల అనేది ఒకే సమస్య కాదు. అందులో ఎన్నెన్నో విధాలు వుంటాయి. ఏది దేనివల్ల వస్తుందన్నదాన్ని తెలుసుకుని పరిష్కారానికి కృషి చేయాలి. అయితే, మా పాఠకులకు ఓ చిన్న సలహా. బట్టతల పోయేలా చేస్తామనీ, జుట్టు మామూలుగా వచ్చేలా చేస్తామనీ చెప్పి మోసగిస్తున్నవారి సంఖ్య ఎక్కువగానే వుంది. ఇది కేవలం మోసం మాత్రమే కాదు. అనారోగ్యాలకు సైతం దారితీసే పరిస్థితులు ఎదురు కావచ్చు. అందుకే, బట్టతల వచ్చింది గదాని బాధపడుతున్నవారు క్షణికావేశంలో నిర్ణయాలు తీసుకుని జీవితాన్ని అధోగతిపాలు చేసుకోవద్దని మనవి.

Advertisement
Author Image