For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

తాడేపల్లిలో రాయదుర్గం ఎమ్మెల్యే రామచంద్రారెడ్డి అల్లుడు ఆత్మహత్య...

10:36 AM May 13, 2024 IST | Sowmya
Updated At - 10:36 AM May 13, 2024 IST
తాడేపల్లిలో రాయదుర్గం ఎమ్మెల్యే రామచంద్రారెడ్డి అల్లుడు ఆత్మహత్య
Advertisement

Crime  News:మరణానికి చిన్న పెద్దా వ్యత్యాసం ఉండదనే చెప్పుకోవాలి. ఎంత డబ్బు సంపాదించిన మనశ్శాంతి లేకపోతే ఆ డబ్బు వృధానే. తమ బాధలను పంచుకునే వ్యక్తి లేనప్పుడు ఆ వ్యక్తి కృంగిపోతారు. దిక్కు తోచని సమయంలో తన బాధను వివరించలేక చనిపోతే ఎటువంటి సమస్య ఉండదని తామంతటతమే ఆత్మహత్య చేసుకుంటారు. ఇలా పెద్ద స్టార్ గుర్తింపు ఉన్న వారి దగ్గర నుండి స్కూల్ కి వెళ్లే పిల్లల వరకు ఇలా చేసుకోవడం మనం చూస్తూనే ఉంటా. అయితే తాజాగా రాయదుర్గం ఎమ్మెల్యే అల్లుడికి ఇదే దుస్థితి ఏర్పడింది అదేంటో ఒకసారి తెలుసుకోండి.

అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి అల్లుడు శుక్రవారం రాత్రి గుంటూరు జిల్లా తమ నివాస గృహమైన తాడేపల్లిలో ఆత్మహత్య చేసుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటీగా అవంతి అపార్టుమెంటులోని ఫ్లాట్‌లో ఫ్యానుకు ఉరేసుకున్న మంజునాథరెడ్డి కిందకి దించడం జరిగింది.

Advertisement GKSC

అయితే రామచంద్రారెడ్డి కుమార్తె భర్త అయినా మంజునాధ రెడ్డి బిజినెస్ రంగాల్లో చాలా యాక్టివ్ గా ఉండేవారని ఆయన బంధుమిత్రులు తెలుపుతున్నారు. కుటుంబ సమస్యలు లేదా వ్యక్తిగత విషయంపై ఆత్మహత్య చేసుకున్నారేమో అనే వినికిడి వినిపిస్తుంది. అయితే ఆయన ఆత్మహత్యకు ఎందుకు పాల్పడ్డారు అనే విషయంపై చర్చలు జరుగుతున్నాయి. ప్రస్తుతం ఆయన మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కొరకు కార్పొరేట్‌ ఆస్పత్రిలో భద్రపర్చారు. ఆత్మహత్యకు గల కారణాలు ఏంటో ఇంకా అంతుచిక్కడం లేదు. ఆత్మహత్యకు గల కారణాలను త్వరలోనే తెలుసుకుంటామని పోలీసులు తెలపడం జరిగింది.

Advertisement
Author Image