గద్దర్ మృతికి సంతాపం తెలిపిన నవతరంపార్టీ జాతీయ అధ్యక్షుడు రావుసుబ్రహ్మణ్యం
06:36 PM Aug 06, 2023 IST | Sowmya
Updated At - 06:36 PM Aug 06, 2023 IST
Advertisement
ప్రజా గాయకుడు గద్దర్ మృతి బాధాకరం అని నవతరంపార్టీ జాతీయ అధ్యక్షుడు రావుసుబ్రహ్మణ్యం తెలిపారు. ఈమేరకు ఆయన కుటుంబ సభ్యులకు, ఆయన అభిమానులకు సంతాపాన్ని తెలిపారు.
సమాజానికి పాటల రూపంలో ఉద్యమాలను అందించిన మహనీయులు గద్దర్ అని పేర్కొన్నారు.తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున జరుగుతున్న సమయంలో అయనతో కలసి దిగిన ఫైల్ ఫోటో జతచేస్తూ సంతాప ప్రకటన చేశారు.ఈమేరకు ఆదివారం సాయంత్రం ఉత్తరప్రదేశ్ లోని వారణాశి నుండి ప్రకటన విడుదల చేశారు.
Advertisement