రామ్ చరణ్ 'గేమ్ చేంజర్' లో ఆయన్ని సరికొత్తగా డిఫరెంట్ డైమన్షన్‌లో చూస్తారు : స్టార్ డైరెక్టర్ శంకర్
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్‌లో రూపొందుతోన్న భారీ బడ్జెట్ చిత్రం ‘గేమ్ చేంజర్’. శ్రీమతి అనిత సమర్పణలో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్, దిల్‌రాజు ప్రొడక్షన్స్ బ్యానర్స్‌పై దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తోన్న ఈ సినిమాలో కియారా అద్వాని హీరోయిన్. 2024 క్రిస్మస్ సందర్భంగా సినిమాను తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో విడుదలకు సిద్ధమవుతోన్న ఈ సినిమా నుంచి సెకండ్ సాంగ్ ‘రా మచ్చా మచ్చా..’ సాంగ్‌ను సెయింట్ మార్టిన్స్ కాలేజ్‌లో స్టూడెంట్స్ సమక్షంలో విడుదల చేశారు.
స్టార్ డైరెక్టర్ శంకర్ మాట్లాడుతూ... ‘‘నేను డైరెక్ట్ చేసిన ప్రతీ సినిమాను తెలుగు ప్రేక్షకులు ఎంతగానో ఆదరించారు. అలాంటి ప్రేక్షకుల కోసం ఓ స్ట్రయిట్ మూవీ చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. ఇప్పుడు ‘గేమ్ చేంజర్’ రూపంలో అది నేరవేరుతుంది. దిల్‌రాజు, శిరీష్‌గారి నిర్మాతలుగా ఈ మూవీ తెరకెక్కుతుంది. పక్కా తెలుగు సినిమాలా ప్రతి విషయంలో కేర్ తీసుకుని ఎంతో జాగ్రత్తగా దీన్ని తెరకెక్కించాను. సాంగ్స్ విషయానికి వస్తే నేను హీరో ఇంట్రడక్షన్ సాంగ్ ఏ సినిమాలోనూ చేయలేదు. కానీ తొలిసారి ‘గేమ్ చేంజర్’లో అలాంటి హీరో ఇంట్రోసాంగ్ చేశాను.
తెలుగు సంస్కృతిని చూపించటానికి 1000 మంది జానపద కళకారులతో పాటను చిత్రీకరించాం. తమన్‌గారు రెండు రోజులు అన్నీ ట్యూన్స్‌ను రికార్డ్ చేసి ఈ పాటను తమన్‌గారు చేయటం విశేషం. రామ్ చరణ్‌గారిని సరికొత్తగా డిఫరెంట్ డైమన్షన్స్‌లో చూడొచ్చు. ఆయన మంచి డాన్సర్. పెర్ఫామర్. ఆ సాంగ్‌లో అద్భుతంగా డాన్స్ చేశారు. ఈ సాంగ్‌లో ఒక నిమిషం పాటు వచ్చే బీజీఎంను ఆయన సింగిల్ టేక్ డాన్స్‌తో పూర్తి చేశారు. మేకర్స్ అన్‌కాంప్రమైజ్డ్‌గా సినిమాను నిర్మించారు. దిల్‌రాజు, శిరీష్‌గారికి స్పెషల్ థాంక్స్. శ్రీకాంత్‌గారు ఫస్ట్ టైమ్ ఓ డిఫరెంట్ రోల్‌లో కనిపిస్తారు. ఎస్.జె.సూర్య నట రాక్షసుడు. చరణ్, సూర్య మధ్య సన్నివేశాలను ఎంతో బాగా ఎంజాయ్ చేస్తారు. అనంత్ శ్రీరామ్‌గారు పాటను అద్భుతంగా రాశారు. ఈ పాటను రేపు స్క్రీన్‌పై చూస్తున్నప్పుడు నోస్టాలజిక్ ఫీలింగ్ వస్తుంది’’ అన్నారు.
నటీ నటులు : రామ్ చరణ్, కియారా అద్వానీ, అంజలి, ఎస్.జె.సూర్య, శ్రీకాంత్, జయరాం, బ్రహ్మానందం, సునీల్, సముద్ర ఖని, నవీన్ చంద్ర, విజయ్ కృష్ణ నరేష్, వెన్నెల కిషోర్, రాజీవ్ కనకాల, శుభలేఖ సుధాకర్, రఘుబాబు, పృథ్వీరాజ్, ప్రియదర్శి, సత్య తదితరులు.
సాంకేతిక వర్గం : దర్శకత్వం: శంకర్, నిర్మాణ సంస్థలు: శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్, దిల్‌రాజు ప్రొడక్షన్స్, నిర్మాతలు: దిల్ రాజు, శిరీష్, కో ప్రొడ్యూసర్: హర్షిత్ రెడ్డి, రైటర్స్: ఎస్.యు.వెంకటేశన్, వివేక్, స్టోరీ లైన్: కార్తీక్ సుబ్బరాజ్, కో ప్రొడ్యూసర్: హర్షిత్, సినిమాటోగ్రఫీ:ఎస్.తిరుణావుక్కరసు, మ్యూజిక్: తమన్.ఎస్, డైలాగ్స్: సాయిమాధవ్ బుర్రా, లైన్ ప్రొడ్యూసర్స్: నరసింహారావ్.ఎన్, ఎస్.కె.జబీర్, ప్రొడక్షన్ డిజైనర్: అవినాష్ కొల్ల, యాక్షన్ కొరియోగ్రఫీ: అన్బరివు, వి.ఎఫ్.ఎక్స్: శ్రీనివాస్ మోహన్, డాన్స్ కొరియోగ్రాఫర్స్: ప్రభుదేవా, గణేష్ ఆచార్య, ప్రేమ్ రక్షిత్, బాస్కో మార్టిస్, జానీ, శాండీ, లిరిసిస్ట్: రామజోగయ్య శాస్త్రి, అనంత శ్రీరామ్, కాసర్ల శ్యామ్, ఎడిటర్: షామీర్ ముహ్మద్, రూబెన్, సౌండ్ డిజనర్: టి.ఉదయ్‌కుమార్, పి.ఆర్.ఒ (తెలుగు): నాయుడు సురేంద్ర కుమార్ - ఫణి కందుకూరి (బియాండ్ మీడియా), మార్కెటింగ్: టికెట్ ఫ్యాక్టరీ.