తెలంగాణ పోరాట యోధుల చరిత్రను అత్యద్భుతంగా తెరకెక్కించిన సినిమా 'రజాకార్' : మంత్రి బండి సంజయ్ కుమార్
Rajakar Movie : కాలం దాచిన తెలంగాణ విముక్తి పోరాటాన్ని, మన తెలంగాణ పోరాట యోధుల చరిత్రను అత్యద్భుతంగా తెరకెక్కించిన సినిమా "రజాకార్". రజాకార్ల దురాగతాలను ఎదురించడానికి ప్రజలే సాయుధులై కదన రంగం లో దిగిన యదార్థ కథ ఇది. చరిత్ర పుటల్లో దాగిన ఈ నెత్తురు జీవితాలను కళ్ళకు కట్టినట్లు చూపిన సినిమా "రజాకార్".
నిజాం హయాంలో జరిగిన మారణహోమాన్ని, హిందువులపై జరిగిన దౌర్జన్యాలను, బలవంతపు మత మార్పిడులను అడ్డుకునేందుకు ప్రజలే సాయుధులై ఎలా పోరాటం చేశారో ఈ "రజాకార్" సినిమాలో చూపించారు.
తెలంగాణ సాయుధ పోరాట చరిత్రను నేటి తరానికి అందించాలనే ఉద్దేశంతో అనేక వ్యయ ప్రయాసలకు ఓర్చి, ఆర్థిక నష్టాలు ఎదురైనా భయపడకుండా గూడూరు నారాయణ రెడ్డి గారు నిర్మించిన గొప్ప సినిమా "రజాకార్" సినిమా ఈనెల 24 నుండి OTT వేదికగా *#ఆహా# యాప్ లో ప్రసారం కాబోతుంది…!, ప్రతి ఒక్కరూ ఈ సినిమా చూడాలని కోరుతున్నా. ముఖ్యంగా ప్రతీ హిందువు తప్పకుండా ఈ మూవీ చూడాలని కోరుతున్నా.