Raghava Reddy : తల్లిగా ఈ పాత్ర నాకు చాలా కొత్తగా అనిపించింది : హీరోయిన్ రాశి
శివ కంఠమనేని హీరోగా రాశి, నందితా శ్వేత ప్రధాన పాత్రధారులుగా రూపొందుతోన్న చిత్రం ‘రాఘవ రెడ్డి’. స్పేస్ విజన్ నరసింహా రెడ్డి సమర్పణలో లైట్ హౌస్ సినీ మ్యూజిక్ బ్యానర్‌పై సంజీవ్ మేగోటి దర్శకత్వంలో KS శంకర్ రావ్, G.రాంబాబు యాదవ్, R.వెంకటేశ్వర్ రావు ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ మూవీ జనవరి 5న విడుదల కాబోతోంది. ఈ మేరకు చిత్రయూనిట్ మీడియా ముందుకు వచ్చి రిలీజ్ డేట్‌ను ప్రకటించింది. అనంతరం మీడియాతో ముచ్చటించారు. ఈ ఈవెంట్‌లో
రాశి మాట్లాడుతూ.. ‘హీరోయిన్‌గా నేను ఇది వరకు ఎన్నో చిత్రాలు చేశాను. ఈ కథ చెప్పిన వెంటనే నేను ఓకే చెప్పాను. చాలా వేరియేషన్స్ ఈ పాత్రలో ఉంటాయి. తల్లిగా ఈ పాత్ర నాకు చాలా కొత్తగా అనిపించింది. కూతురే ప్రపంచంగా బతికే ఆ పాత్ర నాకు చాలా నచ్చింది. నేను ఇందులో ఫుల్ సీరియస్ మోడ్‌లోనే ఉంటాను. శివ కంఠమనేని గారు సెట్స్ మీద ఎంతో కూల్‌గా ఉంటారు. జనవరి 5న మా చిత్రం రాబోతోంది. సక్సెస్ మీట్‌లో మళ్లీ కలుద్దామ’ని అన్నారు.
నటీనటులు : శివ కంఠంనేని, రాశి, నందిత శ్వేత, అన్నపూర్ణ, రఘుబాబు, శ్రీనివాస్ రెడ్డి , అజయ్ , పోసాని కృష్ణమురళి, ప్రవీణ్ , అజయ్ ఘోష్, బిత్తిరి సత్తి, BHEL ప్రసాద్, మీనా వాసు, విజయ్ భాస్కర్, తేలు రాధాకృష్ణ, రాఘవరెడ్డి తదితరులు.
సాంకేతిక వర్గం : బ్యానర్ : లైట్ హౌస్ సినీ మ్యాజిక్, సమర్పణ : స్పేస్ విజన్ నరసింహ రెడ్డి, డైలాగ్స్ : అంజన్, లిరిక్స్ : సాగర్ నారాయణ, పి.ఆర్.ఒ: సురేంద్ర నాయుడు - ఫణి (బియాండ్ మీడియా), మ్యూజిక్ : సంజీవ్ మేగోటి - సుధాకర్ మారియో, ఫైట్స్ : సింధూరం సతీష్, డాన్స్ : భాను, సన్ రే మాస్టర్ (సూర్య కిరణ్), ఎడిటింగ్ : ఆవుల వెంకటేష్, ఆర్ట్ డైరెక్టర్ : కేవీ రమణ, DOP : S. N. హరీష్, ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ : రమణ, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : ఘంటా శ్రీనివాస్ రావు, నిర్మాతలు : K. S. శంకర్ రావ్, G. రాంబాబు యాదవ్, R. వెంకటేశ్వర్ రావు, స్టోరీ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం : సంజీవ్ మేగోటి.