నీలిచిత్రాల ప్రభావంతో చిన్నారులపై లైంగిక దాడులు : జి.సుధీర్ బాబు, ఐపిఎస్,
12:03 AM Sep 30, 2024 IST | Sowmya
Updated At - 12:03 AM Sep 30, 2024 IST
Advertisement
చిన్నారులపై లైంగిక దాడులు పెరిగిపోతున్న నేపథ్యంలో రాచకొండ పోలీస్ వారు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. చిన్నారులపై లైంగిక దాడులు చేస్తున్న నేరగాళ్ళ పై నీలిచిత్రాల ప్రభావం ఉన్నట్లుగా పలుసందర్భాలలో రుజువైంది.
ఏ కన్నూ చూడదనే మిడిసిపాటుతో విచ్చలవిడిగా చిన్నపిల్లల అశ్లీల చిత్రాలను FACEBOOK/WHATSAPP లేదా ఏదైనా సోషల్ మీడియా లో చూసినా, పంపినా పోలీస్ వారి నిఘా నేత్రం వారిని వెంటాడుతూనే ఉంటుంది.
నేరానికి పాల్పడినవారు ఎవరూ కూడా చట్టం యొక్క ఉక్కు పాదం నుండి ఎప్పటికీ తప్పించుకోలేరు. భారతీయ న్యాయ సంహిత, POCSO మరియు IT చట్టాల ప్రకారం నిందితులకు కనీసం 5 సంవత్సరములవరకు జైలు శిక్ష విధించబడుతుంది. మన పిల్లలను మానవ మృగాలనుండి కాపాడుకుందాం, నేరరహిత సమాజంలో భాగస్వాములం అవుదాం.
మీ
జి.సుధీర్ బాబు, ఐపిఎస్,
కమిషనర్ ఆఫ్ పోలీస్,
రాచకొండ.
Advertisement