2024 ఆసియా ఓపెన్ పోలీస్ తైక్వాండో ఛాంపియన్‌షిప్ పోటీలలో రాచకొండ పోలీస్ ఘనత
2024 Asian Open Police Taekwondo Championship : వియత్నాంలో డిసెంబర్ 6 నుండి 9 2024 వరకు జరిగిన 2024 ఆసియా ఓపెన్ పోలీస్ తైక్వాండో ఛాంపియన్‌షిప్ పోటీలలో రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పనిచేస్తున్న ఏఆర్ కానిస్టేబుల్ డి.సంజీవ్ కుమార్ ARPC -9025 పాల్గొని అండర్ - 34 కేటగిరిలో తృతీయ స్థానం పొంది కాంస్య పతకం సాధించడం జరిగింది. ఈ పోటీలలో దాదాపు 30 దేశాల నుండి దాదాపు 2500 మంది క్రీడాకారులు పాల్గొనడం జరిగింది.
ఈ సందర్భంగా నేరేడ్ మెట్ లోని రాచకొండ కమిషనర్ కార్యాలయంలో సిపి శ్రీ సుధీర్ బాబు ఐపీఎస్ గారు సంజీవ్ కుమార్ ను అభినందించి సత్కరించారు. ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తూ, వివిధ క్రీడలలో ఇలాగే తమ ప్రత్యేక ప్రతిభను ప్రదర్శిస్తూ భవిష్యత్తులో మరిన్ని పతకాలు సాధించి రాచకొండ కమిషనరేట్ కు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో రిజర్వ్ ఇన్స్పెక్టర్ శ్రీకాంత్ పాల్గొన్నారు.