For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

పోలీసు స్టేషన్లు, కార్యాలయాల్లో ఏర్పాటు చేయనున్న క్యూఆర్ కోడ్ పోస్టర్లను ఆవిష్కరించిన కమిషనర్

10:56 PM Jul 24, 2024 IST | Sowmya
Updated At - 10:56 PM Jul 24, 2024 IST
పోలీసు స్టేషన్లు  కార్యాలయాల్లో ఏర్పాటు చేయనున్న క్యూఆర్ కోడ్ పోస్టర్లను ఆవిష్కరించిన కమిషనర్
Advertisement

రాచకొండ పోలీస్ కమిషనరేట్ సామాజిక మాధ్యమాల అకౌంట్ల గురించి ప్రజల్లో అవగాహన పెంచేందుకు, వాటిని అందరికీ చేరువ చేసేందుకు సీపీ శ్రీ సుధీర్ బాబు., ఐపిఎస్ గారు క్యూఆర్ కోడ్ పోస్టర్లను నేరేడ్మెట్ లోని రాచకొండ కార్యాలయంలో ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా సీపీ గారు మాట్లాడుతూ.. రాచకొండ పరిధిలో శాంతి భద్రతల పరిరక్షణ చర్యలలో భాగంగా, రాచకొండ పోలీస్ "ఫేస్ బుక్" "ఎక్స్" "ఇన్స్టాగ్రామ్" వంటి సామాజిక మాధ్యమాల అకౌంట్లు మరియు యూట్యూబ్ ఛానల్ నిర్వహించడం జరుగుతోందని పేర్కొన్నారు. ప్రతీ పోలీస్ స్టేషన్ ఆవరణలో, రిసెప్షన్ లో రాచకొండ పోలీస్ క్యూఆర్ కోడ్ కలిగిన పోస్టర్లను ఏర్పాటు చేయడం జరుగుతుందని, ప్రజలంతా ఈ క్యూఆర్ కోడ్ ను ఉపయోగించుకుని, తమ మొబైల్ ఫోన్లలో స్కాన్ చేయడం ద్వారా సంబంధిత రాచకొండ కమిషనరేట్ సోషల్ మీడియా అకౌంట్లకు సులభంగా చేరుకుని సబ్ స్క్రైబ్ చేసుకోవచ్చని, ఫాలో కావచ్చని తెలిపారు. కాలానికి అనుగుణంగా అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీని ఉపయోగించుకుంటూ ప్రజలకు మరింత చేరువ అయ్యేందుకు, వారికి మెరుగైన సత్వర సేవలు అందించేందుకు, వారితో ప్రత్యక్ష సంబంధాలు పెంపొందించుకోవడానికి ఈ సోషల్ మీడియా అకౌంట్లు దోహదం చేస్తాయని సీపీ పేర్కొన్నారు. ప్రజల్లో రాచకొండ కమిషనరేట్ సోషల్ మీడియా అకౌంట్ల గురించి మరింత ప్రచారం కల్పిస్తామని, ప్రతీ ఒక్కరూ వాటిని ఫాలో కావాలని సూచించారు.

Advertisement GKSC

వీటి ద్వారా ఎప్పటికప్పుడు డ్రగ్స్ వినియోగం వల్ల కలిగే అనర్ధాల గురించి పలు అవగాహన కార్యక్రమాల నిర్వహణ, సైబర్ నేరాల పట్ల ప్రజలను అప్రమత్తం చేయడం, భారీ వర్షాలు, వరదలు, అగ్ని ప్రమాదాలు మరియు ఇతర సందర్భాల్లో విపత్తు నిర్వహణ సమాచారం అందించడం జరుగుతుంది అని తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో రాచకొండ వాట్సాప్ కంట్రోల్ నంబర్ 8712662111 ద్వారా కూడా బాధితులు ఫిర్యాదు చేయవచ్చని పేర్కొన్నారు.

ఈ సమావేశంలో డీసీపీ యాదాద్రి రాజేష్ చంద్ర ఐపీఎస్, డీసీపీ ఎల్ బి నగర్ ప్రవీణ్ కుమార్ ఐపిఎస్, డీసీపీ ఎస్బి కరుణాకర్, డీసీపీ క్రైం అరవింద్ బాబు, డీసీపీ మహేశ్వరం సునీత రెడ్ది, డీసీపీ ఉమెన్ సేఫ్టీ ఉషా విశ్వనాథ్, ఐటి సెల్ ఏసిపి నరేందర్ గౌడ్, ఇన్స్పెక్టర్ లు సుధాకర్, గట్టు మల్లు తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Author Image