For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

Rachakonda Police : లోక్ సభ ఎన్నికలకు కట్టుదిట్టమైన భద్రత : సీపీ తరుణ్ జోషి ఐపీఎస్

10:39 AM Mar 19, 2024 IST | Sowmya
Updated At - 10:39 AM Mar 19, 2024 IST
rachakonda police   లోక్ సభ ఎన్నికలకు కట్టుదిట్టమైన భద్రత   సీపీ తరుణ్ జోషి ఐపీఎస్
Advertisement

ఎన్నికల నిబంధనల మీద అన్ని స్థాయిల సిబ్బందికి అవగాహన కల్పించేలా చర్యలు - రాచకొండ డీసీపీలు, అదనపు డీసీపీ లు, ఏసిపిలు, ఇతర అధికారులతో వీడియో సమీక్షా సమావేశంలో కమిషనర్ 

త్వరలో జరగనున్న లోక్ సభ ఎన్నికలను పురస్కరించుకొని క్షేత్రస్థాయిలో చేపట్టవలసిన భద్రత ఏర్పాట్లను మరియు తీసుకోవలసిన జాగ్రత్తల గురించి ఈరోజు రాచకొండ పోలీస్ కమిషనర్ శ్రీ తరుణ్ జోషి ఐపిఎస్ గారు రాచకొండ డీసీపీలు, అదనపు డీసీపీ లు, ఏసిపి మరియు ఇతర అధికారులతో వీడియో సమీక్ష నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో కమిషనర్ మాట్లాడుతూ.. లోక్ సభ ఎన్నికల కోసం నోటిఫికేషన్ విడుదలైన నేపథ్యంలో ఎన్నికల సంఘం నియంత్రణలో క్రమశిక్షణతో పని చేయాలనీ, ఎన్నికలలో ఎటువంటి పొరపాట్లు జరుగకుండా చూసుకోవాలని రాచకొండ సీపీ అన్నారు.

Advertisement GKSC

ఈ సమావేశంలో కమిషనర్ మాట్లాడుతూ... లోక్ సభ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించడానికి ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేయాలని కమిషనర్ పేర్కొన్నారు. రాచకొండ పరిధిలో అవసరమైన అన్ని చోట్ల చెక్ పోస్టులను ఏర్పాటు చేసి, పకడ్బందీగా తనిఖీలు నిర్వహించాలని సూచించారు. అక్రమంగా తరలిస్తున్న డబ్బును పట్టుకోవడానికి అవసరమైన చోట్ల మరిన్ని చెక్ పోస్టులను ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా కమిషనర్ సూచించారు. ఎన్నికల విధులకు సంబంధించిన నిర్దిష్టమైన సూచనలను తమ కింది స్థాయి సిబ్బందికి అందించాలని, క్షేత్రస్థాయిలో విధులు నిర్వర్తించే కిందిస్థాయి సిబ్బందికి కూడా ఎన్నికల నిబంధనల మీద పరిజ్ఞానాన్ని, అవగాహనను కల్పించడానికి సిబ్బందితో సమావేశాలను కూడా ఏర్పాటు చేసుకోవాలని పేర్కొన్నారు. విజిబుల్ పోలీసింగ్ కు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు.

ఎన్నికల నిబంధనలకు సంబంధించి ప్రతి అంశంపై అధికారులు మరియు సిబ్బంది సంపూర్ణ పరిజ్ఞానం కలిగి ఉండాలని సూచించారు. అధికారులు సంబంధిత పోలీస్ స్టేషన్ పరిధిలోని పోలింగ్ కేంద్రాలపై పూర్తిగా అవగాహన కలిగి ఉండి, పకడ్బందీగా చర్యలు తీసుకోవాలని సూచించారు. అధికారులు సిబ్బంది క్షేత్రస్థాయిలో ఉన్న పరిస్థితులను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండాలని, ఎన్నికల విధులకు ఆటంకం కలిగించేలా ప్రవర్తించే వ్యక్తుల మీద నిఘా వేసి ఉంచాలని సూచించారు. ఎన్నికల నిర్వహణలో క్రిటికల్ పోలింగ్ కేంద్రాలు, వల్నరబుల్ పోలింగ్ ప్రాంతాల గుర్తింపు పట్ల స్పష్టతతో ఉండాలని, ఎన్నికల నిర్వహణ పరికరాలు తీసుకెళ్ళే రూట్ చెక్ చేసుకోవాలని పేర్కొన్నారు. చెక్ పోస్ట్ ల వద్ద పటిష్ట భద్రత ఏర్పాటు చేయాలని మరియు అధికారులు సిబ్బంది సమన్వయంతో పని చేయాలని సూచించారు.

అత్యవసరం ఉన్న పోలింగ్ స్టేషన్ ప్రాంతాలలో సిసి కెమెరాల ఏర్పాటు, పోలింగ్ స్టేషన్ లో మౌలిక సదుపాయాల ఏర్పాటు ముందుగానే చూసుకోవాలని, ఇతర ప్రభుత్వ శాఖల సమన్వయంతో పనిచేయాలని, ఇంతకు ముందు ఎలక్షన్స్ సమయంలో ఎదురైన సమస్యలను సృష్టించిన వారి పై పూర్తి నిఘా ఉంచాలని, రౌడీ షీటర్స్ ను, సస్పెక్ట్ షీట్ ఉన్నవారిని, హిస్టరీ షీట్ ఉన్నవారిని బైండోవర్ చేయాలని తెలిపారు. ఎన్నికల సమయంలో లా అండ్ ఆర్డర్ సమస్య, గొడవలు సృష్టంచే అవకాశం ఉన్న సోషల్ మీడియా సందేశాలు, వీడియోలు వైరల్ చేసే విషయాలు, చిన్న విషయాలైన ఉన్నత అధికారులకు సమాచారం అందించాలని, సిబ్బంది ఎల్లప్పుడూ అలర్ట్ గా ఉండేలా చూడాలని, సమస్యాత్మక గ్రామాలను విధిగా పర్యటిస్తూ అట్టి గ్రామాలపై దృష్టిసారించాలని తెలిపారు.

ఈ సమావేశంలో యాధాద్రి డీసీపీ రాజేశ్ చంద్ర ఐపిఎస్, మల్కాజిగిరి డీసీపీ పద్మజ ఐపిఎస్, మహేశ్వరం డిసిపి సునీత రెడ్డి, ఎల్బి నగర్ డీసీపీ ప్రవీణ్ కుమార్, రాచకొండ అడ్మిన్ డీసీపీ ఇందిర, ఎస్బి డీసీపీ కరుణాకర్, డీసీపీ సైబర్ క్రైమ్ చంద్ర మోహన్, addl డీసీపీ sb రఫిక్, ఎలక్షన్ సెల్ addl డీసీపీ శ్రీనివాస్ కుమార్, ఏసిపి శ్రీధర్ రెడ్డి, ఏసిపి నరేందర్ గౌడ్ మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు.

Advertisement
Author Image