Viral పొలంలో పని చేసుకుంటున్న రైతును ఒక్కసారిగా ఉలిక్కి పడేట్టు చేసిన భారీ కొండచిలువ.. ఎక్కడంటే..
Viral : వర్షాలు ఇప్పుడిప్పుడే తగ్గుతుండటంతో రైతులు అంతా పొలాల్లో పని చేసుకుంటున్నారు ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉండగా అక్కడ జరిగిన ఓ షాకింగ్ సంఘటన అందరినీ ఉలిక్కిపడేలా చేసింది జనాలు అంతా భయంతో ప్రాణాలు చేత పట్టుకొని పరుగులు తీశారు.. ఇంతకీ ఏం జరిగిందంటే..
పొలంలో పని చేసుకుంటున్నప్పుడు పాములు కనిపించడం సాధారణమే.. అయితే అవి రైతులని ఏమీ ఇబ్బంది పెట్టవు. వర్షాకాలంలో ఇది మరింత సామాన్యమైన విషయమే.. అయితే అడవుల్లో కనిపించాల్సిన భారీ కొండచిలువలు ఒక్కసారిగా పొలాల్లో కనిపిస్తే ఎవరికైనా ఎలా ఉంటుంది.. ఓ ఇలాంటి షాకింగ్ సంఘటనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో సత్యసాయి జిల్లాలో జరిగింది.. ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉంటుంటే అకస్మాత్తుగా ఒక భారీ కొండ శిలువ ప్రత్యక్షమైంది ఇది చూసిన రైతులంతా ఒకసారిగా పరుగు తీశారు భయంతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని కేకలు వేశారు.. అనంతరం స్థానికంగా ఉండే స్నేక్ క్యాచర్‌కు సమాచారాన్ని అందించారు.
అయితే సమాచారం అందుకున్న వెంటనే అతడు స్పాట్‌కు చేరుకుని.. ఎంతో చాకచక్యంగా ఆ పెద్ద కొండచిలువను బంధించాడు. అక్కడ ఉన్న రైతులంతా ఊపిరి పీల్చుకున్నారు.. కొండచిలువను తీసుకెళ్లి అటవీ ప్రాంతంలో క్షేమంగా వదిలిపెట్టాడు.. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.. వీడియో అయితే వైరల్ గా మారింది కానీ రేపటి నుంచి ఆ పొలంలో పనులకు వెళ్లాలనుకున్న రైతుల సంగతి ఏమవుతుందో చూడాలి.
