For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

Latest Telugu Movies : "ప్రేమిస్తున్నా'' సినిమా ఫస్ట్ లుక్, ఫస్ట్ సాంగ్ అరెరె విడుదల

03:20 PM Jul 01, 2025 IST | Sowmya
Updated At - 03:20 PM Jul 01, 2025 IST
latest telugu movies    ప్రేమిస్తున్నా   సినిమా ఫస్ట్ లుక్  ఫస్ట్ సాంగ్ అరెరె విడుదల
Advertisement

వరలక్ష్మీ పప్పుల ప్రజెన్స్ లో కనకదుర్గారావు పప్పుల నిర్మాతగా భాను దర్శకత్వంలో సరికొత్త ప్రేమకథతో రాబోతున్న సినిమా ప్రేమిస్తున్నా. సాత్విక్ వర్మ, ప్రీతి నేహా హీరో హీరోయిన్లు గా నటించారు.

ఈ చిత్ర ఫస్ట్ లుక్, ఫస్ట్ సాంగ్ ను చిత్ర యూనిట్ విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో సంగీత దర్శకులు భీమ్స్, దర్శకులు అశోక్.జి, అనుదీప్ కె.వి, భాను బోగవరుపు, కాసర్ల శ్యామ్, తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఐబిఎమ్ మెగా మ్యూజిక్ ఆడియో కంపెనీ ను లాంచ్ చెయ్యడం విశేషం.

Advertisement GKSC

ఈ సందర్భంగా నిర్మాత కనకదుర్గారావు పప్పుల మాట్లాడుతూ…
అన్ని ప్రేమకథల్లోనూ ప్రేమ ఉంటుంది, కానీ ఈ ప్రేమకథలో ఆకాశమంత ప్రేమ అనంతమైన ప్రేమ ఉంటుంది, లవ్ లో ఇదివరకు ఎవ్వరూ టచ్ చెయ్యని ఒక డిఫరెంట్ పాయింట్ తో ప్రేమిస్తున్నా సినిమాను తెరకెక్కించారు దర్శకుడు భాను. యంగ్ జనరేషన్ మళ్ళీ మళ్ళీ చూడాలనుకునే అనేక ఎలిమెంట్స్ ఈ సినిమాలో ఉండబోతున్నాయి.

ఈ చిత్రం నుండి అరెరె సాంగ్ ను భీమ్స్ గారు విడుదల చేయడం సంతోషంగా ఉంది. సుద్దాల అశోక్ తేజ గారు అద్భుతంగా రాశారు, అనురాగ్ కులకర్ణి ఈ పాటను తనదైన శైలిలో పాడడం జరిగింది, సిద్ధార్థ్ సాలూర్ మంచి సంగీతం అందించారని తెలిపారు.

దర్శకుడు భాను మాట్లాడుతూ…
ఎన్నో చిత్రాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన సాత్విక్ వర్మ ప్రేమిస్తున్నా సినిమాతో హీరోగా లాంచ్ అవుతున్నారు. అలాగే తెలుగమ్మాయి ప్రీతి నేహా హీరోయిన్ గా పరిచయం అవుతోంది. ఇద్దరూ పోటీపడి బాగా నటించారు. నిర్మాత కనకదుర్గారావు గారు సినిమాను ప్రేమించే మంచి టేస్ట్ ఉన్న మనిషి, మమ్మల్ని నమ్మి ఈ సినిమాను ముందుకు తీసుకొని వెళ్లారు. మంచి లవ్ స్టోరీతో త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాము. ప్రేమిస్తున్నా అందరికి కనెక్ట్ అయ్యే సినిమా అవుతుందని తెలిపరు.

సాలూరి రాజేశ్వర రావు గారి కుటుంబం నుండి వస్తోన్న సిద్ధార్థ్ సాలూరి ఈ సినిమాకు అద్భుతమైన సంగీతం అందిస్తున్నారు. ఇదొక మ్యూజికల్ లవ్ స్టొరీ కాబోతోంది. భాస్కర్ శ్యామల ఈ సినిమాకు తనదైన స్టైల్ లో సినిమాటోగ్రఫీ అందించారు, అనిల్ కుమార్ అచ్చు గట్ల ఈ సినిమాకు ఆలోచింపజేసే విధంగా సంభాషణలు రాయడం జరిగింది, ఈ సినిమాకు నిర్వహణ మర్రి రవికుమార్, ఎడిటర్ శిరీష్ ప్రసాద్.

సంగీతమే ప్రధానంగా సాగే ఈ ప్రేమకథలో వచ్చే సన్నివేశాలు చాలా ఆసక్తికరంగా, నెక్స్ట్ ఏం జరుగుతుందో అనే సస్పెన్స్ తో దర్శకుడు భాను రూపొందించారు.

Advertisement
Author Image