For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

'ప్రతినిధి 2' మంచి పొలిటికల్ థ్రిల్లర్ : డైరెక్టర్ మూర్తి దేవగుప్తపు

'Pratnidhi 2' is a good political thriller. Coming with great content, Director Murthy Devagupta
11:23 PM May 09, 2024 IST | Sowmya
Updated At - 11:23 PM May 09, 2024 IST
'Pratnidhi 2' is a good political thriller. Coming with great content, Director Murthy Devagupta
 ప్రతినిధి 2  మంచి పొలిటికల్ థ్రిల్లర్   డైరెక్టర్ మూర్తి దేవగుప్తపు
Advertisement

హీరో నారా రోహిత్ సినిమాల్లోకి కమ్ బ్యాక్ ఇస్తూ, ప్రముఖ జర్నలిస్ట్ మూర్తి దేవగుప్తపు దర్శకుడిగా అరంగేట్రం చేస్తున్న చిత్రం ప్రతినిధి 2. వానరా ఎంటర్‌టైన్‌మెంట్స్, రానా ఆర్ట్స్ బ్యానర్‌లపై కుమార్ రాజా బత్తుల, ఆంజనేయులు శ్రీ తోట, సురేంద్రనాథ్ బొల్లినేని నిర్మించారు. సిరి లెల్ల హీరోయిన్ గా నటించారు. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్స్ అందరి దృష్టిని ఆకర్షించి మంచి అంచనాలు నెలకొల్పాయి. ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఈ చిత్రం మే 10న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ నేపధ్యంలో  చిత్ర యూనిట్ ప్రెస్ మీట్ నిర్వహించింది.

ప్రెస్ మీట్ లో దర్శకుడు మూర్తి దేవగుప్తపు మాట్లాడుతూ..  మా నిర్మాతలు కుమార్ రాజా, ఆంజనేయులు, సురేంద్రనాథ్ గారు ఎక్కడా రాజీపడకుండా హై ప్రొడక్షన్ వాల్యూస్ తో సినిమాని నిర్మించారు. హీరో రోహిత్ గారు అద్భుతమైన పెర్ఫార్మెన్స్ చేశారు. ఇప్పటికే టీజర్ ట్రైలర్ లో ప్రేక్షకులు చూశారు. నేను ఫస్ట్ సినిమా చేసినప్పుడు హీరోయిన్ గా తెలుగమ్మాయికి కే అవకాశం ఇవ్వాలని అనుకున్నాను. అందుకే సిరి ని ఎంపిక చేశాం.

Advertisement GKSC

దినేష్, అజయ్ ఘోష్, సచిన్ కేడ్కర్, జిషు సేన్ గుప్తా, ఇంద్రజ, సప్తగిరి ఇలా ప్రముఖ నటీనటులు చాలా ముఖ్యమైన పాత్రలలో అద్భుతంగా నటించారు. నటీనటులు, మ్యూజిక్ సాగర్, ఎడిటర్ రవితేజ.. ఇలా అందరూ సీనియర్లు. యూనిట్ లో  జూనియర్ నేనే. ఇది దర్శకుడిగా నా మొదటి సినిమా. అయితే వారందరూ అనుభవం వున్న వారు కావడంతో నా పని తేలికయ్యింది.

ఇందులో జర్నలిస్ట్ హీరో. ప్రతి జర్నలిస్ట్ కి ప్రతిరూపంగా ఇందులో హీరో పాత్ర వుంటుంది. జర్నలిస్ట్ సమాజంపై బాధ్యతతో ఉద్యోగం చేస్తాడు. ఇందులో హీరో అదే భాద్యతతో పని చేస్తాడు. ఇది మంచి పొలిటికల్ థ్రిల్లర్. ఖచ్చితంగా అందరినీ అలరిస్తుందనే నమ్మకం వుంది'' అన్నారు.

Advertisement
Author Image