Akkada Ammayi Ikkada Abbayi : ప్రదీప్ మాచిరాజు, దీపిక పిల్లి 'అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి' ఫన్ ఫిల్డ్ ట్రైలర్ లాంచ్
FILM NEWS : టీవీ యాంకర్ టర్న్డ్ హీరో ప్రదీప్ మాచిరాజు మోస్ట్ ఎవైటెడ్ మూవీ 'అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి' వేసవిలో వన్ అఫ్ ది బిగ్గెస్ట్ ఎట్రాక్షన్ గా ఏప్రిల్ 11న థియేటర్లలోకి రావడానికి సిద్ధంగా ఉంది. ఈ యూనిక్ లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ను యంగ్ ట్యాలంటెండ్ డైరెక్టర్స్ డుయో నితిన్, భరత్ దర్శకత్వం వహిస్తున్నారు. మాంక్స్ & మంకీస్ బ్యానర్ నిర్మిస్తున్న ఈ ఎగ్జైటింగ్ ఎంటర్‌టైనర్‌లో దీపికా పిల్లి కథానాయికగా నటిస్తోంది. టీజర్, పాటలు ఇప్పటికే అద్భుతమైన రెస్పాన్స్ అందుకున్నాయి. ఈరోజు, మేకర్స్ థియేట్రికల్ ట్రైలర్‌ను లాంచ్ చేశారు.
ఈ కథ ఒక మారుమూల గ్రామంలో ఒక ప్రాజెక్ట్‌ను సూపర్ వైజ్ చేయడానికి నియమించబడిన సివిల్ ఇంజనీర్ చుట్టూ నడిచింది, అక్కడ అతను 60 మంది అనుభవం లేని కార్మికులతో పని చేయించాలి గ్రామస్తులలో, ఒకే ఒక అమ్మాయి ఉంది, ఆమె తండ్రి 60 మందిలో ఒకరిని పెళ్లి చేసుకోవాలని అనౌన్స్ చేస్తాడు. ప్రాజెక్ట్ ముందుకు సాగుతున్న కొద్దీ, ఇంజనీర్ మరియు అమ్మాయి ఇద్దరూ ప్రేమలో పడతారు. తర్వాత జరిగే సిచువేషన్స్ చాలా ఎక్సైటింగ్ గా టర్న్ అవుతాయి.
నితిన్-భరత్ ద్వయం హ్యుమర్ తో కూడిన ప్రత్యేకమైన కథాంశాన్ని ఎంచుకున్నారు. ఎక్సయిటింగ్ సిచువేషన్స్ తో నవ్వును అందించడంలో వారు విజయం సాధించారు. డైలాగ్స్ ఆకట్టుకున్నాయి. ప్రదీప్ మాచిరాజు తన పాత్రకు పెర్ఫెక్ట్ గా ఫిట్ అయ్యారు, తన టైమింగ్ తో హ్యుమర్ ని అద్భుతంగా పండించారు. దీపికా పిల్లి పెర్ఫార్మెన్స్ కి స్కోప్ వుండే పాత్రలో కనిపించింది. వెన్నెల కిషోర్, సత్య, గెటప్ శ్రీను వినోదాన్ని పుష్కలంగా అందించారు.
MN బాల్‌రెడ్డి గ్రామీణ వాతావరణాన్ని అందంగా చూపించారు, రధన్ సంగీతం ప్లజెంట్ గా వుంది. కోదాటి పవన్ కళ్యాన్ ఎడిటర్ . నిర్మాణ విలువలు ఉన్నతంగా వున్నాయి. కథ, డైలాగ్స్ సందీప్ బొల్లా రాశారు. అశిష్టేజ పులాల ప్రొడక్షన్ డిజైనర్. మొత్తంమీద, అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి రొమాన్స్, విలేజ్ డ్రామాతో కూడిన వినోదాత్మకంగా ఉంటుందని ట్రైలర్ హామీ ఇస్తుంది.
ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో హీరో ప్రదీప్ మాచిరాజు మాట్లాడుతూ.. అందరికి నమస్కారం. మా టీవీ షోస్ చూసి ఆడియన్స్ అందరూ ఎలా అయితే ఎంటర్టైన్ అయ్యారో అలాగే అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమాని కూడా ఆడియన్స్ అంతే గొప్పగా ఎంజాయ్ చేస్తారు. సినిమా ఏప్రిల్ 11న రిలీజ్ అవుతుంది. సినిమా ఆద్యంతం ఎంటర్టైన్మెంట్ తో ఉంటుంది. చాలా సరదాగా ఉంటుంది. తప్పకుండా మీ అందరికీ నచ్చుతుందని నమ్ముతున్నాం. మా టీ థాంక్యూ చాలా కష్టపడి పని చేశారు. కథ నచ్చి అందరూ చాలా ఇష్టంగా ఈ ప్రాజెక్టును చేశారు. మా బెస్ట్ ఫ్రెండ్స్ అందరు కలిసి ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ సినిమా మాలు మంచి గుర్తింపును తీసుకురావాలని కోరుకున్నాం. ఫ్యూచర్లో మరిన్ని మంచి మంచి సినిమాలు చేయడానికి ఈ సినిమా ఒక మెట్టు అవుతుందని భావిస్తున్నాం. పాటలకు టీజర్ ట్రైలర్ కు ప్రేక్షకులు వండర్ఫుల్ సపోర్ట్ అందించారు. సినిమా తప్పకుండా మీ అందరికీ నచ్చుతుందని కోరుకుంటున్నాను'అన్నారు.
హీరోయిన్ దీపిక పిల్లి మాట్లాడుతూ... అందరికీ నమస్కారం. అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి నా ఫస్ట్ డెబ్యు ఫిలిం ఈ సినిమా నా మనసుకి చాలా నచ్చింది. ఇందులో చాలా స్పెషల్ క్యారెక్టర్ ప్లే చేశాను. తన క్యారెక్టర్ లో అన్ని ఎమోషన్స్ ఉంటాయి. చాలా ఎంజాయ్ చేస్తూ ఈ క్యారెక్టర్ ప్లే చేశాను. అందరూ ఏప్రిల్ 11న థియేటర్స్ లో సినిమా చూసి మమ్మల్ని సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను'అన్నారు.
డైరెక్టర్ భరత్ మాట్లాడుతూ.. అందరికీ గుడ్ ఈవెనింగ్. నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రదీప్ అన్నకి థాంక్యూ. ఇది ఫ్యామిలీ అంతా కలిసి చూసే సినిమా. ఏప్రిల్ 11న అందరూ ఎంజాయ్ చేస్తారు'
డైరెక్టర్ నితిన్ మాట్లాడుతూ.. అందరికి నమస్కారం. ముందుగా ప్రదీక్ కి థాంక్యూ. ఈ కథ చెప్పగానే చాలా ఎక్సైట్ అయ్యారు. ఇది బ్యూటిఫుల్ రొమాంటిక్ కామెడీ ఎంటర్. అందరూ థియేటర్స్ కి వచ్చి ఎంజాయ్ చేయొచ్చు. ఫైనల్ కాఫీ చూసాము. సినిమా చాలా అద్భుతంగా వచ్చింది. ఏప్రిల్ 11న అందరూ థియేటర్స్ లో ఈ సినిమా చూడాలని కోరుకుంటున్నాను'అన్నారు.
Cast : Pradeep Machiraju, Deepika Pilli, Vennela Kishore, Satya, Getup Srinu, Muralidhar Goud, Brahmaji, G M Sundar, John Vijay, Rohini, Jhansi, and others.
Technical Crew :
Production Banner: Monks & Monkeys
Screenplay & Direction: Nitin – Bharath
Music: Radhan
DOP: MN Balreddy
Editor: Kodati Pavankalyan
Production Designer: Asishteja Pulala
Story & Dialogues: Sandeep Bolla
Co-Director: Sanghamitra Gaddam
Costume Designer: Manasa Nunna
Choreography: Sekhar Vj , Viswa Raghu , Yash , Ram
Lyricists: Chandra Bose ,Rakendu Mouli , Sridhar Aavunoori
Vfx: Deccan Dreams
Vfx Supervisor: Arun Pawar
Di & Sfx & Mixing: Annapurna Studios
Direction Team: Kolanu Karthik Dabbeta, Bokka Gouthami Reddy, Himavanth, Vj Maddala
Associate Editor: Likhith Lee
Production Manager: Aerolla Pramod Kumar
Makeup Chief: Praveen (Pandu)
PRO: Vamsi Shekar
Marketing: First Show