రెండవసారి ప్రపంచ స్థాయిలో సత్తా చాటిన తెలంగాణ రాష్ట్రా రిటైర్డ్ గెజిటెడ్ ఆఫిసర్ శ్రీ. పెరుమాళ్ళ ప్రదీప్ కుమార్
World Powerlifting Champion :రెండు బంగారు పతకాలు కైవసం చేసుకుని వరల్డ్ పవర్ లిఫ్టింగ్ చాంపియన్ గా ప్రదీప్ కుమార్
రాచకొండ కమిషనరేట్ లో అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్ హోదాలో విధులు నిర్వహించి రిటైర్ అయిన శ్రీ పెరుమాళ్ల ప్రదీప్ కుమార్ గారు, వరల్డ్ పవర్ లిఫ్టింగ్ పొటీలలో పాల్గొని ప్రపంచ స్థాయిలో రెండు బంగారు పథకాలను సాధించారు.
గత నెలలో రష్యా దేశము నందు వరల్డ్ పవర్ లిఫ్టింగ్ ఫెడరేషణ్ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రపంచ స్థాయి పవర్ లిఫ్టింగ్ కంపిటీషన్స్ లోని మాస్టర్స్ 75 కిలోల వెయిట్ క్యాటగిరీ లో ప్రథమ స్తానం తో పాటు రెండు గోల్డ్ మెడల్స్ కైవసం చూసుకుని తెలంగాణ రాష్త్ర ఖ్యాతిని ప్రపంచ స్థాయి లో మరోమారు విస్తరింపచేసారు.
ఈ సందర్బంగా తెలంగాణ రాష్ట్రా స్పోర్ట్స్ అథారిటీ వైస్ చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ అయిన శ్రీమతి. ఏ . సోనిబాల దేవి (I.F.S) గారు ప్రదీప్ కుమార్ ను అభినందించటం జరిగింది, అనంతరం వారు మాట్లాడుతూ భవిష్యత్తులో ఇలాంటి విజయాలు మరన్ని సాధించి తెలంగాణ రాష్ట్ర పెరు ప్రతిష్టలను ప్రపంచ స్థాయి లో నిలపాలని ఆకాంక్షించారు.