For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

Ustaad Bhagat Singh : గాజు ప‌గ‌లే కొద్దీ ప‌దునెక్కుద్ది.. గ్లాసంటే సైజు కాదు.. సైన్యం.. కనిపించని సైన్యం : ఉస్తాద్ భగత్ సింగ్

07:26 PM Mar 19, 2024 IST | Sowmya
UpdateAt: 07:26 PM Mar 19, 2024 IST
ustaad bhagat singh   గాజు ప‌గ‌లే కొద్దీ ప‌దునెక్కుద్ది   గ్లాసంటే సైజు కాదు   సైన్యం   కనిపించని సైన్యం   ఉస్తాద్ భగత్ సింగ్
Advertisement

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్, దేవి శ్రీ ప్రసాద్, మైత్రీ మూవీ మేకర్స్ 'ఉస్తాద్ భగత్ సింగ్'- మాస్సీ భగత్స్ బ్లేజ్ విడుదల

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పవర్ ప్యాక్డ్ మ్యాసివ్ యాక్షనర్ ఉస్తాద్ భగత్ సింగ్. హరీష్ శంకర్ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్‌తో ఈ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తోంది. భగత్స్ బ్లేజ్ టీజర్‌ ను విడుదల చేయడం ద్వారా మేకర్స్ ప్లజెంట్ సర్ ప్రైజ్ ఇచ్చారు. ఉస్తాద్ భగత్ సింగ్ తన రేంజ్ ని విమర్శించే వారికి ఘాటుగా సమాధానం ఇస్తాడు. “ గాజు ప‌గ‌లే కొద్దీ ప‌దునెక్కుద్ది.. గ్లాసంటే సైజు కాదు.. సైన్యం.. కనిపించని సైన్యం ”అని కౌంటర్ ఇవ్వడం గూస్ బంప్స్ తెప్పించింది.

Advertisement

హరీష్ శంకర్ పవన్ కళ్యాణ్ పాత్రను స్టైలిష్,  పవర్-ప్యాక్డ్ అవతార్‌లో ప్రజెంట్ చేశారు. పంచ్ డైలాగులు పవర్ ఫుల్ గా వున్నాయి.  టీజర్‌లో పవన్ కళ్యాణ్ గన్స్ ఫైర్ చేయడం మెస్మరైజింగ్ గా వుంది.  ఈ వీడియోలో హీరోయిన్ శ్రీలీల కూడా కనిపించారు. అయనంక బోస్ సినిమాటోగ్రఫీ, నిర్మాణ విలువలు అత్యున్నతంగా ఉన్నాయి. యాక్షన్ సీక్వెన్స్ అద్భుతంగా వున్నాయి. రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్ ఆకట్టుకునే బ్యాగ్ గ్రౌండ్ స్కోర్‌తో పవన్ కళ్యాణ్ క్యారెక్టర్‌ని మరింతగా ఎలివేట్ చేశారు.

నవీన్ యెర్నేని, వై రవిశంకర్ ఈ చిత్రానికి నిర్మాతలు. ఛోటా కె ప్రసాద్ ఎడిటింగ్ చేస్తున్న ఈ సినిమా స్టంట్స్ ని రామ్-లక్ష్మణ్ ద్వయం సమకూరుస్తున్నారు. తారాగణం : పవన్ కళ్యాణ్, శ్రీలీల, అశుతోష్ రానా, నవాబ్ షా, KGF ఫేమ్ అవినాష్, గౌతమి, నర్రా శ్రీను, నాగ మహేష్, టెంపర్ వంశీ.

సాంకేతిక విభాగం :
రచన & దర్శకత్వం. హరీష్ శంకర్ ఎస్
నిర్మాతలు: నవీన్ యెర్నేని, వై.రవి శంకర్
బ్యానర్: మైత్రీ మూవీ మేకర్స్
CEO: చెర్రీ
స్క్రీన్ ప్లే: కె దశరధ్
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
DOP: అయనంక బోస్
ఎడిటర్: ఛోటా కె ప్రసాద్
అడిషినల్ రైటర్: సి. చంద్రమోహన్
ప్రొడక్షన్ డిజైనర్: ఆనంద్ సాయి
ఫైట్స్: రామ్ - లక్ష్మణ్
ఎగ్జిక్యూటివ్ నిర్మాతలు: చంద్రశేఖర్ రావిపాటి, హరీష్ పై
పీఆర్వో: వంశీ-శేఖర్
మార్కెటింగ్: ఫస్ట్ షో

Advertisement
Tags :
Author Image