For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

'ఆరంభం' సినిమాకు పాజిటివ్ మౌత్ టాక్ పెరుగుతోంది : హీరో మోహన్ భగత్

Positive Word of Mouth Incresing for 'Aarambham'
06:47 PM May 11, 2024 IST | Sowmya
Updated At - 06:27 PM Jun 16, 2024 IST
Positive Word of Mouth Incresing for 'Aarambham'
 ఆరంభం  సినిమాకు పాజిటివ్ మౌత్ టాక్ పెరుగుతోంది   హీరో మోహన్ భగత్
Advertisement

మోహన్ భగత్, సుప్రిత సత్యనారాయణ్, భూషణ్ కళ్యాణ్, రవీంద్ర విజయ్ కీలక పాత్రల్లో నటించిన సినిమా "ఆరంభం". ఈ సినిమాను ఏవీటీ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై అభిషేక్ వీటీ నిర్మించారు. అజయ్ నాగ్ వి దర్శకత్వం వహించారు. ఎమోషనల్ థ్రిల్లర్ గా తెరకెక్కిన "ఆరంభం" నిన్న ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సినిమా విడుదలైన అన్ని చోట్ల నుంచి మంచి టాక్ తెచ్చుకుంది. ఈ నేపథ్యంలో ఈ రోజు హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్ లో సినిమా సక్సెస్ మీట్ నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో హీరో మోహన్ భగత్ మాట్లాడుతూ... ఆరంభం మూవీని సపోర్ట్ చేస్తున్న ఆడియెన్స్ కు థ్యాంక్స్. మేము ఈ సినిమా చేసేప్పుడు ఇలాంటివి మలయాళంలో చేసి తెలుగులో డబ్ చేయండి అప్పుడు మన వాళ్లు చూస్తారు. ఇలా నేరుగా తెలుగులో చేస్తే అంతగా రెస్పాన్స్ ఉండదు అన్నారు. కానీ మేము ఈ కథను నమ్మాం. తెలుగు ఆడియెన్స్ ఆదరిస్తారని బిలీవ్ చేశాం. రిలీజ్ రోజున మార్నింగ్, మ్యాట్నీ షోస్ కు భయం వేసింది. కానీ ఈవినింగ్ నుంచి కలెక్షన్స్ పికప్ అయ్యాయి. మీడియా మాకు బాగా సపోర్ట్ చేసింది. రివ్యూస్ ఎంకరేజింగ్ గా వచ్చాయి. అన్నారు. మీరు ఆరంభం మూవీని ఫ్యామిలీతో కలిసి చూడండి ఎంజాయ్ చేస్తారు. అన్నారు.

Advertisement GKSC

Advertisement
Author Image