For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

శాంతి భద్రతల పరిరక్షణే ధ్యేయంగా పని చేయాలి : సీపీ సుధీర్ బాబు ఐపీఎస్

12:28 PM Aug 15, 2024 IST | Sowmya
Updated At - 12:28 PM Aug 15, 2024 IST
శాంతి భద్రతల పరిరక్షణే ధ్యేయంగా పని చేయాలి   సీపీ సుధీర్ బాబు ఐపీఎస్
Advertisement

పిల్లలకు బాల్యం నుండే దేశ స్వాతంత్ర్యం యొక్క విశిష్టత పట్ల అవగాహన కల్పించాలి

రాచకొండ కమిషనరేట్‌, నేరేడ్‌మెట్‌లో 78వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని సీపీ శ్రీ సుధీర్ బాబు ఐపీఎస్‌ గారు జాతీయ జెండాను ఆవిష్కరించి, సిబ్బందికి, ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా సీపీ గారు దేశ స్వాతంత్య్ర విశిష్టతను వివరించి, స్వాతంత్య్ర సమరయోధుల కృషిని అందరికీ గుర్తు చేశారు. స్వాతంత్య్ర సమరయోధుల చెమట, రక్తంతో సాకారమైన స్వతంత్ర దేశంగా చక్కటి పరిపాలనతో అభివృద్ధి దిశలో ముందుకు వెళ్తోందని కమిషనర్ పేర్కొన్నారు. నేటి బాలలే రేపటి పౌరులు అని, పిల్లలకు చిన్న వయసు నుండే దేశ స్వాతంత్ర్యం పట్ల, దాని విశిష్టత పట్ల అవగాహన కల్పించాలని పేర్కొన్నారు.

Advertisement GKSC

సిబ్బందిని ఉద్దేశించి సీపీ గారు మాట్లాడుతూ, పోలీసులు అందరూ కలసికట్టుగా ఒక కుటుంబంలా పని చేయాలని సూచించారు. విజిబుల్ పోలీసింగ్ కు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. సమిష్టి కృషితోనే శాంతి భద్రతల పరిరక్షణ సాధ్యం అవుతుందని పేర్కొన్నారు. ప్రజలకు సత్వర సేవలు అందించడంలో రాచకొండ పోలీసులు చేస్తున్న కృషిని అభినందించి, ప్రజలకు సేవ చేసేందుకు సిబ్బంది పునరంకితం కావాలని సూచించారు. తమ బాధ్యతలు నిర్వర్తిస్తూ స్వాతంత్య్ర సమరయోధులు, పోలీసు అమరవీరుల అమర త్యాగాలను స్మరించుకోవాలని సిబ్బందికి సీపీ సూచించారు.

ఈ వేడుకల్లో రాచకొండ పోలీస్ కమిషనరేట్ సీపీ శ్రీ జి. సుధీర్ బాబు IPS., డీసీపీ అడ్మిన్ ఇందిర, డీసీపీ అడ్మిన్ క్రైం అరవింద్ బాబు మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు.

Advertisement
Author Image