Face Pimples : ఏం చేసినా మొటిమలు తగ్గట్టు లేదా.. నయా పైసా ఖర్చు లేకుండా ఈ చిట్కాలతో 15 రోజుల్లో చెక్..
Pimples Home Remedies : మనలో చాలామంది మొటిమల సమస్యలతో బాధపడుతూ ఉంటారు. ముఖ్యంగా యుక్త వయసులో ఉన్న స్త్రీ పురుషులు ఎక్కువగా ఈ సమస్యలతో బాధపడుతూ ఉంటారు. అయితే చాలామందిలో ఈ సమస్య రావడానికి అనేక కారణాలు ఉన్నాయి కొంతమందిలో హార్మోన్ల సమస్యల కారణంగా వస్తే మరి కొంతమందిలో మాత్రం జిడ్డు చర్మం వాతావరణ కాలుష్యం కారణంగా ఈ మొటిమలు వస్తున్నాయి. అయితే ఇలాంటి సమస్యలతో బాధపడేవారు తరచుగా ఖరీదైన స్కిన్ కేర్ ప్రోడక్ట్లను ఎక్కువగా వినియోగిస్తూ ఉంటారు. వీటిని వినియోగించినప్పటికీ ఎలాంటి ఫలితం పొందలేని వారు కూడా చాలామంది ఉన్నారు. అయితే ఇలాంటి వారికోసం మేము ఈరోజు కొన్ని ఇంటి చిట్కాలను తెలియజేయబోతున్నాం.
తేనె, నిమ్మరసం :
దేవినేని నిమ్మరసంతో తయారుచేసిన ఫేస్ ప్యాక్ మొటిమల నుంచి సులభంగా ఉపశమనం కలిగిస్తుందని సౌందర్య నిబంధనలు చెబుతున్నారు తేనే నిమ్మరసంలో ఉండే గుణాలు ముఖాన్ని అందంగా చేసేందుకు కూడా ఎంతగానో సహాయపడతాయి. అంతేకాకుండా డ్రై స్కిన్ సమస్య నుంచి కూడా సులభంగా ఉపశమనం కలిగిస్తాయి.
కొబ్బరి నూనె :
మొటిమలు నల్లమచ్చల సమస్యలతో బాధపడుతున్న వారు కొబ్బరి నూనెతో కూడా సులభంగా ఉపశమనం పొందవచ్చు. రాత్రి పడుకునే ముందు మొటిమల ప్రభావిత ప్రాంతంలో కొబ్బరి నూనె అప్లై చేసి ఉదయాన్నే శుభ్రం చేసుకుంటే మంచి ఫలితాలు పొందుతారు. అంతేకాకుండా నల్ల మచ్చల సమస్యలు కూడా సులభంగా దూరమవుతాయి.
పసుపు :
పసుపులో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు అధిక మోతాదులో లభిస్తాయి కాబట్టి ఇది కూడా మొటిమల నుంచి సులభంగా ఉపశమనం కలిగిస్తుందని సౌందర్య నిపుణులు చెబుతున్నారు. మొటిమల సమస్యలతో బాధపడుతున్న వారు ప్రతిరోజు ముఖానికి పసుపు అప్లై చేసుకుంటే తొందర్లోనే మంచి ఫలితాలు పొందుతారు.