For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

అత్యంత ఘనంగా పిన్ బధిరుల పాఠశాల 14 సంవత్సరాల వార్షికోత్సవ వేడుకలు: PEOPLE WITH HEARING IMPAIRED NETWORK - PHIN

02:12 PM May 11, 2024 IST | Sowmya
Updated At - 02:12 PM May 11, 2024 IST
అత్యంత ఘనంగా పిన్ బధిరుల పాఠశాల 14 సంవత్సరాల వార్షికోత్సవ వేడుకలు  people with hearing impaired network   phin
Advertisement

ఈ రోజు మలక్ పెట్ లో పిన్ స్వచ్చంద సంస్థ యొక్క 14 సంవత్సరాల వార్షికోత్సవ వేడుకలకు ముఖ్య అతిదిగా సైబరాబాద్ పోలీస్ కమిషనర్ శ్రీ సజ్జనార్ గారు మరియు విశిష్ట అతిదులుగా బేవరేజ్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ దేవి ప్రసాద్ రావు గారు మరియు తెలంగాణా టూరిజం కార్పొరేషన్ చైర్మన్ శ్రీ ఉప్పల శ్రీనివాస్ గుప్తా గారు హాజరయ్యారు.  ఈ కార్యక్రమంలో మాట వినికిడి లోపం గల బాల బాలికలచే నిర్వహించిన సాంసృతిక కార్యక్రమాలు ఓ ఆకట్టుకున్నాయి .కరోన మహమ్మారి గురించి పిల్లలు సిగల భాషలో ప్రదర్శించిన నాటిక చాలా అద్భుతంగా ఆకట్టుకున్నది .

ఈ కార్యక్రములో ఫిన్ స్కూల్ అధ్యక్షురాలు శ్రీమతి జానకి మేడమ్ గారు మాట్లాడుతూ పిన్ సంస్థ సమాజం లో మాటవినికిడి లోపం గల బదిరుల విధ్య వైద్యం ఉపాధి రంగాలలో ఒక రోల్ మోడల్ గా పనిచేస్తున్నది . బదిరుల సైగల బాష అనువాధకులను ముఖ్యమైన పోలీస్ స్టేషన్ లలో ఏర్పాటు చేయవలసిన అవసరము ఉన్నధి అందుకు పోలీస్ డిపార్ట్మెంట్ నుండి మీ వంతు సహాయ సహకారాలు ఇవ్వండి .  బదిరుల కోసం అనుకూల వాతావరణం లో ఈ టెక్నాలజీ ద్వారా సైబర్ నేరాల పట్ల మరియు వివిధ చట్టాల పట్ల ఒకరకమైన గౌరవాన్ని కల్పించవల్సిన అవసరము ఉన్నది .

Advertisement GKSC

పోలీస్ శాఖ నిర్వహించు వివిధ కార్యక్రమాలకు స్వచ్చంధ సేవకులుగా వాలింటర్లు గా పని చేయడానికి పిన స్వచ్చంద సంస్థ ఎల్లప్పుడూ సిద్దంగా ఉన్నది . మీరు అందరూ ఎంతో అమూల్యమైన సమయాన్ని మాకోసం కేటాయించి బధిర పిల్లలకు ప్రేమ ను పంచడానికి వచ్చినందునకు హృదయపూర్వక ధన్యవాదములు అని తెలిపారు .

తెలంగాణ బేవారేజ్ కార్పొరేషన్ ఛైర్మన్ పెద్దలు శ్రీ దేవి ప్రసాద్ రావు గారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము బదిరుల సంక్షేమము కోసం ఎంతో కృషి చేస్తున్నది . మాట వినికిడి లోపం గల పిల్లల కోసం ఈ రోజు అమూల్యమైన సమయాన్ని కేటాయించిన తెలంగాణ యూత్ ఐకాన్ హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ కాపాడుతున్న శ్రీ సజ్జనర్ పోలీస్ కమిషనర్ గారికి ఈ వార్షికోత్సవ సంధర్బంగా హృదయపూర్వక ధన్యవాధములు తెలిపారు.

Advertisement
Author Image