For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

peanut chikki:పల్లిపట్టి తినడం ఆరోగ్యానికి ఇంత మంచిదా .. అయితే తప్పకుండా తెలుసుకోవాలి అండి ......

02:20 PM Jul 04, 2023 IST | Sowmya
Updated At - 02:20 PM Jul 04, 2023 IST
peanut chikki పల్లిపట్టి  తినడం ఆరోగ్యానికి ఇంత మంచిదా    అయితే తప్పకుండా తెలుసుకోవాలి అండి
Advertisement

peanut chikki:పల్లీలు.. వీటిని చాలామంది పేదవాడి బాదం అని పిలుస్తారు. వేరుశనగలు ఆరోగ్యానికి ఎంతగానో మేలు చేస్తాయి. పల్లీలు, బెల్లంతో కలిపి పల్లిపట్టి తయారు చేస్తారు. వీటిని చాలామంది ఇష్టంగా తింటారు. వీటిని నిజానికి సాంప్రదాయ స్వీట్ అని చెప్పొచ్చు. పల్లిపట్టీల్లో విటమిన్స్, ప్రోటీన్స్ శరీరానికి చాలా మేలు చేస్తాయి. బెల్లంలోని ఐరన్ ఎక్కువగా ఉంటుంది. అంతేకాదు, ఈ రుచికరమైన వంటకం జలుబు సంబంధిత సమస్యల నుంచి కాపాడుతుందంటే నమ్మాల్సిందే.

గుండె ఆరోగ్యం..
ఈ రుచికరమైన హెల్దీ వేరుశనగలు మీ కొలెస్ట్రాల్ స్థాయిలను బ్యాలెన్స్ చేయడమే కాకుండా మీ గుండెని కాపాడుతుంది. ఇందులో అసంతృప్త కొవ్వు ఆమ్లాలు ముఖ్యంగా ఒలీక్ ఆమ్లం పుష్కలంగా ఉంటుంది. ఈ వేరుశనగలు రక్తంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గిస్తాయని కొన్ని పరిశోధనలు నిరూపించాయి.
ఇది ఆరోగ్యకరమైన రక్త లిపిడ్ ప్రొఫైల్‌కి సపోర్ట్ చేయడంతో పాటు స్ట్రోక్ సహా అథెరోస్క్లెరోసిస్‌ని నిరోధించడంలో సహాయపడుతుంది.

Advertisement GKSC

నాడీ వ్యాధులతో..
వేరుశనగలు, బెల్లంతో తయారైన ఈ పల్లిపట్టిల్లో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా నరాల సంబంధిత వ్యాధులకు వ్యతిరేకంగా పోరాడతాయి. పరిశోధన ప్రకారం, ఈ చిన్న చిక్‌పీ రక్తం గడ్డకట్టడాన్ని బలహీనపరుస్తుందని, చిత్తవైకల్యం వంటి నాడీ సంబంధిత వ్యాధులకు చికిత్స చేస్తుందని నిరూపించబడింది.

ఆరోగ్యకరమైన ఎదుగుదలకు..
పల్లీల్లో అమైనో ఆమ్లాల యొక్క అద్భుతమైన మూలం. ఇందులోని అమైనో యాసిడ్స్ హార్మోన్లని పెంచి, ఇమ్యూనిటీని పెంచుతాయి. పిల్లలు కూడా డౌట్ లేకుండా పల్లీలను క్రంచీ స్నాక్‌గా ఎంజాయ్ చేయొచ్చు. అలాగే,   ఇధి తింటే కాసేపటికి కడుపు నిండిన ఫీలింగ్ వస్తుంది.

Advertisement
Author Image