సినిమాలు వేరు - రాజకీయాలు వేరు ? పవన్ కళ్యాణ్ గారు మీరు తెలుసుకోవాలి : Journalist Audi
ప్రత్యేక కధనం : Journalist Audi
ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ హావభావ విన్యాసాలంటూ పెద్దగా ఏమీ లేవు.. మొత్తం కలిపి ఒకటే ఎక్స్ ప్రెషన్, అది కూడా కసిగా క్రోధంగా చూడ్డం.. అప్పుడప్పుడూ అక్కడక్కడా రిలాక్స్ గా కనిపించినా..మిగిలిన ఫ్రేములన్నింటిలోనూ..దాదాపు ఒకలాగానే కనిపించారు పవన్ కళ్యాణ్..ఇక్కడ పవన్ గురించి ఒక మాట చెప్పుకోవాలి.. ఆయన అత్తారింటికి దారేది సినిమాలో కనిపించినట్టు ఆ తర్వాతి సినిమాల్లో కనిపించడం లేదు.. కారణం.. ఆ మూడు చేసే ఉత్సాహం మొత్తం కోల్పోయిన వాడిలా తయారయ్యాడాయన.. ఇపుడాయన మూడ్ మొత్తం ఒకటే..అవమానభారం.. ఆ అవమాన భారానికి సమాధానంగా తన సినిమాలు అందులోని డైలాగులు ఉండేలా చూసుకుంటున్నారని చెప్పక తప్పదు.. ఒకప్పటి పవన్ కళ్యాణ్ ని ఇక చూడలేమేమో అనిపిస్తోంది.. ఆయన సినిమాలు రాజకీయాలను తన మనసులోంచి వేరు చేయలేని దుస్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు.. అదేదో అంటారే.. వాళ్లలో వీళ్లను చూసుకుని చెలరేగిపో అన్నట్టుగా మారిందాయన పరిస్థితి..
రానా చేసిన డానియల్ శేఖర్ పాత్రలో ఆయన తన రాజకీయ ప్రత్యర్ధిని ఊహించుకుని.. హావభావ విన్యాసాలు సెట్ చేసుకుని.. కనిపించారు..
డైలాగులు కూడా అంతే శుక్రవారం డైలాగు ఒకటి.. అదే సమయంలో నువ్వు నన్ను ఎంత తొక్కినా ఎలాగోలా పొడుచుకొస్తా.. అన్నట్టుగా ఆయన చెప్పిన డైలాగుల్లో ఇదే అర్ధం ధ్వనిస్తోంది.. ఒక రకంగా చెబితే ఇదొక వృధా ప్రయాస..
పవన్ కళ్యాణ్ ప్రస్తుతం చేయాల్సింది.. మొదట సినిమాలు వేరు రాజకీయాలు వేరు అనే ఒకానొక పార్టీషియన్ మెంటల్ కండీషన్ ను తన మైండ్ లో బలంగా ఫిక్సవ్వాలి.. ఆ ఈజ్ కనిపించాలి.. ఆ మూడ్ ఛేంజింగ్ కనిపించాలి.. ఆయన ఇదే ఫ్లోలో పోతే..అజ్ఞాతవాసి, వకీల్ సాబ, భీమ్లా నాయక్ వంటి సీరియస్ మూడ్ తో ఉన్న సినిమాలు తప్ప మరే సినిమాలూ చేయలేరు.. అంటే అత్తారింటికి దారేదిలాంటి నవరస భరిత చిత్రాలు ఆయన్నుంచి ఆశించడం కుదరదు.. సినిమాల ద్వారా జనాన్ని రాజకీయంగానూ మైమరిపించడం.. డైలాగుల ద్వారా ప్రత్యర్ధులను అదరగొట్టడం పాత ముచ్చట.. ఇవన్నీ రజనీకాంత్ పాతికేళ్ల క్రితమే చేసి.. ఏం పీకలేక సైడ్ అయిపోయారు.. ఇపుడాయన రాజకీయాలకు బొత్తిగా తెరమరుగై పోయారు.. ఇక నుంచి ఆయన యాక్టివ్ పాలిటిక్స్ లోకి వస్తాడనుకోవడం కల్ల.. సరిగ్గా అలాగే పవన్ కళ్యాన్ తెర మీద నుంచి రాజకీయాలను తొలగించి.. అత్యంత క్లియర్ గా తనదైన శైలిలో అన్ని రసాలను పండించే సినిమాలు చేయడం ఉత్తమం.. పవన్ కళ్యాణ్ తన బేల తనం మొత్తం రాజకీయ వేదికల మీద బయట పెట్టేస్తున్నారు కాబట్టి.. ఆయనెంత మొత్తుకున్నా ఒక సీరియస్ పొలిటీషియన్ గా ఆయన్ను అంచనా వేయడం కష్టం.. కనుక ఎక్కడో ఎవరో ఇచ్చే రూట్ మ్యాప్ ల మీద ఆధార పడ్డం.. వంటి వాటితో రాజకీయాల్లో నెగ్గుకు రావడం అనేది అసాధ్యం.. ఇప్పటి వరకూ ఇలాంటివి చేసినా అదెంతో పకబ్డందీగా చేసుకుంటారు తప్పించి.. ఇలా బాహట విన్యాసాలను ఎవ్వరూ చేసి ఉండరు.. పవన్ ఈ కలగాపులగం మానసిక స్థితి నుంచి మొదట బయట పడాలి..ఇక్కడ దర్శక రచయితలు తయారు చేసే కథలను ఎంపిక చేసుకోవడంతో ఆయన తన ఆత్మగౌరవ పోరాటం మొదలు పెట్టాలి.. ఇక్కడ తెలుగు తెర మీద సరిగా కథను బ్రేక్ చేయడం చేతగాకుండా.. ఆత్మగౌరవ పోరాటం అనడం వింతగానూ విడ్డూరంగానూ అనిపిస్తోంది.. హీరోయిజం తెర మీదే కాదు తెర బయట కూడా కనిపించాలి.. దాన్ని మెయిన్ టైన్ చేయడంలో పవన్ కళ్యాణ్ ఘోర వైఫల్యం కనబరుస్తున్నారు.. అందుకే ఆయన పొలిటికల్ జోకర్ గా మిగిలిపోతున్నారు.. పవన్ సార్ ఫస్ట్ మీరు అచ్చమైన తెలుగు సినిమాలను ఎంపిక చేయండి సార్..
తర్వాత సొంతంగా రూట్ మ్యాప్ తయారు చేసుకోండి సార్.. అది నిజమైన హీరోయిజం అది నిజమైన రాజకీయ కథానాయకత్వం..
అంతే కానీ అక్కడా ఇక్కడా అరవు సరుకుతో గెలవాలని చూసుకోకండి.. తెర మీద కానీ తెర బయట కానీ.. దెబ్బడిపోతారు..
మీ మంచి కోరి చెబుతున్నా,. ఇప్పటికింతే సంగతులు చిత్తగించవలయును. ప్రత్యేక కధనం : Journalist Audi