For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

సెకండ్ షెడ్యూల్ షూటింగ్ కు సిద్ధమవుతున్న 'పేషన్' మూవీ

12:10 PM Jun 02, 2024 IST | Sowmya
Updated At - 12:10 PM Jun 02, 2024 IST
సెకండ్ షెడ్యూల్ షూటింగ్ కు సిద్ధమవుతున్న  పేషన్  మూవీ
Advertisement

సుధీష్ వెంకట్, అంకిత సాహ, శ్రేయాసి షా హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా "పేషన్". ఫ్యాషన్ డిజైనింగ్ కాలేజ్ నేపథ్యంగా సాగే ప్రేమ కథా చిత్రమిది. ఈ సినిమాను బిఎల్ ఎన్ సినిమా, రెడ్ యాంట్ క్రియేషన్స్ బ్యానర్స్ పై డాక్టర్ అరుణ్ కుమార్ మొండితోక, నరసింహ యేలె, ఉమేష్ చిక్కు నిర్మిస్తున్నారు. "పేషన్" చిత్రంతో ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ అరవింద్ జోషువా దర్శకుడిగా తెలుగు తెరకు పరిచయమవుతున్నారు. ఆయన స్టార్ డైరెక్టర్స్ శేఖర్ కమ్ముల, మదన్, మోహన కృష్ణ ఇంద్రగంటి వంటి వారి వద్ద పనిచేశారు. ప్రస్తుతం "పేషన్" మూవీ రెగ్యులర్ చిత్రీకరణలో ఉంది. హైదరాబాద్ లోని కొన్ని పాషన్ కాలేజీలలో 20 రోజుల పాటు తొలి షెడ్యూల్ చిత్రీకరణ జరిపారు. రెండో షెడ్యూల్ కు మూవీ టీమ్ రెడీ అవుతోంది.

ఈ సందర్భంగా దర్శకుడు అరవింద్ జోషువా మాట్లాడుతూ... హైదరాబాద్ లోని కొన్ని ఫ్యాషన్ కాలేజీలలో 20 రోజులపాటు సినిమాలోని కొన్ని ప్రధాన సన్నివేశాలని చిత్రించాం. ఇప్పుడు రెండవ షెడ్యూల్ కి సిధ్ధమవుతున్నాం. ఫ్యాషన్ ప్రపంచానికి సంబంధించి ఇంతకుముందు ఎపుడూ రానటువంటి ఒక సమగ్రమైన, సాంకేతిక పరిజ్ఞానంతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాం. ఈ తరహాలో వస్తున్న మొట్టమొదటి భారతీయ సినిమా "పేషన్" అని చెప్పుకోవచ్చు. ప్రేమ, ఆకర్షణకి సంబంధించి యువతలో ఉన్న అనేకమైన ప్రశ్నలకి ఈ సినిమా సమాధానం అవుతుంది. అన్నారు.

Advertisement GKSC

నటీనటులు : సుధీష్ వెంకట్, అంకిత సాహ, శ్రేయాసి షా తదితరులు

టెక్నికల్ టీమ్ :

ఆర్ట్ డైరెక్టర్ - గాంధీ నడికుడికర్
సినిమాటోగ్రఫీ - సురేష్ నటరాజన్
ఎడిటర్ -నాగేశ్వరర్ రెడ్డి
పీఆర్ఓ - జీఎస్ కే మీడియా (సురేష్ - శ్రీనివాస్)
బ్యానర్ - బిఎల్ ఎన్ సినిమా, రెడ్ యాంట్ క్రియేషన్స్
నిర్మాతలు - డాక్టర్ అరుణ్ కుమార్ మొండితోక, నరసింహ యేలె, ఉమేష్ చిక్కు
రచన, దర్శకత్వం - అరవింద్ జోషువా

Advertisement
Author Image