For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

Parking Movie Review : అది పార్కింగ్ కాదు... అర‌వోళ్ల బార్కింగ్... Review by Journalist Audi

12:13 AM Jan 03, 2024 IST | Sowmya
UpdateAt: 12:13 AM Jan 03, 2024 IST
parking movie review   అది పార్కింగ్ కాదు    అర‌వోళ్ల బార్కింగ్    review by journalist audi
Advertisement

సినిమా రివ్యూ by జర్నలిస్ట్ ఆది : పార్కింగ్ అనే దిక్కుమాలిన అథ‌మాధ‌మ ప‌ర‌మ వ‌రెస్ట్ మూవీ ఒక‌టి చూశా. ఈ సినిమా ఎలాంటిదంటే ఇది స‌గ‌టు త‌మిళ మాన‌సిక- శారీర‌క- సామాజిక- ఆర్ధిక- స్వ‌రూప స్వ‌భావాల‌ను ఒడిసి ప‌డుతుంద‌ని అంటే అందులో అబ‌ద్ధం లేదేమో. ఈ చిత్ర ద‌ర్శ‌కుడు తానొక యునిక్ పాయింట్ చెబుతున్నాన్న ఆతృత‌కు లోబ‌డి.. ఈ సినిమా తీసిన‌ట్టున్నాడు. కానీ ఈ సినిమా ద్వారా అత‌డు త‌మిళ మైండ్ సెట్ మీద‌ చాలా పెద్ద స్టేట్మెంట్ ఇచ్చాడ‌నే చెప్పాలి.

త‌మిళులు స‌రిగ్గా ఇలాగే ఉంటారు. వారి నైస‌ర్గిక స్వ‌భావం అలాంటిదో.. లేక ఆ అర‌వ‌- బ్రీడే అలాంటిదో తెలీదు కానీ.. వాళ్లు మాత్రం ప‌దిలో తొమ్మిదింట‌.. స‌రిగ్గా ఇలాంటి త‌గువులాట‌కు దారి తీసే ధోర‌ణిలోనే జీవిస్తుంటారు. వాళ్ల‌కు త‌గువు చాలా చాలా ప్రీతి పాత్ర‌మైన వ్య‌వ‌హారం.. ప్ర‌తిదాన్లోంచి తాము ఇన్ వాల్వ్ అయిపోతుంటారు.. ప‌ర్స‌న‌ల్ గా తీసేసుకుంటారు. ఆ సమ‌స్య త‌న‌ది కాకున్నా స‌రే.. ఇన్ వాల్వ్ అయి పోయి.. జ‌డ్జిమెంట్ ఇచ్చేస్తుంటారు. అక్క‌డ టాప్ టు బాటం ప్ర‌తి ఒక్క‌డూ ఒక్కో సుప్రీం కోర్టు జ‌డ్జీలా వ్య‌వ‌హ‌రిస్తాడంటే అతిశ‌యం లేదేమో.

Advertisement GKSC

నాకు తెలిసి త‌మిళ‌నాట చాలానే దృశ్యాలు చూశాన్నేను. మొన్నంటే మొన్న‌ మున్నార్ వెళ్లిన‌పుడు.. అక్క‌డొక బోటింగ్ ఏరియా. ఆ ప్రాంతంలో గ‌వ‌ర్న‌మెంట్ స్టాఫ్ గా ఉన్నాడొక త‌మిళుడు. వాడికో 40- 45 ఏళ్ల వ‌య‌సుంటుంది. నేను ఇక్క‌డి బోటింగ్ ఎక్స్ పీరియ‌న్స్ ని ప‌రిచ‌యం చేయ‌డానికి ఆ వివ‌రాల‌ను అంద‌జేయ‌డానికి వీడియో చేస్తున్నా. ఆ వీడియో ద్వారా.. ఆ బోటింగ్ ఎంత ఖ‌ర్చ‌వుతుందో... చెప్పేయత్నం నాది. ఇదేదీ అర్ధం చేసుకోలేని ఆ మూర్ఖుడు.. నాతో గొడ‌వ‌కు దిగాడు. అస‌లే ఆ ఫేసు మాడిపోయి ఉంది. ఇంకాస్త దాన్ని మాడ‌బెట్టి మ‌రీ నాతో వాగ్యుద్ధం చేశాడు. అరే రాష్ట్రాంత‌రం వ‌చ్చినా కూడా మీరు మార‌రా రా.. అందుకేరా మీకు అన్నేసి అద్భుత‌మైన గుడులు గోపురాలున్నా.. మీకంటూ ఒక టూరిజం లేకుండా పోయింది.(తిరుమ‌ల‌\శ‌బ‌రిమ‌ల స్థాయి) అనుకోవ‌డం మిన‌హా నేనేం చేయ‌లేక పోయా.

ఇక పార్కింగ్ అనే ఈ సినిమా విష‌యానికి వ‌స్తే.. ఒక ఇండివిడ్యువ‌ల్ హౌస్ లో ఒక ఓల్డ్ టెనెంట్ ఒక యంగ్ టెనెంట్. ఇద్ద‌రి మ‌ధ్య వ‌య‌సు తేడా సుమారు 35 ఏళ్ల వ‌ర‌కూ ఉంటుంది. ఈ సినిమాలో ఆ పాయింట్ ప్ర‌స్తావిస్తూనే ద‌ర్శ‌కుడు.. వారి మ‌ధ్య కొట్టుకు చ‌చ్చేంత త‌గువులాట‌ను ఎస్టాబ్లిష్ చేశాడు. దీన్నొక సినిమాగా చూస్తే ఓకే. ఆ మాత్రం స్ట్రాంగ్ కంటెంట్.. ఉండాల్సిందే. కాద‌న‌డం లేదుగానీ.. దీన్నే మ‌నం నిజ జీవితానికి అప్లై చేసుకుంటే.. మాత్రం చాలా చాలా ఘోరంగా క‌నిపిస్తుంది. ఇలాంటి ఘ‌ట‌న‌లు త‌ర‌చూ న‌మోదు అవుతూనే ఉంటాయి తమిళ‌నాట‌.

స‌రిగ్గా ఇలాగే నాకూ ఒక అనుభ‌వం ఎదురైంది. రోడ్డు మీద పెట్టాన‌ని.. మా ఆఫీస్ ఓన‌రు.. నా బైక్ దాచేశాడు. దాన్లో విలువైన వ‌స్తువులు కూడా ఉన్నాయి. కానీ ఇవేవీ లెక్క చేయ‌ని వాడు.. త‌న‌ అహంకార‌మంతా చూపించాడు. నేను పోలీస్టేష‌న్ వెళ్లొచ్చు. కానీ నా ఉద్యోగం, నా కెరీర్, ఆఖ‌రున నా లైఫ్ వీడికి గుణ‌పాఠం చెప్ప‌డానికి కాదు. వీడి ముందు నేనేంటి? నా ప‌వ‌ర్ ఏంట‌ని నిరూపించ‌డానికి కాదు క‌దా? అన్న ఒక్క మాట నా మదిలో మెద‌ల‌డంతో నేనా స‌మ‌స్య‌ను చాలా చాలా సులువుగా ముగించేశాను. బేసిగ్గా మ‌నిషి త‌న గ‌మ్యం- త‌న తీరం- అర్ధం చేసుకుంటే మిగిలిన‌దంతా అర్ధ‌మై పోతుంది. ఒక వ్య‌క్తి చాలా చాలా త‌ప్పొప్పులు చేస్తుంటాడు. కొండొకచో అప్పుల పాలు అవుతుంటాడు. కానీ, ఆ ప‌ర్ప‌స్ చాలా చాలా మంచిదై ఉండాలి.

ఈ సినిమాలో చూస్తే చిన్న విష‌యానికి ఇంత పెద్ద ఎత్తున గొడ‌వ ప‌డాల్నా అనిపిస్తుంది. బేసిగ్గా స్టోరీ ప్ర‌కారం చూస్తే హీరో హ‌రీష్ క‌ల్యాణ్‌.. త‌న గ‌ర్భ‌వ‌తి భార్య కోసం కారు కొన‌డం. దాన్ని ఆ ఇంటి ఇరుకైన పార్కింగ్ ఆవ‌ర‌ణ‌లో పార్క్ చేయ‌డం నుంచి క‌థ‌నం మ‌లుపు తిరుగుతుంది. ప‌దేళ్లుగా ఇదే ఇంట్లో ఉండే భాస్క‌ర‌న్ అనే ఈ ప్ర‌భుత్వ ఉద్యోగి.. మొద‌ట చాలా చాలా సానుకూలంగా స్పందించినా.. త‌ర్వాత త‌ర్వాత ఇద్ద‌రి మ‌ధ్య ఒక కారు పార్కింగ్ తెచ్చిన తంటా పీక్ స్టేజీకీ చేరిపోతుంది. ఒక కంఫ‌ర్ట్ కోసం ఎన్నేసి అష్ట‌క‌ష్టాలు ప‌డాల్రా నాయ‌నా.. అన్న‌ట్టుగా సాగుతుందీ క‌థ‌నం. ఆ పోటా పోటీ చూస్తే పిచ్చెక్కిపోతుంది.. ఒక పిల్లాడితో ఈ వృద్ధుడికి ఇంత పోటీ ఏంట్రాబాబూ! అనిపిస్తుంది. అంటే ఒక త‌మిళుడికి ఇంత ఇగో ప్రాబ్లం ఉంటుందా? అన్న‌ట్టు సాగుతుందీ క‌థ‌న ప్ర‌యాణం.

అర‌వ‌గోల‌- చింత గుగ్గిళ్లు అన్న సామెత వినే ఉంటాం. మేం ఇదే మున్నార్ లో ప్ర‌యివేటు ప్రాప‌ర్టీ అనే అంశం ప్ర‌స్తావిస్తున్న‌పుడు.. నాతో మా వాడు ఇదే అన్నాడు. అర‌వోళ్ల‌తో ప‌డ‌లేం లెండి సార్. అని. అరే బాబూ అర‌వోళ్లే ఇలా ఉంటారా? అని అంటారు కావ‌చ్చు. కానీ వీళ్ల మీదున్న బ్యాడ్ ఇంప్రెష‌న్ మాత్రం చాలా పెద్ద‌గానే ఉంటుంది. వీళ్ల‌ద‌దో స్టీరియో టైపు. ఇగో బ‌లుపు వాపు.. అన్నీ. అయిన దానికీ కాని దానికీ కొట్లాడుకుంటారన్న పేరు ఇప్ప‌టిది కాదు. కొంద‌రు ఇదే చిత్రాన్ని అయ్య‌ప్ప‌న్- కౌశిక‌న్ అనే మ‌ల‌యాళ సినిమాతో పోలుస్తారు(తెలుగులో భీమ్లా నాయ‌క్) కానీ.. అందులోని వ్య‌క్తులు, వారి ప‌ర‌ప‌తులు వేరు వేరు. ఒక‌రిది పోలీస్ ప‌వ‌ర్- మ‌రొక‌రిది రాజ‌కీయ ప‌లుకుబ‌డి.

ఇదే పార్కింగ్ అనే మూవీలో రెండు ప్ర‌ధాన పాత్ర‌లు వ‌య‌సు మిన‌హా.. దాదాపు ఒకేలాంటి సామాజిక హోదా. కాకుంటే ఇత‌డొక ఐటీ ఉద్యోగి. అత‌డొక గ‌వ‌ర్న‌మెంట్ ఎంప్లాయి. ఒక‌రు త‌న కూతుర్ని అడ్డు పెట్టి.. త‌న ప్ర‌త్య‌ర్ధిపై కేసు న‌మోదు చేస్తే.. మ‌రొక‌రు అత‌డు లంచ‌గొండి అని ప్రూవ్ చేసి.. ఉద్యోగం ఊడేలా చేస్తాడు. అంత అవ‌స‌ర‌ముందా? అనిపిస్తుంది.. ఈ సినిమా చూసే కొద్దీ.

సామాన్యుడు ఇంత కుట్ర- కుతంత్రంతో ఆలోచించ‌డం పెద్ద యూజ్ ఫుల్ కాదేమో అనిపిస్తుంది. ఎందుకంటే మ‌న‌కంటూ ఒక లైఫ్. దానికంటూ ఒక టార్గెట్ ఉంటుంది. దాన్ని రీచ్ అవ‌డం కోసం ఏదైనా చేయొచ్చు. ఇలాగే కేసులు గ‌ట్రా ఎదుర్కోవ‌చ్చు. కానీ ఇలా అన‌వ‌స‌ర‌మైన విష‌యాల‌కు ఓవ‌ర్ ఎమోష‌నల్ కావ‌డం ఏమంత స‌రైన‌ది కాదేమో అనిపించింది ఈ సినిమా చూస్తున్నంత సేపు. అలాగ‌ని సినిమాలో గ్రిప్ లేద‌ని కాదు. చూడ‌బిలిటి చాలానే ఉంది. కాద‌న‌డం లేదు కానీ.. అన్నెస‌స‌రీ క‌దా? ఈ గొడ‌వంతా అనిపించింది.

ఆ మాట‌కొస్తే మా అపార్ట్ మెంట్లో వాచ్ మెన్ కి.. నేన‌న్నా, నా వ్య‌వ‌హార‌మ‌న్నా చాలా చాలా చిన్న చూపు. కార‌ణం వాడు అడిగిన‌పుడు ఒక సారి నేను 500 ఇవ్వ‌లేదు. అప్ప‌టి నుంచీ వాడు నాపై క‌క్ష క‌ట్టాడు. దీంతో నా బండి ఇంచి తేడా పెట్టినా.. వాడొచ్చి త‌లుపు త‌ట్టేస్తాడు. నేనెంతో ఓపిగ్గా ఆ బండి స‌రిదిద్దుతాను.
కార‌ణం.. వాడు నా ప్ర‌యారిటీ కాదు. దానికి తోడు వాడికీ నాకూ ఉన్న గొడ‌వ గురించి నాకు చాలా స్ప‌ష్టంగానే తెలుసు. ఒక వేళ నేను వాడు అడిగినంతా ఇచ్చేస్తే... ఆ డ‌బ్బు తీసుకెళ్లి తాగేస్తాడు. వాడి భార్య ప్ర‌తి ఒక్క‌రికీ ఇదే చెబుతుంది. మా ఆయ‌న‌కు డ‌బ్బు ఇచ్చి చెడగొట్ట‌కండీ ప్లీజ్ అని. దాన్ని అర్ధం చేసుకున్న నేను.. వాడు న‌న్ను ఎంత రెచ్చ‌గొట్టినా రెచ్చిపోను. ఇలాంటివెన్నో గుర్తొచ్చాయి నాకు.

అయినా సినిమా అన్నాక అలాగే ఉంటుందండీ.. ఆ మాత్రం దానికి మీరింత ఉపోద్ఘాతం ఇవ్వాల్నా? అని అంటారేమో. కానీ ఈ చిత్ర ద‌ర్శ‌కుడు రామ్ కుమార్ త‌న‌కు తెలీకుండా తాను తీసిన ఈ చిత్రం ద్వారా త‌మిళ ప్ర‌జ‌ల స‌హ‌జ సిద్ధ‌మైన మాన‌సిక ప‌రిస్థితి ని ఎస్టాబ్లిష్ చేశాడేమో అనిపించింది. అందుకే ఇలా రాయాల‌నిపించింది.

ద‌ట్సాల్ ఫ‌ర్ నౌ! 

నో ట్ : ఇందు వ‌ల‌న తెలిసిన నీతి ఏమ‌న‌గా.. అన‌వ‌స‌ర విష‌యాల‌కు వెళ్లి.. ప్రాణ‌హాని కొని తెచ్చుకోవ‌ద్ద‌ని. ఈ విష‌యం మీరెపుడైనా లేని పోని గొడ‌వ‌ల‌కు దిగుతున్న‌పుడు ఒక‌సారి గుర్తు చేసుకుంటే.. అంతా మంచే జ‌రుగుతుంద‌ని ఆశిస్తూ సెల‌వు.

సినిమా రివ్యూ by జర్నలిస్ట్ ఆది

Advertisement
Tags :
Author Image