Prabhas Health Condition : ప్రభాస్ ఆరోగ్యం బాగా లేదా ? అందుకే బయటకు రావడం లేదా..?
Prabhas Health Problems: సలార్ చిత్రం ఘన విజయంతో ప్రభాస్ మళ్లీ ఒక్కసారిగా నేషనల్ హీరో అయ్యారు.. అంతా బాగానే ఉంది..కానీ ఏడీ ప్రభాస్.. ఎక్కడా కనిపించడం లేదు ఎందుకు.?? ఇంత పెద్ద సక్సెస్ సాధిస్తే కనీసం అభిమానులను పలకరించాలి కదా.. కానీ అలా జరగడం లేదు ఎందుకు.?? ఏమై పోయారు..? అని ఆరా తీస్తే సంచలన విషయాలు బయటకు వచ్చాయి.
ప్రభాస్ చాలా కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నట్లు ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తూనే ఉన్నాయి. వాటికి కొనసాగింపుగా మరో వార్త బయటకు పొక్కింది.. ప్రభాస్ కు సెప్టెంబర్ 9వ తేదీన ఇటలీలో నడుముకు చాలా క్రిటికల్ సర్జరీ జరిగినట్లు తెలుస్తోంది.. ఇది మేజర్ ఆపరేషన్ అని సమాచారం.. ఈ ఆపరేషన్ సక్సెస్ అవడానికి 50 50 ఛాన్సెస్ మాత్రమే ఉన్నాయట.. మరి ఇంత రిస్క్ చేసిన ప్రభాస్ ఈ ఆపరేషన్ తర్వాత ఆరు నుంచి తొమ్మిది నెలలు రెస్ట్ తీసుకోవాలని డాక్టర్లు చెప్పారట.. ఈ నేపథ్యంలో ప్రభాస్ ఆరోగ్యం ఇప్పుడు ఎలా ఉందనేది మిలియన్ డాలర్ల ప్రశ్న.. ?
ఆపరేషన్ తర్వాత ప్రభాస్ నవంబర్ 19న ఇండియాకు వచ్చి ఇంట్లో రెస్ట్ తీసుకుంటున్నారని సమాచారం.. అయితే ఇప్పటికీ నడవలేకపోతున్నారట.. స్ట్రెచర్ సహాయంతో మాత్రమే నడుస్తున్నారట.. అందుకు సలార్ మూవీకి ప్రీరిలీజ్ ఫంక్షన్ ఏర్పాటు చేయలేదు.. కనీసం సక్సెస్ మీట్ లో కూడా ప్రభాస్ కనిపించలేదు. అనే వార్త ఫిల్మ్ నగర్ లో చక్కర్లు కొడుతోంది.. అయితే ఈ విషయాన్ని బయటకు ఎందుకు చెప్పడం లేదంటూ ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.. అసలు డార్లింగ్ క్షేమంగానే ఉన్నారా.. అన్న సమాచారం కోసం ఎదురుచూస్తున్నారు. మరో విషయం కూడా బయటకు పొక్కింది.. ఈనెల ఐదో తేదీన ప్రాజెక్ట్ కే షూటింగ్ ప్రారంభ కార్యక్రమం బ్యాంకాక్ లో జరగాలి.. కానీ ప్రభాస్ అనారోగ్యం కారణంగా అది రద్దు అయినట్లు తెలుస్తోంది.. ఈ కార్యక్రమం కోసం అప్పటికే బ్యాంకాక్ చేరుకున్న అమితాబ్ కూడా తన ట్రిప్ రద్దు చేసుకుని ఇండియా వచ్చేసినట్లు తెలుస్తోంది.
మరో వార్త కూడా చక్కర్లు కొడుతోంది.. ప్రభాస్ ఇటలీలో ఒక ఖరీదైన విల్లా కూడా కొన్నట్లు సమాచారం.. తనకు ఆపరేషన్ చేసిన డాక్టర్ ఇటలీ వ్యక్తి కావడంతో పోస్ట్ ఆపరేషనల్ రెస్ట్ కోసం అక్కడే ఒక ఇల్లు కూడా కొనేశాడట డార్లింగ్.. ఏది ఏమైనా ప్రస్తుతం ప్రబాస్ ఎలా ఉన్నారు.. తను ఇంకా ఎన్నాళ్లకు బయటకు వస్తారు.. ఆపరేషన్ సక్సెస్ అయిందా లేదా.. ?. ఇలాంటి వార్తలు మాత్రం టాలీవుడ్ వీధుల్లో చక్కర్లు కొడుతున్నాయి.. డార్లింగ్ మీరు తొందరగా కోలుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం..గెట్ వెల్ సూన్.. by Telugu World Now