For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

Viral Video : పాకిస్తాన్ పరిస్థితి చూస్తే మన దేశ గొప్పతనం కచ్చితంగా అర్థమవల్సిందే..!

04:22 PM Jan 02, 2023 IST | Sowmya
Updated At - 04:22 PM Jan 02, 2023 IST
viral video   పాకిస్తాన్ పరిస్థితి చూస్తే మన దేశ గొప్పతనం కచ్చితంగా అర్థమవల్సిందే
Advertisement

Viral Video ఎంతమంది జనాన్ని ఒకసారిగా చూసి అందరూ ఏమనుకుంటారు ఏదో క్రికెట్ మ్యాచ్ చూడటానికి స్టేడియానికి వచ్చారు అని అనుకుంటే మాత్రం కచ్చితంగా తప్పే ఇది ఓ దేశంలో నిరుద్యోగ పరిస్థితిని కళ్ళకు కట్టినట్టు చూపించే దౌర్భాగ్య పరిస్థితి..

మన దేశం ఎంత గొప్పదైన ఎన్ని సదుపాయాలు కల్పించిన కొందరు మాత్రం అదే పనిగా దేశాన్ని తిడుతూ ఉంటారు దేశం మాకు ఏమిచ్చింది అని ప్రశ్నించే ఈ యువత ఒక్కసారి వేరే దేశాల పరిస్థితి ఏంటి అనేది తెలుసుకుంటే ఎంత గొప్పదో అనే విషయాన్ని అర్థం చేసుకోవచ్చు మన పక్క దేశమైన పాకిస్తాన్ నిరుద్యోగంతో విలవిలలాడుతుందో చెప్పడానికి నిదర్శనమే ఈ వీడియో.

Advertisement GKSC

పాకిస్తాన్లో పోలీస్ రిక్రూట్మెంట్ పరీక్ష నిర్వహించటానికి ఇలా అందర్నీ క్రికెట్ స్టేడియంలో కూర్చోబెట్టి రాత పరీక్ష ఒకేసారి నిర్వహించారు ఎంతమంది వచ్చారు అంటే పోస్ట్లు వేలల్లో ఉన్నాయి అని అనుకుంటే కచ్చితంగా తప్పే 1100 పోస్టులకు 32,000 మంది పరీక్ష రాయటానికి వచ్చారు అంటే దీనిబట్టి అర్థం చేసుకోవచ్చు నిరుద్యోగం ఏ స్థాయిలో ఉంది అనేదాన్ని.. పోనీ ఇదేంటి విడివిడిగా పరీక్ష కేంద్రాల్లో కూర్చోబెట్టి పరీక్ష రాయించొచ్చు కదా అంటే అక్కడ అవకాశం కూడా లేదు ప్రస్తుత మా దేశం ఎంత ఆర్థిక సంక్షోభంతో నలిగిపోతుంది అంటే దేశ జనాభాలో దాదాపు 30 శాతం మందికి ఎలాంటి ఉపాధి లేకుండా ఉంది దీంతో చేసేదిలేక యువత అందరూ ఇలా అతి తక్కువ పోస్టులు ఉన్నప్పటికీ వాటి కోసం విపరీత స్థాయిలో పోటీ పడుతున్నారు.. పాకిస్తాన్ జనాభాలో 60 శాతం మంది 30 ఏళ్లలోపు వారే కావడం మరో విశేషం.

కనీసం పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసి వారికి పరీక్ష నిర్వహించే స్తోమత కూడా లేని పరిస్థితుల్లో ఉంది పాకిస్తాన్ దీంతో చేసేదిలేక ఆ యువత అందరూ ఇలా ఒక దగ్గరికి వచ్చి కూర్చుని పరీక్ష రాయడానికి పోటీపడ్డారు దీన్ని బట్టి చూస్తే మనం ఎంత మంచి స్థాయిలో ఉన్నామో మనకి అర్థమవుతుంది ఉన్న అవకాశాలు అన్ని వదులుకుంటూ జీవితాన్ని అనవసరమైన విషయాలతో నాశనం చేసుకునేవారు ఇలాంటివారిని ఒక్కసారి గుర్తుతెచ్చుకుంటే నిజమైన జీవితం ఏంటో తెలుస్తుంది.

Advertisement
Author Image