For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

రాజ గౌతమ్ బ్రహ్మ ఆనందం నుంచి 'పద్మశ్రీ' బ్రహ్మానందం ఫస్ట్ లుక్ రిలీజ్

11:09 PM Aug 16, 2024 IST | Sowmya
Updated At - 11:30 PM Aug 16, 2024 IST
రాజ గౌతమ్ బ్రహ్మ ఆనందం నుంచి  పద్మశ్రీ  బ్రహ్మానందం ఫస్ట్ లుక్ రిలీజ్
Advertisement

హాస్య బ్రహ్మ, పద్మశ్రీ బ్రహ్మానందం, అతని కుమారుడు రాజా గౌతమ్ ఔట్ అండ్ ఔట్ఎంటర్‌టైనర్ 'బ్రహ్మ ఆనందం'లో తాత, మనవళ్ళుగా అలరించబోతున్నారు. ఈ చిత్రానికి ఫస్ట్ -టైమర్ RVS నిఖిల్ దర్శకత్వం వహిస్తున్నారు. స్వధర్మ్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై రాహుల్ యాదవ్ నక్కా నిర్మిస్తున్నారు. సావిత్రి, శ్రీ ఉమేష్ యాదవ్ సమర్పిస్తున్నారు.

మేకర్స్ మూవీ నుంచి బ్రహ్మానందం ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. ఫస్ట్ లుక్ లో సంప్రదాయ పంచె కట్టులో, సంతోషకరమైన చిరునవ్వుతో ఆకట్టుకున్నారు. ఫస్ట్ లుక్ పోస్టర్ పాజిటివ్ ఇంప్రెషన్‌ని కలిగిస్తుంది. మేకర్స్ అనౌన్స్ చేసినట్లుగా, ఈ చిత్రం ఫస్ట్ గ్లింప్స్ ఆగస్ట్ 19 న విడుదల అవుతుంది. స్వధర్మ్ ఎంటర్‌టైన్‌మెంట్స్100% సక్సెస్ రేట్‌తో న్యూ ఏజ్ కంటెంట్ బేస్డ్ సినిమాలను రూపొందిస్తోంది. వారి గత చిత్రాలు మళ్లీ రావా, ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ, మసూద బాక్సాఫీస్ వద్ద మంచి ఫలితాలను అందించాయి. దీంతో ఈ సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి.

Advertisement GKSC

ప్రియా వడ్లమాని, ఐశ్వర్య హోలక్కల్ హీరోయిన్స్ గా కనిపించనున్నారు. వెన్నెల కిషోర్ ఫుల్ లెంగ్త్ రోల్ పోషిస్తుండగా, సంపత్, రాజీవ్ కనకాల కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి శాండిల్య పిసాపాటి మ్యూజిక్ అందిస్తున్నారు.  మితేష్ పర్వతనేని డీవోపీ గా పని చేస్తున్నారు. ప్రసన్న ఎడిటర్.

Cast : Raja Goutham, Brahmanandam, Vennela Kishore, Priya Vadlamani and Aishwarya Holakkal, Sampath, and Rajeev Kanakala

Technical Crew :
Writer & Director: RVS Nikhil
Producer: Rahul Yadav Nakka
Banner: Swadharm Entertainment
Presents: Smt. Savithry and Sri Umesh Yadav
DOP: Mitesh Parvathaneni
Music director: Sandilya Pisapati
Editor: Prasanna
Art Director: Kranthi Priyam
Executive Producer: P Dayakar Rao
PRO: Vamsi Shekar
Publicity Designs: Mayabazar
Marketing: First Show

Advertisement
Author Image