For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

ఖచ్చితంగా OC సినిమా ప్రేక్షకులను అలరిస్తుంది : కాటపల్లి వెంకటరమణారెడ్డి MLA

12:38 PM Jun 02, 2024 IST | Sowmya
Updated At - 04:54 PM Jun 02, 2024 IST
ఖచ్చితంగా oc సినిమా ప్రేక్షకులను అలరిస్తుంది   కాటపల్లి వెంకటరమణారెడ్డి mla
Advertisement

కౌండిన్య ప్రొడక్షన్స్ పై బీవీస్ నిర్మాతగా, విష్ణు బొంపెల్లి దర్శకత్వంలో హరీష్ బొంపెల్లి, మాన్య సలాడి ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న చిత్రం ఓసి. ఈ రోజు ఘనంగా ఓసీ థియేట్రికల్ ట్రైలర్‌ ను విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి తెలుగు చిత్రపరిశ్రమ నిర్మాత, నటుడు మురళి మోహాన్, కామారెడ్డి ఎమ్మెల్యే కాటెపల్లి వెంకటరమణారెడ్డి, మాజీ డీసీపీ సుంకర సత్యనారాయణ ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ట్రైలర్ అనంతం జూన్ 7న విడుదల కాబోతున్న ఈ చిత్రం మొదటి టికెట్‌ను ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి చేతుల మీదుగా లాంచ్ చేసి, ఫస్ట్ టికెట్ ఆయనే తీసుకున్నారు. ఈ సందర్భంగా మీడియా సమావేశం నిర్వహించారు.

కామారెడ్డి ఎమ్మెల్యే కాటపల్లి వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ.. ఆయనకు సినిమాకు మంచి సంబంధం ఉందని, ఆయనకు ఉన్న ఏకైక అలవాటు సినిమాలు చూడడమే అని తెలిపారు. ఆయన దరువు, రజాకార్ తరువాత ఇప్పుడు ఓసీ సినిమా వేడుకకే వచ్చినట్లు పేర్కొన్నారు. ఈ చిత్రం డైరెక్టర్, హీరో తమ ప్రాంతం వారేనని, ఈ విషయంలో ఆయన గర్వపడుతున్నట్లు వెల్లడించారు. చిత్ర పరిశ్రమలో విజయం సాధించాలంటే మాములు విషయం కాదని, ఎంతో ట్యాలెంట్, ఓపిక ఉండాలని ఆ రెండు ఈ ఇద్దరి అన్నదమ్ములకు ఉందని డైరెక్టర్, హీరోలను ఉద్దేశించి అభినందించారు. ఇలాగే వీరు మంచి చిత్రాలను చేయాలని, మరెందరికో స్పూర్తిగా నిలువాలని ఎమ్మెల్యే అన్నారు. ఇక ట్రైలర్ బాగుందని, కచ్చితంగా ప్రేక్షకులను అలరిస్తుందని జూన్ 7న ఆయన సైతం థియేటర్ కు వెళ్లి సినిమా చూస్తానన్నారు.

Advertisement GKSC

Advertisement
Author Image