ముఖ్యమంత్రి కేసిఆర్ గారి చొరవతో మృత్యువును జయించిన "మానస"
*ముఖ్యమంత్రి కేసిఆర్ రాజకీయ కార్యదర్శి, ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి చొరవతో కోలుకున్న మానస
*18 రోజులపాటు నిమ్స్ డాక్టర్ల కృషి ఫలితంగా మృత్యుముఖం నుండి శిశువు చెంతకు
*నిమ్స్ ఆసుపత్రి నుండి ఆరోగ్యంతో డిశ్చార్జ్ అయినట్లు వైద్యాధికారుల ప్రకటన
*క్షణం క్షణం... మానస ఆరోగ్యంపై సమీక్షించిన తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ
నిజామాబాద్ కు చెందిన మదన్ కుమార్ సతీమణి మానస నిండుగర్భిణి. మదన్ కుమార్ మానసను నిజామాబాద్ ఆసుపత్రికి పురుడు కోసం గత నెల 21వ తేదీన తీసుకెళ్ళారు. మత్తు మందు ఇచ్చాక.... సిజేరియన్ శస్త్రచికిత్స చేసే సమయంలో పుట్టే బాబు అవయవాలు బయటకు వచ్చాయని ఆపరేషన్ చేయకుండా హైదరాబాద్ నీలోఫర్ ఆసుపత్రికి రెఫర్ చేశారు.... అక్కడ పరీక్షించిన డాక్టర్లు.... శిశువు పరిస్థితి ఆందోళనకరంగా ఉందని కుటుంభ సభ్యులకు చెప్పడంతో వారు ఆందోళనకు గురయ్యారు.
ఇక్కడ కూడా ఆపరేషన్ చేయమని, నార్మల్ డెలివరీ చేస్తామనడంతో మానస మానసిక క్షోభకు గురైంది. కుమిలి కుమిలి ఏడ్చింది.... స్పృహ తప్పి పడిపోయింది.... తప్పని పరిస్థితుల్లో మానస కు సీజరింగ్ చేసి బాబును బయటకు తీశారు...
ఈ నేపథ్యంలో మహిళా కమీషన్ చైర్మన్ , మాజీ మంత్రి సునీతాలక్ష్మారెడ్డి స్పందించి.... నీలోఫర్ సూపరిండెంట్ తో మాట్లాడారు. మానస పరిస్థితి రోజు రోజుకు విషమించడంతో నీలోఫర్ ఆసుపత్రిలో డాక్టర్లు చేతులెత్తేసారు.
మీడియా ద్వారా విషయం తెలుసుకున్న కేసిఆర్ రాజకీయ కార్యదర్శి.... మెదక్ ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి వెంటనే స్పందించారు.
ముఖ్యమంత్రి కార్యాలయ ఓఎస్డి, వైద్యశాఖ మంత్రి ఈటెల రాజేందర్ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఫిబ్రవరి 28వ తేదీన ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు... అప్పటికే మానస ఆరోగ్యం పూర్తిగా క్షీణించింది. ఈ స్థితిలో... మరిన్ని వైద్యసేవలు అందించడం కోసం... ఆరోగ్యశాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మార్చి1వ తేదీన నిమ్స్ ఆసుపత్రికి తరలించారు... వెంటిలెటర్ మీద దాదాపు పదిరోజుల పాటు ప్రాణాలతో కొట్టుమిట్టాడింది మానస.
డా. వరుణ్, డా. ముకుంద, డా. రూపం, డా. రుక్మిణి మృదులతో పాటు అనేక మంది డాక్టర్ల పర్యవేక్షణలో వైద్యులు మానస ప్రాణాలు కాపాడడంలో వైద్యులు సఫలీకృతమయ్యారు.... మానస ప్రాణాలతో బయటపడింది.... గురువారం రాత్రి నిమ్స్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయ్యింది... పాల కోసం.... తల్లి ఒడి కోసం... 22 రోజులుగా ఎదురుచూస్తున్న మానస పుత్రుడు తల్లి ఒడిలోకి చేరాడు. బిడ్డను చూసిన తల్లి మానస సంతోషపడింది.
మానస గర్భసమయంలో... ఏర్పడ్డ ఒక వ్యాధి వల్ల ఈ పరిస్థితి ఏర్పడిందని.... డా. ముకుంద తెలిపారు. ఆసుప్రతిలో కోవిడ్-19 వైరస్ తదితర వ్యాధులు సోకే ప్రమాదం ఉన్న దృష్ట్యా ఆసుపత్రి కన్న డిశ్చార్జి చేయడమే మంచిదని భావించి... సమిష్టిగా డాక్టర్ లు అందరం నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. మానసకు ప్రమాద పరిస్థితి నుండి బయట పడిందని... కొంతకాలం... కుటుంభ సభ్యులు సూచించిన మందులను వారు వాడుకోవాలని అలాగే ఫిజియోథెరపి చేయించాలని వారు సూచించారు. రెండు వారాల తరువాత నిమ్స్ ఆసుపత్రికి పరిశీలన కోసం తీసుకురావాల్సిందిగా తెలిపారు.
కృతజ్ఞతలు తెలిపిన మానస... కుటుంభ సభ్యులు....
ప్రాణాలతో బయట పడడం కోసం.... రాష్ర్ట ప్రభుత్వం, కేసిఆర్ రాజకీయ కార్యదర్శి, ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి.... తెలంగాణ మహిళా కమీషన్, మాజీ మంత్రి సునీతారెడ్డి, ఆరోగ్యశాఖ మంత్రి ఈటెల రాజేందర్, నిమ్స్ డాక్టర్లు, సిబ్బందికి పేరుపేరున కృతజ్ఞతలు తెలిపారు.
