Nidhhi Agerwal: నేడు పుట్టిన రోజు జరుపుకుంటున్న ముద్ధు గుమ్మ నిధి అగర్వాల్ ..హరిహర వీరమల్లు సినిమా యూనిట్ స్పెషల్ విషెస్ ...
Nidhhi Agerwal: అక్కినేని నాగ చైతన్య సరసన "సవ్యసాచి" సినిమాలో నటించి టాలీవుడ్ కి పరిచయం అయింది ” నిధి అగర్వాల్ “. ఆ తర్వాత అఖిల్ హీరోగా వచ్చిన మిస్టర్ మజ్నులో కూడా నటించింది నిధి. డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తెరకెక్కించిన "ఇస్మార్ట్ శంకర్" చిత్రం బ్లాక్‌బస్టర్ కావడంతో అమ్మడి దశ మారిపోయింది. ప్రస్తుతం వరస సినిమాలు చేస్తుంది నిధి. ముఖ్యంగా తమిళ్‌లో ఈమెకు అదిరిపోయే క్రేజ్ ఉంది. ప్రస్తుతం ఈమె పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న హరిహర వీరమల్లు సినిమాలో నటిస్తుంది. సోషల్ మీడియా లోనూ యాక్టివ్ గా ఉండే ఈ భామ తన భారీ అందాలను ఆరబోస్తూ కుర్రకారును ఫిదా చేస్తుంది.
నేడు పుట్టిన రోజు జరుపుకుంటున్న ఈ భామ 29 వ ఏట అడుగుపెడుతుంది. దీంతో ఆమె అభిమానులు అంతా సోషల్ మీడియాలో నిధికి పుట్టిన రోజు శుభాకాంక్షలు చెబుతూ ట్రెండ్ క్రియేట్ చేస్తున్నారు. మొత్తానికి నిధులు పేరుతో సోషల్ మీడియాలో మోత మోగుతుంది.ఈ అమ్మడు తన గ్లామర్ తో కుర్రకార్ల ను భాగానే ఆకట్టుకుంది . తన గ్లామర్ తో సోషల్ మీడియాలో ఎక్కువగానే ఫాలోయింగ్ సంపాదించింది .
ప్రస్తుతం క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న “హరిహర వీరమల్లు” సినిమాలో పవన్ నటిస్తున్నారు. పిరియాడికల్ యాక్షన్ డ్రామాగా వస్తున్న ఈ సినిమా మొఘలుల కాలంనాటి కథాంశంతో తెరకెక్కుతుంది. దాదాపు రూ.200 కోట్ల బడ్జెట్ తో చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమా పాన్ ఇండియా వైడ్ విడుదల కానుంది. కాగా ఈ సినిమాలో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుంది. మెగా సూర్య ప్రొడక్షన్ నిర్మిస్తున్న ఈ సినిమాకు కీరవాణి సంగీతం అందిస్తున్నాడు. ప్రస్తుతం పవన్ వేరే సినిమాలు, రాజకీయాల కారణంగా ఈ సినిమా రిలీజ్ లో జాప్యం జరుగుతుంది